David Johnston
-
టీమిండియా దిగ్గజం అవుతాడనుకుంటే.. పాపం!
భారత క్రికెట్లో ఇప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్నారు. కానీ 1990లలో ఇండియన్ క్రికెట్ పరిస్ధితి పేరు. అప్పటిలో జవగల్ శ్రీనాథ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు ఎవరూ లేరు. వెంకటేష్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, అజిత్ అగార్కర్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికి.. వారి పేస్ మాత్రం ప్రత్యర్ధులను భయపెట్టేది కాదు. సరిగ్గా అదే సమయంలో ఓ కర్ణాటక కుర్రాడు దేశీవాళీ క్రికెట్లో 157.8 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ అందరిని ఆకర్షించాడు. భారత క్రికెట్లో అప్పటివరకు ఎవరు కనీవినీ ఎరుగని స్పీడ్ అది. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి బ్యాటర్లు భయపడేవారు. తన రా పేస్‌తో బ్యాటర్లను వణికించేవాడు. ఓ దశలో అతడు... షోయబ్ అక్తర్, జవగల్ శ్రీనాథ్‌ను మించిపోతాడని అంతా భావించారు. ఆ కుర్రాడు తన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌తో బీసీసీఐ సెలక్టర్లు దృష్టిలో పడ్డాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. 1996 అక్టోబరు 10న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో ఆ యంగ్ పేస్‌గన్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు.దీంతో భారత క్రికెట్ జట్టుకు ఓ ఆణిముత్యం లభించిందని అందరూ తెగ సంబర పడ్డారు. కానీ ఆ సంతోషం రెండు మ్యాచ్‌లకే ముగిసి పోయింది. మరో అక్తర్ అవుతాడనకున్న ఆ యువ సంచలనం కెరీర్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆ యువకుడు తన కెరీర్‌నే కాదు తన జీవితాన్ని కూడా అర్ధంతరంగా ముగించాడు. భారత క్రికెట్‌కు జెట్ స్పీడ్ పరిచయం చేసిన ఆ కర్ణాటక కుర్రాడు.. ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద గాథ మరెవరిదో కాదు.. టీమిండియా మాజీ పేసర్, దివంగత కర్ణాటక ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్‌ది. ఎవరీ డేవిడ్ జాన్సన్..?డేవిడ్ జాన్సన్ 1971 అక్టోబరు 16న కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా అర్సికెరెలో జన్మించాడు. డేవిడ్ జాన్సన్ తండ్రి ఆంగ్లో-ఇండియన్. జాన్సన్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ. అందుకు తగ్గట్టే స్కూల్ డేస్ నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో 1992-93 రంజీ సీజన్లో కర్ణాటక తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సీజన్లోనే కేరళపై పది వికెట్ల హాల్ సాధించి సత్తాచాటాడు. ఆ తర్వాత జాన్సన్ వెనుదిరిగి చూడలేదు.దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు దూసుకెళ్లాడు. కర్ణాటక జట్టుకు ఎన్నో సంచలన విజయాలుఅందించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాలుగేళ్లకు అతడికి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. 1996లో ఢిల్లీలో ఆసీస్ జరిగిన ఏకైక టెస్టు కోసం జాన్సన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌కు జవగల్ శ్రీనాథ్ గాయం కారణంగా దూరం కావడంతో జాన్సన్‌కు భారత జట్టులో చోటుదక్కింది.తన తొలి మ్యాచ్‌లో జాన్సన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత అతడిని అదే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా తీసుకువెళ్లారు. డర్బన్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. కానీ అదే తనకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందని జాన్సన్ అస్సలు ఊహించలేదు.ఆ తర్వాత బీసీసీఐ అతడికి జట్టులో చోటివ్వలేదు. దీంతో కేవలం రెండు మ్యాచ్‌లతోనే అతడి కెరీర్ ముగిసిపోయింది. భారత జట్టు తరపున అత్యున్నత స్ధాయిలో సత్తాచాటాలన్న అతడి కల కలగానే మిగిలిపోయింది. తన అంతర్జాతీయ కెరీర్లో రెండు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు సాధించిన జాన్సన్.. ఫస్ట్ క్రికెట్లో 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 125 వికెట్లు పడగొట్టాడు.బీసీసీఐ సపోర్ట్ చేయలేదా?అయితే ఒక విధంగా చెప్పాలంటే జాన్సన్ కెరీర్ పతనానికి బీసీసీఐ కూడా ఓ కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 157 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ వేసే ఫాస్ట్‌బౌలర్‌కు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితం చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు సైతం తమ కెరీర్ ఆరంభంలో ఇబ్బంది పడి వచ్చినవారే.