దండేపల్లి, న్యూస్‌లైన్ :లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లోనే అధికంగా కొనసాగుతున్నాయి.పక్కా భవనాల కోసం సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో నిర్వాహణ అస్తవ్యస్తంగా తయారైంది. లక్సెట్టిపే ట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాలు ఉన్నా యి. ఐదు మండలాల్లో 291అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. వీటిలో 59 కేంద్రాలకు పక్కా భవనాలు ఉన్నాయి. 41 కేంద్రాలు అద్దె లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో, నిరుపయోగంగా ఉండే ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు.
191 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో నిర్వహించే వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులకు నెలనెల అద్దెరాక, వ సతులు లేక నిర్వహణ కాస్తా ఇబ్బందిగా మారింది. ఇ ప్పటిదాక గ్రామీణ పరిధిలో నెలకు రూ.200, పట్టణ ప్రాంతాల్లో రూ.750చెల్లించే వారు. అయితే ఇటీవల అ ద్దెను పెంచారు. పట్టణ ప్రాంతాల్లో రూ.3,000, గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.750 చెల్లించడం జరుగుతుంది. కాని అది ఎక్కడా అమలు కావడం లేదు. అద్దె పెంచడంతోపాటు కేంద్రాల్లో వసతులు ఉండాలని చెప్పడంతో వాటికి అనువుగా భవనాలు దొరకని పరిస్థితి. పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రాజెక్టు అధికారులు పట్టించుకోక పోవడంతో పక్కా భవనాల నిర్మాణం చేపట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పక్కా భవనాలు లేని కేంద్రాలకు భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
వంటకు తంటాలు
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు రోజు శెనగలు, ఇతర స్నాక్స్ వంటివి వండి పెట్టాలి. అయితే కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చినట్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చెపుతున్నా లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలోని ఏ ఒక్క కేంద్రానికి ఇంతవరకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వక పోవడంతో కట్టెల పొయ్యిలపై వండిపెడుతూ ఇబ్బందులు పడుచున్నారు.
అంగన్‌వాడీలకు భవనాలు కరువు
Published Sat, Mar 8 2014 2:38 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement