రతన్గఢ్ తొక్కిసలాటపై సోనియా దిగ్భ్రాంతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా రతన్గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 89 మందిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటనపై తీవ్ర ఆవేదన చెందారు.
రతన్గఢ్ దుర్గామాత ఆలయం సమీపంలో సింధ్ నదిపై ఉన్న వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 89 మంది మృతి చెందగా, 100 మందిపైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 31 మంది మహిళలు, 17 మంది పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం ఇస్తామని తెలిపింది.
నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. లీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలు విన్పిస్తున్నాయి.