అటువంటిది జాన్సన్‌ను మరికొన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇచ్చి ఉంటే.. ఈ రోజు భారత క్రికెట్ మొత్తం తనను గుర్తు పెట్టుకుని ఉండేదేమో!!.. అతడు కూడా జవగల్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి కర్ణాటక దిగ్గజాల సరసన చేరే వాడేమో!!. కానీ అప్పట్లో భారత క్రికెట్లో రాజకీయాల జోక్యం వల్ల ఓ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్ కెరీర్ ఆదిలోనే అంతమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఆత్మహత్యకు కారణం ఇదేనా? జూన్ 20 2024.. డేవిడ్ జాన్సన్ ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. 52 ఏళ్ల జాన్సన్ బెంగళూరులో తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జాన్సన్‌కు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్ తన ఇంటికి సమీపంలోనే ఒక క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు.అయితే అకాడమీ సజావుగా నడవకపోవడంతో ఆయన అప్పుల పాలైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో గతకొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న జాన్సన్.. ఆ క్రమంలోనే ఆత్మహ్యత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. -
ఆత్మహత్య చేసుకున్న టీమిండియా మాజీ క్రికెటర్..?
టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటక మాజీ రంజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ (52) ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. బెంగళూరులో తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడని సమాచారం. జాన్సన్ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంభ సభ్యులు తెలిపారు. జాన్సన్.. తాను ఆత్యహత్య చేసుకున్న ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.జాన్సన్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జై షా ట్విటర్ వేదికగా జాన్సన్ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులను ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. టీమిండియాకు, కర్ణాటక రంజీ జట్టుకు జాన్సన్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని షా ట్వీట్లో పేర్కొన్నాడు.రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన జాన్సన్ 1996వ సంవత్సరంలో టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) ఆడాడు. జాన్సన్.. తన అరంగేట్రం టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ స్టేటర్ను ఔట్ చేయడం నాటి క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుంటుంది. జాన్సన్.. స్లేటర్‌ను ఔట్ చేసిన బంతి 157.8 గంటకు కిలోమీటర్ల వేగంతో వచ్చింది. ఇది అప్పట్లో అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. జాన్సన్ తానాడిన రెండు టెస్ట్‌ల్లో 3 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న జాన్సన్ అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయాడు. జాన్సన్ ఫస్ట్ క్లాస్ ట్రాక్ రికార్డు మెరుగ్గా ఉంది. కర్ణాటక తరఫున 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్..125 వికెట్లు పడగొట్టడంతో పాటు 437 పరుగులు సాధించాడు. జాన్సన్ ఖాతాలో ఓ ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం
ఎంహెచ్ 370 మలేసియా విమానం గల్లంతై 50 రోజుల దాటి పోయింది... అయినా ఇంతవరకు ఆ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆ విమాన ఆచూకీ కోసం గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఆచూకీ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ జానస్టన్ బుధవారం వెల్లడించారు. ఆ అంశంపై ఇప్పటికే మలేసియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రెండు ప్రపంచ యుద్ద సమయంలో టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో నౌకలోని 1500 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆ నౌక ఆచూకీ కోసం అన్వేషణలు తీవ్రంగా సాగిన చిట్ట చివరకు 1985 అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల అడుగున టైటానిక్‌ను కనుగొన్న విషయం విదితమే. 227 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో గతనెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంలో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు విమానాలు, నౌకలు, శాటిలైట్ల ద్వారా సముద్రంలో జల్లెడ పట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన విజ్ఞానం ద్వారా అయిన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ తెలుస్తుందని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఆ విమాన ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.