data traffic
-
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..!
సాక్షి, అమరావతి: దేశంలో డేటా ట్రాఫిక్ పెరుగుతోంది. మొబైల్ వినియోగంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ఏకంగా 3.2 రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా.. 2027 నాటికి 46 జీబీకి చేరుకుంటుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే... ఒక వ్యక్తి ద్వారా నెలలో 136 శాతం డేటా వాడకం పెరగనుంది. దేశంలో చౌకగా మొబైల్ డేటా లభిస్తుండటంతోపా టు హైస్పీడ్ 5జీ నెట్వర్క్ విస్తరణతో డేటా విస్తతిలో గణనీ య మైన మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సంస్థలు వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ డేటా నెట్‌వర్క్‌ల కోసం సుమారు 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. 240 గంటలకు పైగా బ్రౌజింగ్ ప్రపంచ జనాభాలో దాదాపు 65.60 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. 4.60 బిలియన్ల మంది ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో అయితే 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరం అవుతోంది. భారత్‌లో అయితే, ప్రస్తుతం సగటున నెలకు ఒక వ్యక్తి 240 గంటలకుపైగా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారు. ఈ లెక్కన దేశం మొత్తం ఒక నెలకు డేటా వినియోగం 14 ఎక్సాబైట్లకు చేరుకుంది. ఇక్కడ ఒక ఎక్సాబైట్ ఒక బిలియన్ గిగాబైట్లకు సమానం. చౌకైన డేటా! ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ ఒక జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూకే డేటా గణాంకాల వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు స్మార్ట్ఫోను వినియోగిస్తుండటంతో ఇది అమెరికా కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్ల వ్యాప్తిని కలిగి ఉంది. తక్కువ రేటుకు మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇటలీ (0.12 డాలర్లు) రెండవ, భారత్ (0.17 డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. మరోవైపు అత్యంత ఖరీదైన డేటా ప్లాన్లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్ దీవుల్లో ప్రజలు ఒక జీబీ డేటా కోసం 38.45 డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్ హెలెనాలో అయితే 41.06 డాలర్లుగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇజ్రాయెల్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వెచి్చంచి మొబైల్ డేటాను కొనుగోలు చేస్తున్నారు. -
జియో నెలవారీ డేటా ట్రాఫిక్ తెలిస్తే షాక్!
ముంబై : రిలయన్స్ జియో... ఈ పేరు వింటేనే ఇప్పుడు టెలికాం దిగ్గజ కంపెనీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తూ.. వినియోగదారులకు డేటా సర్వీసుల వర్షం కురిపిస్తోంది. అయితే రిలయన్స్ జియో నెలవారీ డేటా ట్రాఫిక్ ఎంతో తెలిస్తే షాకవుతారు. నెలకు 110కోట్ల జీబీ కంటే ఎక్కువగానే జియో డేటా ట్రాఫిక్ ఉందట. రోజుకు 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలను జియో అందిస్తుందని తెలిసింది. 2016-17 ఆర్థిక సంవత్సర ఫలితాల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. చరిత్రలోనే ఉచిత సేవలనుంచి పెయిడ్ సర్వీసుల్లోకి మారిన అత్యంత పెద్ద కంపెనీ తమ జియోనేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా, వాయిస్ సర్వీసులను అందిస్తూ.. కస్టమర్లకు అత్యంత నాణ్యత సేవలందించడానికి అంకితభావంతో జియో ముందుకు వెళ్తుందని అంబానీ ప్రకటించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో ఈ టెలికాం వ్యాపార సేవలను గతేడాదే లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటి నుంచి మొన్నటిదాకా అంటే మార్చి ఆఖరి వరకు ఉచిత సేవలను అందించి, ఏప్రిల్ 1 నుంచే టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది ఈ కంపెనీ. తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు, పోస్టు పెయిడ్ కస్టమర్లకు బంపర్ రీఛార్జ్ ఆప్షన్లను అందిస్తోంది. రూ.19, రూ.49, రూ.96, రూ.149, రూ. 309, రూ.509, రూ.999, రూ.1,999, రూ.4,999, రూ.9,999 రీఛార్జ్ ఆప్షన్లను జియో తన వినియోగదారులకు కల్పిస్తూ.. అద్భుతమైన వాయిస్, వీడియో కాలింగ్, డేటా సర్వీసులను అందిస్తోంది. -
2016లో మేజర్ డేటా ట్రాఫిక్ ఇదే!
న్యూఢిల్లీ : 4జీ.. డేటా వాడకానికి ప్రస్తుతం ఇది మేజర్ సోర్స్. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్ టాప్ వంటి అన్ని ఇంటర్నెట్ డివైజ్ లకు దీన్ని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కంపెనీలు సైతం 4జీ డివైజ్ ల తయారీపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. 2జీ, 3జీలను వెనక్కి నెట్టేసిన 4జీ 2016లో ప్రధాన డేటా ట్రాఫిక్ గా నిలిచినట్టు వెల్లడైంది. 2016లో దేశమంతా 4జీ సేవలనే ఎక్కువగా వినియోగించుకున్నారని తెలిసింది. తాజా రిపోర్టుల ప్రకారం 2015 నుంచి పెరిగిన పే లోడ్‌లో 60శాతం 4జీనే కంట్రిబ్యూట్ చేసినట్టు తెలిసింది. ఇండియాలో మొబైల్ బ్రాండుబ్యాండు ఫర్ఫార్మెన్స్ పై నోకియా ఎంబిట్ ఇండెక్స్ నివేదించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంకా అన్ని సర్కిళ్లలో 4జీ కవరేజ్ రానప్పటికీ, మొత్తం డేటా ట్రాఫిక్ ప్యాన్ ఇండియాలో ఇది 13 శాతం నమోదైంది. మెట్రోల్లేనే ఎక్కువగా 4జీని వాడుతున్నారని , అక్కడ డేటా ట్రాఫిక్ లో 4జీ కంట్రిబ్యూషన్ 26 శాతం ఉన్నట్టు తేలింది. ఈ రిపోర్టు ప్రకారం ఒక్క సబ్‌స్క్రైబర్ వాడే నెలవారీ 4జీ డేటా వాడకం 1,400 ఎంబీకంటే పైనే ఉందని తెలిసింది. అదే 3జీ వాడకం చూస్తే అది కేవలం 850ఎంబీ మాత్రమే ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. గతేడాది కంటే 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్లు 2.7 సార్లు పెరిగాయని రిపోర్టు వెల్లడించింది. కేవలం 1.2 సార్లే 3జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్నాయని రిపోర్టు పేర్కొంది.