DCC meeting
-
వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు!
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బుధవారం కెమెరాల సాక్షిగా బాహాబాహీకి దిగారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం స్వీకార కార్యక్రమంలోనే ఈ రసాభాసా జరగడం గమనార్హం. డీసీపీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో తొలిసారి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొండా దంపతులు హాజరు కాలేదు. అయితే.. ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అక్కడ గందరగోళం నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు తన్నులాటకు దిగారు కార్యకర్తలు. కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంతోష్ పై దాడి చేసిన ఎర్రబెల్లి వర్గం. ఎర్రబెల్లి వర్గానికి కట్ట స్వామి నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకానొక టైంకి చొక్కాలు చించుకుని.. చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్లింది పరిస్థితి. దీంతో రసాభాసా నెలకొంది. గొడవకు దిగిన కార్యకర్తల అంతుచూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికి పరిస్థితి సర్దుమణిగింది. ఇది గ్రూప్ వార్ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తి దూషించినందుకు నెలకొన్న వివాదం మాత్రమేనని కాంగ్రెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎర్రబెల్లి స్వర్ణకు డీసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడంపై కొండా వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. -
భేషజాలు లేవు.. అందరితో కలిసి పనిచేస్తా: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు ఎటువంటి భేషజాలు లేవని, అందరితో కలిసి పనిచేస్తానని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం రాష్ట్ర ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్‌తో కలిసి గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరితో కలిసి పనిచేస్తానని డీసీసీ అధ్యక్షుల పని చేస్తేనే తాము పని చేసినట్లు అని అన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈనెల 12న అన్ని జిల్లాల్లో సైకిల్, ఎడ్లబండి ర్యాలీ చేపట్టాలని సూచించారు. 16న ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు. అధికారంలోకి రావడం ఎలా అనేది ఆలోచన చేద్దామని, అందరం ఆ దిశగా పని చేద్దామన్నారు. డీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు ఎప్పుడూ స్వీకరిస్తామని తెలిపారు. మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. 16న ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని పార్టీ ఆదేశించినట్లు తెలిపారు. నిత్యం ప్రజల సమస్యలపై ఆందోళనలు చేయాలని ఆయన డీసీసీ అధ్యక్షుల సూచించారు. -
డీసీసీబీ అభివృద్ధికి కృషి
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ను అగ్రస్థానంలో నిలిపేందుకు S ఉద్యోగులు కృషి చేయాలని ఆ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఆదివారం సహకార బ్యాంకు ఉద్యోగుల యూనియన్ జిల్లా మహాసభ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ కొండారెడ్డి అధ్యక్షత వహించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా అన్ని వ ర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వార్షిక లావాదేవీలు, సమస్యలు, భవి ష్యత్ కార్యాచరణ అంశాలపై మహాజన సభలో చర్చించారు. యూ నియన్ సభ్యులు చైర్మన్‌ను సన్మానించారు. డీసీసీబీ సీఈవో కాపు విజయచంద్రారెడ్డి, యూనియన్ రాష్ట్ర నాయకులు రంగబాబు, వైఎస్ఆర్కే ప్రసాద్, జిల్లా నాయకులు రవీంద్రనాథరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, జానకిరామరెడ్డి, సుఖదేవబాబు, మల్లికార్జునుడు, అనంతపద్మనాభం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం.. తమాషాగా ఉందా..!
- డీసీసీ సమావేశంలో బ్యాంకర్లపై కలెక్టర్ ఆగ్రహం - రుణ మంజూరులో శ్రద్ధ పెట్టడంలేదని మండిపాటు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణ మంజూరుపై బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెజారిటీ సంఖ్యలో బ్యాంకు కోఆర్డినేటర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలోనూ గైర్హారయ్యారని గుర్తుచేస్తూ.. వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. అనంతరం కేటగిరీల వారీగా రుణాల పంపిణీ తీరును సమీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద వహించి లక్ష్యాల్సి సాధించాలన్నారు. పంటరుణాల కేటగిరీలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 714 కోట్లకుగాను రూ.664.84 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని, మిగతా రుణాల్సి త్వరితంగా మంజూరుచేయాలన్నారు. జిల్లాలో 15,385 స్వయంసహాయక సంఘాలకు రూ.244.73 కోట్ల లక్ష్యం నిర్దేశిం చగా.. ఇప్పటివరకు 9502 సంఘాలకు రుణాలిచ్చారన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా ప్రతి సంఘానికి రుణం అందించాలన్నారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పంపిణీ సైతం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఆర్బీఐ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు.