Datia district
-
సమోస.. కచొరికి చట్నీ రుచిగా వండలేదని భార్యపై..
భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో ట్రక్ బోల్తా: 14 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ధాతియా జిల్లా రావల్ పూరా సమీపంలో బుధవారం ఉదయం ట్రక్ బోల్తా పడింది. ఆ ఘటనలో 14 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది కూలీలకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ధాతియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రక్‌లో ప్రయాణిస్తున్న వారంతా కూలీలే అని పోలీసులు చెప్పారు. -
'రతన్‌గడ్' మృతుల్లో 50 మంది యూపీ వాసులు
రతన్‌గడ్ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట మృతుల్లో 50 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. వారిలో 33 మంది మహిళలు, చిన్నారులు మరణించారని చెప్పారు. దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లా నుంచి మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలో రతన్‌గడ్ ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆ దేవాలయం సమీపంలోని సింధ్ నదీ వంతెన కిక్కిరిసింది. వంతెన కూలిపోతుందని పుకార్లు వెల్లవెత్తాయి. దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు నలు దిశలా పరుగులు తీశారు. అందులోభాగంగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో 115 మందికి పైగా మరణించారు. వందాలాది మంది దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
రతన్‌గఢ్ తొక్కిసలాటలో పెరుగుతున్న మృతుల సంఖ్య
-
రతన్‌గఢ్ తొక్కిసలాటపై సోనియా దిగ్భ్రాంతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రతన్‌గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 89 మందిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటనపై తీవ్ర ఆవేదన చెందారు. రతన్‌గఢ్ దుర్గామాత ఆలయం సమీపంలో సింధ్ నదిపై ఉన్న వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 89 మంది మృతి చెందగా, 100 మందిపైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 31 మంది మహిళలు, 17 మంది పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం ఇస్తామని తెలిపింది. నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. లీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
64 మందిని బలిగొన్న వదంతి
భోపాల్: నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి 64 మందిని బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రతన్‌గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటకు వంతెన కూలిపోతుందన్న వదంతి కారణమని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందిపైగా గాయపడ్డారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింధ్ నదిపై ఉన్న ఇరుకైన బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. వంతెన కూలిపోతుందన్న వదంది రేగంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికివారు ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు కాళ్ల కింద నలిగిపోయి మృతిచెందగా, కొందరు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలను దతియా ఎమ్మెల్యే నరోత్తమ్ మిశ్రా తోసిపుచ్చారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.