data pack rates
-
ఒక్క రూపాయి ప్లాన్‌పై జియో యూటర్న్! కారణం ఏంటంటే..
కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. ప్యాక్ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్’ జియో మేనేజ్మెంట్ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది. చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్! ఎలాగంటే.. -
ఎయిర్టెల్ నుంచి కొత్త డేటా టాప్అప్ ప్లాన్
కొంత కాలంగా స్థబ్ధుగా ఉన్న ఓటీటీలోకి ఈవారం నుంచే కొత్త సినిమాలు సందడి మొదలైంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతీ వారం మూడునాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మూవీస్ చూడాలంటే మొబైల్ డేటాతో చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్టెల్ సంస్థ కొత్త డేటా టాప్ అప్ ప్లాన్‌ని అమల్లోకి తెచ్చింది. డేటా ప్యాక్ రూ. 119 ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే రూ. 119 ప్యాక్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ టాప్ అప్ ప్యాక్‌తో 15 జీవీ 4జీ డేటా లభిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఏ ప్యాకేజీలో ఉన్నారో ఆ ప్యాకేజీ గడువు ముగిసే వరకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. కాల్స్, వ్యాలిడిటీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే ఈ ప్యాక్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి : డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’ -
'జియో క్రికెట్ ఫెస్టివల్': బంపర్ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్ యావత్తూ ఐపిఎల్ క్రికెట్ పండగ కోసం సిద్ధమవుతుండగా, జియో మరోసారి ఆసక్తికరమైన వినోదాన్ని తన కస్టమర్లకు పంచేందుకు ముందుకు వచ్చింది. క్రికెట్, కామెడీ మేళవించిన రెండు వినోద కార్యక్రమాలను విడుదల చేసింది. ‘జియో ధన్ ధనా ధన్ లైవ్’ 'జియో క్రికెట్ ప్లే అలాంగ్' , అనే కొత్త పథకాలను లాంచ్ చేసింది. దీంతోపాటు ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’ అనే కొత్త రీచార్జ్ పథకాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. జియో క్రికెట్ ప్లే అలాంగ్: జియో క్రికెట్ ప్లే అలాంగ్ పేరుతో ఆవిష్కరించిన లైవ్ మొబైల్ గేమ్ షో ద్వారా వినియోగదార్లు క్రికెట్‌ను ఆస్వాదించడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ మొబైల్ గేమ్ షో లో 25 కార్లను గెల్చుకునే అవకాశం. 7 వారాలు, 60 మ్యాచ్‌ల వరకు ఈ గేమ్ షో వినోదాన్ని పొందవచ్చు. ‘జియో ధన్ ధనా ధన్ లైవ్’: ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు క్రికెట్ తో పాటు స్వేచ్ఛమైన వినోదాన్ని అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఈ షో ఏప్రిల్ 7న ‘ మై జియో’ యాప్ లో అందుబాటులోకి వస్తుంది. జియో కస్టమర్లతో పాటు జియో యేతర కస్టమర్లు కూడా ఈ షోను ఉచితంగా వీక్షించవచ్చు. భారతదేశపు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్, ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కొచ్చర్ కామెడీ షో ను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇంకా శిల్పా షిండే, అలీ అస్గర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గణత్ర, శివాని దండేకర్ , అర్చన విజయ్ కూడా ఈ షోలో పాల్గొంటారు. అంతేకాదు క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను చూసే అవకాశం. జియో క్రికెట్ సీజన్ ప్యాక్: క్రికెట్ పండుగను దృష్టిలో ఉంచుకుని జియో సరికొత్త రీఛార్జి ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’ పేరుతో అందించనున్న ఈ ప్యాక్ ద్వారా రూ. 251 చెల్లించి 51 రోజులకు 102 జీబీ 4జీ డేటాను పొందే వీలుంది. ఈ కొత్త రీఛార్జి ప్యాక్ ద్వారా ప్రేక్షకులు తమకిష్టమైన ఐపిఎల్ మ్యాచ్ లను ‘జియో టీవీ’ యాప్ ద్వారా వీక్షించవచ్చు. -
ఐడియా ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ : టెలికాం సెక్టార్ లో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న హ్యాపీ అవర్స్ డేటాతో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ వినియోగదారుల ముందుకు రాగా.. ఇపుడు ఆ కోవలోకి మరో టెలికాం దిగ్గజం ఐడియా కూడా చేరిపోయింది. డేటా ప్యాక్ రేట్లలో 45శాతం కోత విధిస్తున్నట్టు ఐడియా సెల్యులార్ శుక్రవారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న ఐడియా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జీయో దీటుగా....తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ఐడియా ఈ సేవలను ఆవిష్కరించింది. 175 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్, తన 4జీ, 3జీ, 2జీ యూజర్లకు 1జీబీ డేటాలో 45 శాతం డేటా రాయితీని అందించనుంది. ఇప్పటివరకూ మూడు రోజుల 75ఎంబీ డేటాకు రూ.19 లు చార్జ్ చేసేవారు. అయితే ఈ 45శాతం ఆఫర్ కింద అదే చార్జ్ మీద 110ఎంబీ డేటాను ఇకనుంచి కస్టమర్లు పొందుతారు. అదేవిధంగా 4జీ/3జీ డేటా ప్యాక్ లో రూ.22లకు 65ఎంబీ డేటాను మూడు రోజుల పాటు వినియోగదారులు పొందేవారు. ప్రస్తుతం ..90ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. దీంతో 38శాతం ఎక్కువ డేటా సౌకర్యాన్ని కస్టమర్లకు అందుతాయి. రూ.8 నుంచి రూ.225 ల మధ్య విస్తృతమైన సాచెట్ డేటా ప్యాక్స్ ను కూడా ఐడియా ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ ఆఫర్లు అన్ని సర్కిల్స్ లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. గురువారమే ఎయిర్ టెల్ కూడా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డేటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.