dasari bhavan
-
ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమే పెద్దనోట్ల రద్దు
విజయవాడ (గాంధీనగర్) : పెద్దనోట్ల రద్దు ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. సామాన్యులు పాలకులను తిడుతున్నాయని, అంబానీ, అడ్వాణీ వంటి కోటీశ్వరులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. రూ.2వేల నోటు కారణంగా నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల్లో చెప్పిన విధంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో చంద్రబాబును కన్వీనర్‌గా నియమించడం బాధాకరమన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్ష మహిళా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవానీ మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ, మద్యనియంత్రణ, మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఏ.విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, కోశాధికారి పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. -
పనిభారం పెరిగినంతగా వేతనాలు పెరగలేదు
గాంధీనగర్ : కార్మికులపై పనిభారం పెరిగిందని, దానికి తగ్గట్టుగా వేతనాలు, కూలిరేట్లు పెరగలేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో పౌరసరఫరాల శాఖ ముఠా కార్మికుల సంఘ సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు కార్మిక శక్తిని, సంఘాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. వాటిని తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు అభివద్దికి ఆటంకమన్న చంద్రబాబు తనకుమారుడి నేతత్వంలో టీడీపీ అనుబంధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర సంఘాల్లో నాయకులను తమ సంఘం సభ్యులుగా చేరాలని టీడీపీ నాయకులు బలవంతం చేస్తున్నారన్నారు. యూనియన్ నాయకులు వెంటకసుబ్బయ్య, చల్లా చిన ఆంజనేయులు మాట్లాడుతూ అక్టోబర్ 31న ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. కార్మికుల సమస్యలపై నవంబర్ 18న కార్మిక సంక్షేమశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నవంబర్‌లో శ్రామిక మహిళా ఫోరం మహాసభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కొఠారి వెంకటరమణ, కామేశ్వరరావు, అంజిబాబు, వీరబాబు, మన్మథరావు,, గోవిందరావు పాల్గొన్నారు. -
సుబాబుల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
విజయవాడ(గాంధీనగర్) : సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని, ఎస్పీఎం బకాయిలను సెంట్రల్ మానిటరింగ్ ఫండ్ నుంచి రైతులకు చెల్లించాలని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘ సమావేశం తీర్మానించింది. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతు సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. ప్రతి కంపెనీ నుంచి కొనుగోలుకు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ క్వింటా మద్దతు ధర రూ. 4600 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా రేటు నిర్ణయించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన జీవో 143 ఉపసంహరించుకోవాలన్నారు. కొనుగోలు బకాయిలు చెల్లించని ఎస్పీఎం యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖా మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ధర అమలుకు రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని హనుమారెడ్డి కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏ వెంకటాచారి, పి నాగభూషణం, ఎన్.అంజిరెడ్డి పాల్గొన్నారు.