Dandepalli
-
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
కట్నం తేకుంటే చచ్చిపో..
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. దీంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఎస్సై విజయ్‌కుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన ఆముదాల ప్రసూణ(మహాతి) (21)కు వెల్గటూర్ మండలం స్తంభంపెలి్లకి చెందిన తర్ర రాకేష్‌తో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.11లక్షల నగదు తోపాటు, రూ.4లక్షల బంగారు ఆభరణాలు, మరో రూ.2లక్షల సామగ్రిని కట్నంగా అందించారు. ఆ తరువాత అదనంగా మరో ఐదు లక్షలు కట్నం తేవాలని భర్త, అత్త, మామ, ఆడబిడ్డ మానసికంగా, శారీరకంగా వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పింది. ఒప్పుకున్నకాడికి కట్నం ఇచ్చానని, అదనపు కట్నం ఇవ్వలేదనని బాధితురాలి తండ్రి చెప్పాడు. 2018లో ప్రసూణకు ఆడపాప జన్మించింది. అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం తేవాలని, లేకుంటే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. గదిలో బందించి దాడి చేశారు. విషయం తండ్రికి ఫోన్‌చేసి చెప్పడంతో 15రోజుల క్రితం తండ్రి తన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. అయినా రాకేష్ పదేపదే ఫోన్‌చేసి కట్నం తీసుకురాకుంటే చచ్చిపో అని అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఈ నెల 8న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మళ్లీ కరీంనగర్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందింది. దీంతో చిన్నారి పాప అనాథగా మారింది. తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రసూణ మృతదేహం.. -
పైప్‌లైన్ మరమ్మతుల్లో ఒకరు మృతి
సాక్షి, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పైప్‌లైన్ మరమ్మతు పనుల్లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గూడెం గ్రామానికి చెందిన సాయి(18) పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. పక్కనే ఉన్న మట్టిపెళ్ల అతనిపై పడడంతొ అతను మృతిచెందాడు. ఇతను పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట చౌరస్తా వద్ద మృతదేహంతో అతని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేస్తున్నారు. -
భార్య అదృశ్యం.. భర్త ఆత్మహత్య
దండేపల్లి: భార్య కనిపించకుండా పోవటంతో మనస్తాపం చెందిన భర్త బలవన్మరణం చెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చుంచు రమేష్(35) భార్య సునీత రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. -
వైద్యుడి కోసం రాస్తారోకో
దండేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఇన్చార్జి డాక్టర్ మాత్రమే ఉన్నారు. శాశ్వత వైద్యుడు లేకపోవటంతో సేవలు సరిగా అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఎదుట రహదారిపై శనివారం మధ్యాహ్నం రాస్తారోకోకు దిగారు. దీంతో ఇన్చార్జి వైద్యుడు నవీన్ వారి వద్దకు వచ్చి.. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. -
వ్యవసాయ బావిలో రైతు గల్లంతు
మోటార్ పైపుకున్న ఫుట్‌బాల్‌ను సరిచేసేందుకు బావిలో దిగిన ఓ రైతు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో శనివారం మధ్యాహ్నం బుచ్చిమల్లు (40) అనే రైతు భార్య కుమారుడితో కలసి పొలానికి వెళ్లాడు. పొలంలోని బావికి ఏర్పాటు చేసిన మోటార్ నీరు తోడకపోయేసరికి దాన్ని సరిచేసేందుకు బుచ్చిమల్లు బావిలోకి దిగాడు. భార్య, కుమారుడు పైన తాడు పట్టుకోగా, దాని సాయంతో లోపలికి దిగిన బుచ్చిమల్లు అరగంట అయినా తిరిగి పైకి రాలేదు. దీంతో వారు కేకలు వేయగా చుట్టుపక్కల రైతులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అంగన్వాడీలకు భవనాలు కరువు
దండేపల్లి, న్యూస్‌లైన్ :లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లోనే అధికంగా కొనసాగుతున్నాయి.పక్కా భవనాల కోసం సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో నిర్వాహణ అస్తవ్యస్తంగా తయారైంది. లక్సెట్టిపే ట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాలు ఉన్నా యి. ఐదు మండలాల్లో 291అంగన్వాడీ కేంద్రాలున్నా యి. వీటిలో 59 కేంద్రాలకు పక్కా భవనాలు ఉన్నాయి. 41 కేంద్రాలు అద్దె లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో, నిరుపయోగంగా ఉండే ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 191 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో నిర్వహించే వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులకు నెలనెల అద్దెరాక, వ సతులు లేక నిర్వహణ కాస్తా ఇబ్బందిగా మారింది. ఇ ప్పటిదాక గ్రామీణ పరిధిలో నెలకు రూ.200, పట్టణ ప్రాంతాల్లో రూ.750చెల్లించే వారు. అయితే ఇటీవల అ ద్దెను పెంచారు. పట్టణ ప్రాంతాల్లో రూ.3,000, గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.750 చెల్లించడం జరుగుతుంది. కాని అది ఎక్కడా అమలు కావడం లేదు. అద్దె పెంచడంతోపాటు కేంద్రాల్లో వసతులు ఉండాలని చెప్పడంతో వాటికి అనువుగా భవనాలు దొరకని పరిస్థితి. పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రాజెక్టు అధికారులు పట్టించుకోక పోవడంతో పక్కా భవనాల నిర్మాణం చేపట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పక్కా భవనాలు లేని కేంద్రాలకు భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. వంటకు తంటాలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు రోజు శెనగలు, ఇతర స్నాక్స్ వంటివి వండి పెట్టాలి. అయితే కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చినట్లుగా అంగన్వాడీ కార్యకర్తలు చెపుతున్నా లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలోని ఏ ఒక్క కేంద్రానికి ఇంతవరకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వక పోవడంతో కట్టెల పొయ్యిలపై వండిపెడుతూ ఇబ్బందులు పడుచున్నారు. -
బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
దండేపల్లి, న్యూస్‌లైన్ :మండలంలోని మేదరిపేట బస్టాండ్ వద్ద బుధవారం బస్సు ఢీకొని జన్నారం మండలం మందపెల్లికి చెందిన వృద్ధురాలు కోమటి నర్సవ్వ తీవ్రంగా గాయపడింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. నర్సవ్వ మంగళవారం మామిడిపల్లిలో ఉంటున్న కొడుకులు మల్లయ్య, ప్రసాద్ ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం ఉడుంపూర్లో ఉన్న కూతురు ఇంటికి వెళ్లేందుకు మేదరిపేట బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు టైరు ఆమె ఎడమకాలు పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జరుు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.