సాక్షి, వనపర్తి / ఆత్మకూరు : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అమరచింత నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.వీరారెడ్డి, టీడీపీ నుంచి కె.దయాకర్‌రెడ్డి పోటీ పడగా వీరారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే బరిలోకి దిగగా వీరారెడ్డిపై దయాకర్‌రెడ్డి గెలుపొందారు. అలా ప్రత్యర్థులు ఉన్న వీరిద్దరు ఇప్పుడు మహాకూటమి ఏర్పాటుతో ఒక్కటయ్యారు. ఈ మేరకు మక్తల్ నుంచి మహాకూటమి తరఫున కె.దయాకర్‌రెడ్డి బరిలో ఉండగా.. ఆత్మకూరులో శనివారం జరిగిన మహాకూటమి పార్టీల్లోని కార్యకర్తల సమావేశంలో వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
ఇక మరో ఫొటోలో ఉన్న ఇద్దరు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి బాల్యమిత్రులు! అయితే, దశాబ్దాల కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో రావుల 1994 ఎన్నికల్లో చిన్నారెడ్డిపై విజయం సాధించగా.. 1999 ఎన్నికల్లో చిన్నారెడ్డి రావులపై గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్లీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చిన్నారెడ్డిపై గెలిచారు. ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యం కావడంతో శనివారం జరిగిన చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశానికి రావుల హాజరై వేదికపై చిన్నారెడ్డితో పలు అంశాలపై చర్చించండి కనిపించింది.
వనపర్తిలో జరిగిన సమావేశంలో వేదికపై మిత్రులు
రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి
ఆత్మకూరు సమావేశంలో మాట్లాడుకుంటున్న
మాజీ ఎమ్మెల్యేలు వీరారెడ్డి, కె.దయాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment