dayakar reddy
-
మంత్రి ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ యశస్విని రెడ్డి
-
పూర్తి కాకుండానే ’పాలమూరు’ను ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పనులు పూర్తి కాకుండానే ఈనెల 16న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఈ ప్రాజెక్టులో మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క పంపును ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందా అని ఎద్దేవా చేశారు. సోమవారం గాందీభవన్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆమెను ఆహ్వనించిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ గతంలో సీతా దయాకర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారని, తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగితే, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కలి్పస్తోందని, సీతాదయాకర్‌రెడ్డికి రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన తిమ్మాపూర్ నేతలు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్‌తో సహా పలువురు కార్యకర్తలను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కండువాకప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వనించారు. -
కరోనాతో కానిస్టేబుల్ మృతి
మన్సూరాబాద్: కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్న పోలీసు శాఖలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. కరోనా బారినపడిన కొందరు పోలీసులు చికిత్స అనంతరం కోలుకోగా కుల్సుంపురా పోలీసు కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి (33) మాత్రం చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసు శాఖలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ మామిళ్లగూడేనికి చెందిన దయాకర్‌రెడ్డి హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్లోని ఓ కాలనీలో నివాసముంటూ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య శైలజ (29)తోపాటు ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చిలో భార్య, పిల్లలను సొంతూరికి పంపిన దయాకర్‌రెడ్డి... నెల రోజులపాటు టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాడు. చికిత్స అనంతరం కోలుకొని విధులకు హాజరవుతున్నాడు. సొంతూరిలో ఉన్న భార్య పిల్లలను ఈ నెల 11న నగరానికి తీసుకొచ్చాడు. 13న తోటి కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని కరోనా పరీక్షలకు వెళ్లాడు. 15న పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. బుధవారం రాత్రి 9.30 గంటలకు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. అయితే దయాకర్‌రెడ్డి ఆదివారం రాత్రి బ్రెయిన్ ట్యూమర్‌తో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు... దయాకర్‌రెడ్డి మృతదేహానికి సొంతూరు మామిళ్లగూడెం తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. దీంతో మృతుడి తల్లిదండ్రులను నగరానికి రప్పించి వారి సమక్షంలో సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో గురువారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరై తిరిగి క్వారంటైన్ జోన్లో ఉన్న నివాసానికి వచ్చిన మృతుడి తల్లిదండ్రులు, అత్తమామలు, మరదలిని కరోనా పరీక్షల కోసం అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇది ప్రభుత్వ హత్యే: మృతుని సోదరుడు తీవ్ర జ్వరంతో వారం రోజులుగా కింగ్‌కోఠి, సరోజినీ ఆస్పత్రుల చుట్టూ తిరిగిన దయాకర్‌రెడ్డికి కరోనా లక్షణాలు లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని మృతుని సోదరుడు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కరోనా పరీక్షలు నిర్వహించాలని పలుమార్లు వైద్యులను కోరినా నిర్వహించలేదని, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే తన సోదరుని మృతికి కారణమైందన్నాడు. సోదరునికి సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికేవాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని దుయ్యబట్టారు. అధిక డ్యూటీ భారం వల్లే... గతంలో టైఫాయిడ్‌తో ఇబ్బంది పడి సెలవులు వాడుకోవడం, కరోనా సమయంలో సెలవులు పెట్టుకోవడానికి వీల్లేకపోవడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడంతోనే కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డికి రోగ నిరోధకశక్తి తగ్గి కరోనా బారినపడ్డాడని స్థానికులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతికి డీజీపీ సంతాపం కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన పోలీస్ కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతికి డీజీపీ మహేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. దయాకర్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని గురువారం ట్విట్టర్ ద్వారా డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్ మృతికి నెటిజన్లు కూడా ట్వీట్ల ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రాణాలు అర్పించిన అమర సైనికుడు అంటూ కీర్తించారు. దయాకర్‌రెడ్డి పిల్లలకు స్కూలు విద్య అందించేందుకు సిద్ధమని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునితా క్రిష్ణన్ ముందుకు వచ్చారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. -
మహకూటమితోనే అభివృద్ధికి బాటలు..
సాక్షి, ఆత్మకూర్: రాష్ట్ర ప్రజలను మోసంచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే మహాకూటమిని గెలిపించాలని మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్ మండలంలోని బాలకిష్టాపూర్, పిన్నంచర్ల, మూళమల్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లను డబుల్ చేస్తామని, ఇంటి స్థలం ఉన్న వారందరికీ ఇంటినిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అయూభ్‌ఖాన్, రామలక్ష్మారెడ్డి, రహ్మతుల్లా, బాలకిష్ణారెడ్డి, ఎస్టీడీ శ్రీను, అశ్విన్‌కుమార్, పుట్నాల రమేష్, వెంకటేష్, శేఖర్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వండిపెడతా.. ఓటేయమ్మా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆత్మకూర్ మండలంలోని గోపన్‌పేట గ్రామంలో వంటింట్లోకి వెళ్లిమరీ వంటచేస్తు తనకు ఓటువేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ను సాగనంపాలి మదనాపురం: కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కరివెన, గోపన్‌పేటలో ఇంటింటి ప్రచారం చేశారు.కార్య క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీడీపీ మండల అధ్యక్షుడు నాగన్న యాదవ్, బాలకిష్ణారెడ్డి, రామలక్ష్మారెడ్డి, ఎస్టీడీ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిన్నారెడ్డి గెలుపునకు పూజలు పెబ్బేరు: మండలంలోని సూగూర్‌లో కాంగ్రెస్ నాయకులు నర్సింహ్మనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం రామాలయంలో పూజలు చేశారు. వనపర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నారెడ్డి గెలువాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మచ్చలేని నాయకుడని కొనియాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మన్, బుచ్చన్నయాదవ్, మండగిరి రాముడు, గోవిందు, మధు పాల్గొన్నారు. -
నాటి శత్రువులే.. నేటి మిత్రులు
సాక్షి, వనపర్తి / ఆత్మకూరు : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అమరచింత నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.వీరారెడ్డి, టీడీపీ నుంచి కె.దయాకర్‌రెడ్డి పోటీ పడగా వీరారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే బరిలోకి దిగగా వీరారెడ్డిపై దయాకర్‌రెడ్డి గెలుపొందారు. అలా ప్రత్యర్థులు ఉన్న వీరిద్దరు ఇప్పుడు మహాకూటమి ఏర్పాటుతో ఒక్కటయ్యారు. ఈ మేరకు మక్తల్ నుంచి మహాకూటమి తరఫున కె.దయాకర్‌రెడ్డి బరిలో ఉండగా.. ఆత్మకూరులో శనివారం జరిగిన మహాకూటమి పార్టీల్లోని కార్యకర్తల సమావేశంలో వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఇక మరో ఫొటోలో ఉన్న ఇద్దరు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి బాల్యమిత్రులు! అయితే, దశాబ్దాల కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో రావుల 1994 ఎన్నికల్లో చిన్నారెడ్డిపై విజయం సాధించగా.. 1999 ఎన్నికల్లో చిన్నారెడ్డి రావులపై గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్లీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చిన్నారెడ్డిపై గెలిచారు. ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యం కావడంతో శనివారం జరిగిన చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశానికి రావుల హాజరై వేదికపై చిన్నారెడ్డితో పలు అంశాలపై చర్చించండి కనిపించింది. వనపర్తిలో జరిగిన సమావేశంలో వేదికపై మిత్రులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి ఆత్మకూరు సమావేశంలో మాట్లాడుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు వీరారెడ్డి, కె.దయాకర్‌రెడ్డి -
సీఐడీ సీఐపై నిర్భయ కేసు
కరీంనగర్: విచారణ పేరుతో ఓ మహిళా ఉద్యోగిని వేధించిన సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దయాకర్ రెడ్డి తరచూ ఫోన్లు చేయడంతో పాటు అభ్యంతరకర మెసేజ్‌లు పంపి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో అరెస్ట్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేశారు. బాధిత మహిళ కూడా మోహన్‌రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు. విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్‌లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్‌లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు. అసభ్యకరమైన బొమ్మలతో కూడిన మెసేజ్‌లు బయటకు చెప్పుకోలేని మెసేజ్‌లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దయాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దయాకర్‌రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్‌కు చెందిన పలు వివరాలు, కాల్‌లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన డేటా సేకరించారు. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
వెట్టి నుంచి ఐదేళ్ల బాలికకు విముక్తి
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చెన్నాయిపాళెం గ్రామం వద్ద ఒక ఇటుక బట్టీ యజమాని నిర్బంధించిన బాలికకు కలెక్టర్ జోక్యంతో విముక్తి లభించింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. చెన్నాయిపాళెం శివారులో కుండా దయాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇటుకల బట్టీలు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఎంకమ్మ, శీనయ్య అనే దంపతులు వలస కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే వారి కుమార్తె లక్ష్మమ్మ(5)ను ఇటుకల బట్టీల యజమాని అక్రమంగా నిర్బంధించాడు. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేవరకూ బాలిక నిర్బంధంలో ఉంటుందని హెచ్చరించాడు. దిక్కుతోచని తల్లిదండ్రులు నెల్లూరు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి స్థానిక ఎస్ఐ, తహశీల్దార్, ఐసీడీఎస్ సీపీడీవో, ఏఆర్ఓ స్వచ్ఛందసంస్థ ప్రతినిధులను ఆదేశించారు. వారు మంగళవారం మధ్యాహ్నం ఇటుకబట్టీల వద్దకు వెళ్లి లక్ష్మమ్మ(5)ను దయాకర్‌రెడ్డి చెర నుంచి విడిపించారు. అతనిపై కేసు నమోదుచేశారు. -
రూ.1.34 లక్షల పట్టివేత
మక్తల్, న్యూస్‌లైన్ : ఓ కారులో టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు రూ.1.23 లక్షలను తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు వెళుతున్న కారును ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి,హెడ్‌కానిస్టేబుల్ జమీరొద్దీన్, కాని స్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి ఆపారు. అందు లో చిన్నచింతకుంట మండలం పర్కాపురానికి తరలిస్తున్న రూ.1.23 లక్షలతో పాటు పార్టీకి చెందిన 30 టీషర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో తహశీల్దార్ సాయిరాంకు అప్పగించా రు. కాగా పట్టుబడిన కారు మహబూబ్‌నగర్‌లోని ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులు కౌసిక్‌రెడ్డి, శ్రీనివాసులును నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. మంతటిగడ్డ సమీపంలో... నాగర్‌కర్నూల్ : కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు డబ్బులు పం చుతున్న ఇద్దరు వ్యక్తులు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోగా, మరో నలుగురు పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ నుంచి అచ్చంపేట వెళ్లే దారిలో మంతటిగడ్డ సమీపంలో టీఆర్ఎస్ బహిరంగసభకు వచ్చిన వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారని స్థానికులు కొందరు ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్‌కు సమాచారమిచారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి కారువంగకు చెందిన వెంకటరమణగౌడ్, రాములును పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10,690 స్వాధీనం చేసుకోగా మరో నలుగురు వ్యక్తులు పారిపోయారు. -
మహబూబ్‌నగర్‌లో సకుటుంబ సపరివారం...
భార్యభర్తలు: మక్తల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన భార్య సీతాదయాకర్‌రెడ్డి దేవరకద్ర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా రు. మరోసారి ఆమె అదేపార్టీ నుంచి అదే నియోజకవర్గం నుంచి తలపడుతున్నారు. అక్కాతమ్ముళ్లు: మాజీ మంత్రి డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి స్వయానా అక్కాతమ్ముళ్లు. అరుణ గద్వాల నుంచి రాంమోహన్‌రెడ్డి మక్తల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. అత్తాఅల్లుళ్లు: గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి డీకే అరుణ, అదేస్థానం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(అరుణ భర్త భరతసింహారెడ్డి అక్కకొడుకు) వరుసకు అత్తాఅల్లుళ్లు అవుతారు. వీరిద్దరు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. పోటీ కూడా హోరాహోరీగా ఉంది. తండ్రీ కొడుకులు: డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన కొడుకు శశిధర్‌రెడ్డి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి డాక్టర్ మందా జగన్నాథం పోటీచేస్తుండగా, ఆయన కొడుకు మందా శ్రీనాథ్ అలంపూర్ అసెంబ్లీస్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. -న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్