అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ను అగ్రస్థానంలో నిలిపేందుకు S ఉద్యోగులు కృషి చేయాలని ఆ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఆదివారం సహకార బ్యాంకు ఉద్యోగుల యూనియన్ జిల్లా మహాసభ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ కొండారెడ్డి అధ్యక్షత వహించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా అన్ని వ ర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు.
యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వార్షిక లావాదేవీలు, సమస్యలు, భవి ష్యత్ కార్యాచరణ అంశాలపై మహాజన సభలో చర్చించారు. యూ నియన్ సభ్యులు చైర్మన్‌ను సన్మానించారు. డీసీసీబీ సీఈవో కాపు విజయచంద్రారెడ్డి, యూనియన్ రాష్ట్ర నాయకులు రంగబాబు, వైఎస్‌ఆర్‌కే ప్రసాద్, జిల్లా నాయకులు రవీంద్రనాథరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, జానకిరామరెడ్డి, సుఖదేవబాబు, మల్లికార్జునుడు, అనంతపద్మనాభం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ అభివృద్ధికి కృషి
Published Mon, Oct 24 2016 12:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement