daydreaming
-
'నితీష్ జీ ప్రధాని కావాలనే పగటి కల'ను కనడం మానేయండి!
దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యి తన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆదివారం నితీష్‌పై పెద్ద ఎత్తున మాటల దాడి చేశారు. నితీష్జీ ప్రధాని కావాలనే పగటి కలతో బీజేపీయేతర పార్టీల కూటమిని ఏర్పరుచుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ప్రశ్నించారు. ముందు మీరు ఆ కలల ప్రపంచ నుంచి బయటకు రండి అని సెటైర్లు వేశారు. ఇతర నేతలను కలవడం మీ హక్కే కానీ, అంతకంటే ముందు మీ సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టండని కౌంటరిచ్చారు. ప్రధాని కావాలనే పగటి కలలు కనడం మానేసి దానికి బదులుగా బీహార్ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు సంక్రమంగా నిర్వర్తించాలంటూ చురకలంటించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ మాట్లాడుతూ..నేరాలు, అవినీతి, అరాచకాలతో బిహార్ రాష్ట్రం కూరుకుపోయిందని, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని మండిపడ్డారు. కాగా, ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. (చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే) -
‘పగటి కలలు కంటున్నారు’
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీని నమ్ముకుంటే మిగిలేది శూన్యమన్నారు. 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ వంటి పనులు ఎప్పుడన్నా కాంగ్రెస్ హయాంలో జరిగాయా అని ప్రశ్నించారు. మరుగుదొడ్డి కావాలన్న ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వాళ్లు అనుమతి తీసుకోవలసిందేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా ఎండడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టను రెండేళ్లలో తాము పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతీ చెరువు నింపి ఎన్ఎస్పీ ఆయకట్టును ఆదుకుంటామని హామీఇచ్చారు. ఖమ్మం జిల్లాను కల్పవల్లిగా చేస్తామని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ నాయకులు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లకు కనీసం ఒక్క అటవీ అనుమతి తీసుకురాలేకపోయారని విమర్శించారు. -
నితీశ్ పగటి కలలు మానుకో
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన 'బీజేపీ రహిత భారత్' వాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 'బీజేపీ రహిత భారత్' అని అనడానికి నితీష్ కు ఉన్న విశ్వసనీయత ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో 17 ఏళ్లపాటు మిత్రపక్షంగా కొనసాగినప్పుడు 'బీజేపీ ముక్త భారత్' నినాదం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. 'ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు తెంగించి మాట్లాడిన మాటలు'గా నితీశ్ వాఖ్యలను ఆయన అభివర్ణించారు. నితీశ్ తన పరిధిలో తానుంటే మంచిదని సూచించారు. జేడీయూ ఒక ప్రాంతీయ పార్టీ అని, అది బిహార్‌లలోని మొత్తం సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. అలాంటి పార్టీ జాతీయస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. జనతాదళ్ యునైటెడ్ పార్టీలోనే ఐక్యత లేదని షానవాజ్ ఎద్దేవా చేశారు. నితీశ్ తన ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆర్ఎస్ఎస్, బీజేపేతర శక్తులన్నీ ఒక తాటిపైకి రావాలని ఇటీవల నితీశ్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ భారతదేశ ఆత్మ అని, ఆత్మ లేని ఇండియా ఎలా సాధ్యమని ఆ సంస్థ నాయకుడు రాకేష్ సిన్హా వాఖ్యానించారు.