తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు(పాత చిత్రం)
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీని నమ్ముకుంటే మిగిలేది శూన్యమన్నారు. 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ వంటి పనులు ఎప్పుడన్నా కాంగ్రెస్ హయాంలో జరిగాయా అని ప్రశ్నించారు. మరుగుదొడ్డి కావాలన్న ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వాళ్లు అనుమతి తీసుకోవలసిందేనని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లా ఎండడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టను రెండేళ్లలో తాము పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతీ చెరువు నింపి ఎన్‌ఎస్‌పీ ఆయకట్టును ఆదుకుంటామని హామీఇచ్చారు. ఖమ్మం జిల్లాను కల్పవల్లిగా చేస్తామని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ నాయకులు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లకు కనీసం ఒక్క అటవీ అనుమతి తీసుకురాలేకపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment