Dasari Arun Kumar
-
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు దాసరి అరుణ్
-
ర్యాష్ డ్రైవింగ్... టాలీవుడ్ హీరోపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మోతాదుకు మించి మద్యంతాగి బస్తీల్లో అదుపుతప్పిన వేగంతో కారును నడుపుతూ రోడ్డు పక్కన వాహనాలను ఢీకొట్టిన ఘటనలో సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్(47)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–71లో నివసించే దాసరి అరుణ్‌కుమార్ బుధవారం సాయంత్రం తన మారుతి స్విఫ్ట్ కారులో ఫిలింనగర్ క్లబ్‌కు షటిల్ ఆడేందుకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నేహితుడు ప్రశాంత్ మరొకరితో కలిసి రాత్రి 11 గంటల వరకు మద్యం సేవించాడు. కొంతకాలంగా మద్యం సేవించిన అనంతరం మత్తులో తన ఇంటిదారి మరిచిపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలుపడంతో స్నేహితులు రాత్రి మద్యం తాగిన తర్వాత అరుణ్‌కుమార్ కారు ఎక్కగానే వెనుకాల అనుసరిస్తూ వెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లేసరికి అరుణ్‌కుమార్ కారును స్పీడ్‌గా బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 వైపు పోనిచ్చాడు. వెనుకాల స్నేహితులు గుర్తించే లోపే కారును అదుపుతప్పిన వేగంతో తీసుకెళ్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 కమాన్లోపల సయ్యద్‌నగర్ బస్తీలోకి వెళ్లాడు. 11.20 గంటల ప్రాంతంలో సయ్యద్నగర్బస్తీలో రోడ్డు పక్కన ఆపిన ఐదు వాహనాలను ఢీకొట్టాడు. ఒక్కసారిగా అధిక శబ్ధం, వాహనాలను ఢీకొడుతున్న శబ్ధాలతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి చాకచక్యంగా అరుణ్ నడుపుతున్న కారును ఆపారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు అరుణ్ ప్రయత్నించగా స్థానికులంతా చుట్టుముట్టి కారును ఆపారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడుపుతున్న వ్యక్తి సినీహీరో దాసరి అరుణ్గా గుర్తించారు. అదే రాత్రి అరుణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కారు సీజ్ చేశారు. వెంటనే మద్యం మోతాదు పరీక్షలు నిర్వహించగా 405 బీఏసీగా తేలింది. బాధితులు సయ్యద్ అఫ్జల్అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 279, 336, ఎంవీ యాక్ట్ 185 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్రాసిటీకేసుపై విచారణ దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గత ఏడాది ఆగస్టు 16వ తేదీన నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు ఆ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. -
దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు
దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు దాసరి అరుణ్, దాసరి ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్ కోర్టు బుధవారం నోటీసులు పంపింది. వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమ శేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్ రావు సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. చదవండి: Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్ -
అట్రాసిటీ కేసు: స్పందించిన దాసరి అరుణ్ కుమార్
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించారంటూ అరుణ్ పై నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో అరుణ్ పై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా దీనిపై అరుణ్ స్పందించాడు. అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పాడు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే ఆయన ఎవరో తెలియదని చెప్పడంతో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారన్నాడు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్‌లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని పేర్కొన్నాడు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని, నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని వెల్లడించాడు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేగాక ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించాడు. -
దాసరి అరుణ్ పైఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్
-
దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్సోర్సింగ్ పనులు చేశారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ బాగా పరిచయం. 2018 నవంబర్ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. (చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్) ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్ చెప్పారు. ఈ నెల 13న రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఎఫ్ఎన్సీసీకి రమ్మని చెప్పగా చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్న పేరు చెడగొడుతున్నందుకు బాధగా ఉంది
‘‘ఈ నెల 24న తన డ్రైవర్‌తో పాటు దాసరి అరుణ్ మా గేటు దూకి ఇంట్లోకి వచ్చాడు. మద్యం తాగి వచ్చి నాపై, నా భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మా నాన్నగారి బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్నగారి వీలునామా ప్రకారం ఈ ఇంటికి ఆయన మనవరాలైన నా కూతురు అర్హురాలు. ఆస్తి కోసం దాసరి అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడు. దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాసరి ప్రభు. అలాగే మోహన్‌బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ వంటి పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కార మార్గాన్ని చూపాలంటున్నారు ప్రభు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ఏ శాఖకు సమస్య వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మా నాన్నగారు దాసరి నారాయణరావు ముందుకొచ్చి పరిష్కరించేవారు. అలాంటి దాసరి కొడుకులుగా పుట్టి ఆయన పేరుని చెడగొడుతున్నందుకు చాలా బాధగా ఉంది. అందరి ఇళ్లల్లో ఉన్నట్లు మా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేం దాసరి గారి పిల్లలం కాబట్టి ఇంత రచ్చ జరుగుతోంది. అన్నయ్య (దాసరి ప్రభు)కు, నాకు మధ్య ఉన్నవి వందకు వంద శాతం ఆస్తి గొడవలే’’ అంటున్నారు దాసరి అరుణ్‌కుమార్. శుక్రవారం అరుణ్‌పై అతని అన్న ప్రభు జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. గోడ దూకి తన ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై చేయి చేసుకున్నాడని అరుణ్‌పై ఆరోపించారు దాసరి ప్రభు. ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలను పంచుకోవడానికి శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు దాసరి అరుణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘నేను 24వ తేదీన 9.30 నిమిషాలకు ఫిలింనగర్ రోడ్ నం 47లోని మా ఇంటి (చనిపోయేవరకూ దాసరి ఉన్న ఇల్లు. ఇప్పుడు పెద్ద కుమారుడు ప్రభు తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉంటున్నారు)కి వెళ్లాను. ఆ రోజు సాయంత్రం 6.30 నాకు కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే, కలెక్ట్ చేసుకుందామని వెళ్లాను. అరగంట సేపు కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. మా ఇల్లే కదా అని గోడ దూకి వెళ్లాను. మా ఇంటి గోడను నాన్న (దాసరి నారాయణరావు) ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు దూకాను. అందులో తప్పేముంది? మా ఇల్లే కదా. మూడు రోజుల క్రితం అలా దూకిన తర్వాత కింద హాలు తలుపు తీసుకుని హాల్లోకి వెళ్లాను. ఎవరూ కనిపించకపోయేసరికి పైకి వెళ్లాను. అక్కడ ఉన్న అన్నయ్యతో ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే వెళ్లిపోతా’ అన్నాను. లేదని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తర్వాత జూబ్లీహిల్స్ ఎస్.ఐ. నవీన్‌గారు, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయన వచ్చి ‘గొడవ ఏంటండి’ అన్నారు. ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, తీసుకోవటానికి వచ్చా’నన్నాను. ఆయన నాకు డాక్యుమెంట్ ఇప్పించారు. ఆయన అక్కడ ఉండగానే నేనక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఇది జరిగిన రెండో రోజు నా మీద పోలీస్ కంప్లయింట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒకవేళ నేను ఎవరినైనా కొట్టుంటే ఆ రోజే కేస్ పెట్టాలి. ఒకరోజు గ్యాప్ తీసుకుని శుక్రవారం కేస్ ఫైల్ చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక అరగంట నాతో, మా చెల్లితో కూర్చుంటే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా మీడియాకు పరిగెడతాడు. గతేడాది మే నెల నుండి ఈ ఆస్తి గొడవలు ఉన్నాయి. అప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ‘మా తమ్ముడు నాకు అన్యాయం చేశాడు’ అని చెప్పారట. అప్పుడు సీఐ గారు ఫోన్ చేసి, ‘మీ బ్రదర్‌కి మీరు అన్యాయం చేశారని కేస్ పెట్టారు’ అన్నారు. అన్యాయం చేశానని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? డాక్యుమెంట్ ఏదైనా ఉందా? చెక్ ఉందా? ఉంటే చెప్పండని అడిగాను. అప్పటినుండి ఇలానే ఏదో ఒక గొడవ చేస్తున్నాడు. నేను అన్నయ్యతో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవటానికి రెడీ. కానీ, ఆయనే మీడియాకి వెళుతున్నారు. దానివల్ల ఏమీ రాదు. గతేడాదిగా ఆయన ఇంటర్వ్యూలు నేను నాలుగు చూశాను. ఇండస్ట్రీ పెద్దలు మాకేమీ చేయడంలేదు అంటారు. మా బ్రదర్ మాట్లాడితే మోహన్‌బాబు, మురళీమోహన్, సి.కల్యాణ్గార్ల చెబుతారు. అప్పటికీ నిన్న సి.కళ్యాణ్‌గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాను. సరేలే చూద్దాం అన్నారు. ఆయనేమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆ ఇంటి మీద కోర్టు ఆర్డర్ ఉంది. అదేంటంటే, మా ముగ్గురి అంగీకారంతోనే ఆ ఇంటిని అమ్మాలి. అలా కాకుండా ఏదైనా వీలునామా ఆయన దగ్గరుంటే చూపించమనండి, నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు. ‘ఈ ఇంట్లో మీరు ఎందుకు ఉండటంలేదు’ అని అడిగిన ప్రశ్నకు అరుణ్ సమాధానమిస్తూ – ‘‘నాకు జూబ్లీహిల్స్‌లో ఇంకో ఇల్లు ఉంది. అక్కడ ఉంటున్నాను. ఈ ఇంటిని ఆఫీస్‌లా వాడుకుంటున్నాను. మా సిస్టర్‌కి వేరే ఇల్లుంది. ఆమె అక్కడ ఉంటుంది. మా అన్నయ్య డిప్రెషన్‌తో బాధపడుతున్నాడేమో అనుకుంటున్నా. ఆ ఇంటికి సంబంధించి మా ముగ్గురికీ సమానమైన హక్కుంది. ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కేస్ పెట్టడంతో రియాక్ట్ అవ్వక తప్పలేదు. పోలీస్, మీడియాను సంప్రదించే టైమ్‌ని మా అన్నయ్య నాకు, మా సిస్టర్‌కి కేటాయిస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. ది గ్రేట్ దాసరి నారాయణరావుగారి పేరు ఇలా బజారుకి ఎక్కేది కాదు. నాకైతే ఎటువంటి సమస్య లేదు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి క్లియర్ చేసుకోమని పత్రికా ముఖంగా మా అన్నయ్యకు చెబుతున్నాను. చిరంజీవిగారు మా సమస్యని సాల్వ్ చేస్తున్నారని కొన్ని మీడియా హౌస్‌లు రాస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అనవసరంగా ఆయన్ను ఇందులోకి లాగుతున్నారు’’ అన్నారు. -
నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్ స్పందించారు. ఇంటికి గోడ దూకి వెళ్లింది నిజమేనని, కానీ దాడిమాత్రం చేయలేదని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) ‘ఈ నెల 24న గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమే. ఇటీవల నాకు కొరియర్ వచ్చింది. తీసుకోవడానికి వెళ్లాను. బెల్ కొడితే డోర్ తీయలేదు. అందుకే గోడదూకాను. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడు. నా డాక్యుమెంట్ ఇస్తే వెళ్లిపోతానని చెప్పాను. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే నా డాక్యుమెంట్ తీసుకొని వెళ్లాను. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి? నేను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా? పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్లు కదా? ప్రభు ఉంటున్న ఇల్లు ముగ్గురిది. మా సోదరితో పాటు నాకు దాంట్లో పొత్తు ఉంది. అన్నయ్యకు,నాకు, సోదరికి ఎలాంటి వివాదాల్లేవు. ఆయన డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ప్రతిసారి మీడియా, పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. ఆస్తి వివాదంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇంటికి కాలింగ్ బెల్ లేదు : దాసరి ప్రభు కాగా, దాసర్ అరుణ్ ఆరోపణపై ఆయన సోదరుడు ప్రభు స్పందించారు. తాను ఎలాంటి డిప్రెషన్లో లేనన్నారు. అరుణ్ కావాలనే అర్థరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడని ఆరోపించారు. తమ ఇంటికి కాలింగ్ బెల్ లేదని, అలాంటప్పుడు ఆయన కాలింగ్ బెల్ ఎలా కొట్టాడని ప్రశ్నించారు.తనకు ఫోన్ చేస్తే కచ్చితంగా గేట్లు తీసేవాడినన్నారు. అరుణ్ వెనుక కొంతమంది ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. తాను ఆర్థికంగా బాగాలేనని, అందుకే సినీపెద్దలను ఆశ్రయించానని చెప్పారు. -
ఆస్తి తగదా: మీడియా ముందుకు దాసరి అరుణ్
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్ స్పందించారు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దాసరి అరుణ్ మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు) జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్-ప్రభు తగువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు. సినీ పెద్దలు కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని దాసరి పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు. -
దాసరి కుటుంబంలో ఆస్తి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రాజుకుంది. ఆయన కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్‌గా నిలిచినటువంటి దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి పంచాయితీ నెలకొనడం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి త్వరగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడాలని పలువురు వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. ‘ ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అర్జున్ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్, మురళీమోహన్, మోహన్‌బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. -
వైఎస్ జగన్ ఆదేశిస్తే ప్రచారం చేస్తా: దాసరి అరుణ్
-
జగన్ ఆదేశిస్తే ప్రచారం చేస్తా: దాసరి అరుణ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరా. జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు. మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాను. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీ వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. -
'సై రా'తో రీ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో ఓ స్టార్ వారసుడు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. దర్శక రత్న దాసరి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దాసరి అరుణ్ హీరోగా విజయం సాధించలేకపోయాడు. తరువాత క్యారెక్టర్ నటుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రకటించిన అరుణ్ కుమార్, సై రా తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. అంతేకాదు ఈసినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సై రా లాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే అరుణ్ కు మంచి కమ్ బ్యాక్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. -
అందరూ చూసే సినిమాలు తీస్తాం
‘‘చిన్నారుల నుంచి పెద్దల వరకూ కుటుంబమంతా చూసే చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో చిత్రపరిశ్రమకు వచ్చాను. అనుబంధాలు, ఆప్యాయతలకు అర్థం చెప్పే చిత్రాలు తీయాలని మా మనవరాలు వైష్ణవి పేరు మీద ఈ ‘వై.వి. కంబైన్స్’ను స్థాపించాం. దీన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థల సరసన నిలబెట్టాలన్నది మా ఆశయం’’ అన్నారు సత్యనారాయణ బొక్క. ఆయన సమర్పణలో మోహన్‌బాబు, శర్వానంద్‌ల ‘రాజు మహరాజు, అర్ధనారి’ సిన్మాల ఫేమ్ భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో వై.వి. కంబైన్స్ పతాకంపై హితేశ్ బొక్క ఓ సినిమా నిర్మించనున్నారు. శనివారం ఈ సంస్థ లోగోను ఆవిష్కరించిన దాసరి అరుణ్‌కుమార్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంచి కథను అందించమని భానుశంకర్‌ను కోరాను. ఎనిమిది నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆల్రెడీ నటీనటుల ఎంపిక పూర్తయింది. త్వరలో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం’’ అన్నారు సత్యనారాయణ బొక్క. ‘‘నిర్మాతలు లేకపోతే చిత్రపరిశ్రమ మనుగడ లేదు. అందుకే, నిర్మాత పరిచయంతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టా. త్వరలో చిత్రాన్ని ప్రారంభించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు భానుశంకర్. చిత్రనిర్మాత హితేశ్ బొక్క, భాను తదితరులు పాల్గొన్నారు. -
విలన్‌గా మరో హీరో..?
సీనియర్ హీరోలతో పాటు పెద్దగా ఫాంలోని లేని హీరోలందరూ ఇప్పుడు నెగెటివ్ రోల్స్ పై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ వారసుడు చేరబోతున్నాడట. చాలా కాలం కిందటే గ్రీకువీరుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దాసరి అరుణ్ కుమార్. దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా.. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అరుణ్. దీంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల దాసరి మరణించిన సమయంలో తన నాన్న కోరి నన్ను నటుడిగా చూడటమే అని చెప్పిన అరుణ్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో దాసరి అరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అరుణ్ కు నటుడిగా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. -
నాన్న ఇష్టాన్ని నెరవేరుస్తా!
‘‘నాన్న చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అసలిలా జరుగుతుందని ఊహించలేదు’’ అని దాసరి అరుణ్‌కుమార్ అన్నారు. ఇటీవల ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణం సినీ వర్గాలకు పెద్ద లోటు. ‘‘మా ఫ్యామిలీకి కూడా తీరని లోటు’’ అని అరుణ్ కుమార్ చెబుతూ– ‘‘నాన్న ఆపరేషన్‌కి వెళ్లే ముందు ధైర్యంగా కనిపించారు. ఇలా జరుగుతుందని ఆయన ఊహించలేదు. మేం కూడా ఊహించలేదు’’’ అన్నారు. మీ కెరీర్ పుంజుకుంటే బాగుంటుందని పలు సందర్భాల్లో దాసరిగారు అన్నారు. మీతో ఆ విషయం గురించి మాట్లాడేవారా? అనే ప్రశ్నకు – ‘‘సినిమాలు చెయ్యిరా.. ఎదగాలి’ అనేవారు. నేనేమో అంత ఇంట్రస్ట్ చూపించేవాణ్ణి కాదు. నాన్నకి బాధగా ఉండేది. ఆయన ఉన్నప్పుడు నాకేం అనిపించలేదు కానీ, ఇప్పుడు నాన్న ఇష్టాన్ని తీర్చాలనే సెంటిమెంట్ బలపడింది. అందుకే ఇకనుంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. హీరోగా చేస్తారా? అనడిగితే – ‘‘అలా ఆలోచిస్తే తప్పు అవుతుంది. హీరోగా చేయడం కరెక్ట్ కాదు. మంచి క్యారెక్టర్ రోల్స్, విలన్‌గా చేయాలనుకుంటున్నా’’ అని అరుణ్‌కుమార్ అన్నారు. మీ నాన్నగారిలా డైరెక్షన్ చేయరా? అనడిగితే – ‘‘డైరెక్షన్ చాలా చాలా టఫ్. నా వల్ల కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రం చూసుకోగలుగుతాను. నాన్న ఉన్నప్పుడు చూసేవాణ్ణి’’ అన్నారు.