debts issues
-
కొడుకు రాసిన మరణశాసనం
తాండూర్: ఆన్లైన్ ట్రేడింగ్ ఆ ఇంటిల్లిపాది పాలిట మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.యూట్యూబ్‌కు ఆకర్శితుడై..శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.రూ.50 లక్షలకు పైగా..అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.గ్రామంలో విషాదఛాయలుమొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తలసరి అప్పు.. రూ. 98,033
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో తీసుకునేవి కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు (పూచీకత్తు రుణాలు కాకుండా) చేరనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి తలపై అప్పు రూ.98,033కు చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనాల మేరకు తలసరి అప్పు రూ.94 వేలు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు వేలు పెరుగుతోంది. ఇక ప్రభుత్వం పూచీకత్తులు ఇచ్చి కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలనూ కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జీఎస్డీపీతో పోలిస్తే తగ్గుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బడ్జెట్ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పుల శాతం తగ్గుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీఎస్డీపీలో 25.4 శాతం అప్పు ఉండగా, అదే 2023–24 సంవత్సరం ముగిసే సమయానికి ఇది జీఎస్డీపీలో 23.8 శాతానికి తగ్గుతుండడం గమనార్హం. ఇదే క్రమంలో 2021–22, 2022–23 సంవత్సరాల్లో కూడా జీఎస్డీపీలో అప్పుల శాతం తగ్గిందన్నమాట. వడ్డీల చెల్లింపులకే రూ.22,407 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.22,407.67 కోట్లు చెల్లించనుంది. 2022–23లో వడ్డీల కింద రూ.18,911 కోట్లు చెల్లించగా.. ఈసారి మరో రూ.3,500 కోట్ల మేర పెరిగాయి. ►ఇక రుణాల తిరిగి చెల్లింపుల కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.12,606 కోట్లను చూపింది. ఇందులో ప్రజా రుణం కింద రూ.9,341.17 కోట్లు,, కేంద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.427.16 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,837.76 కోట్లు తిరిగి చెల్లించనుంది. తగ్గిన పూచీకత్తు రుణాలు! 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23లో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలకు రుణాల కోసం ప్రభుత్వమిచ్చిన పూచీకత్తులు తగ్గిపోయాయి. 2021–22 ముగిసే నాటికి ప్రభుత్వ పూచీకత్తులు మొత్తం రూ.1,35,282.51 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.1,29,243.60 కోట్లకు తగ్గాయి. పూచీకత్తు ఇచ్చి కార్పొరేషన్లు, సంస్థల పేరిట తీసుకునే రుణాలనూ ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామన్న కేంద్ర నిబంధనే దీనికి కారణం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ కార్పొరేషన్‌కూ పూచీకత్తు ఇవ్వలేదు. ఇదే సమయంలో గత ఏడాది ఇచ్చిన పూచీకత్తుల అసలులో కొన్ని నిధులు చెల్లించడంతో.. 2022–23లో ప్రభుత్వ గ్యారెంటీలు రూ.6 వేల కోట్ల మేర తగ్గాయి. మొత్తంగా పూచీకత్తులతో కలిపి రాష్ట్ర రుణం రూ.4,52,235 కోట్లకు చేరడం గమనార్హం. -
నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ ..ఆ నలుగురిని వదలి పెట్టకండి
-
'మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణం.. వారిని వదలొద్దు'
సాక్షి, విజయవాడ/ నిజామాబాద్: అప్పులు, అధిక వడ్డీలు భరించలేక నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. 'మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణమంటూ.. గణేష్‌కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయి రామ మనోహర్ పేర్లను సూసైడ్ లెటర్లో రాశారు. మా కుటుంబం చావుకు కారణమైన ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో పేర్కొన్నారు. చదవండి: (వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..) ఇదిలా ఉండగా, ఘటనపై మృతుడు సురేష్ బావమరిది రాంప్రసాద్ మాట్లాడుతూ.. మా అక్క, బావ, ఇద్దరు కుమారులు సూసైడ్ చేసుకోవడానికి ఆ నలుగురే కారణం. వారి వడ్డీ వేధింపుల వలనే విజయవాడ వచ్చి సూసైడ్ చేసుకున్నారు. ఆ నలుగురు అధిక వడ్డీలు వసూలు చేశారు. డబ్బులు కట్టకపోతే అంతుచూస్తామని బెదిరించారు. సూసైడ్‌నోట్‌లో ఇదే విషయాన్ని రాశారు. వాళ్లు చనిపోయేముందు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మొత్తం సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఆ నలుగురి వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి' అని రాంప్రసాద్ అన్నారు. చదవండి: (రుణాలు తీర్చలేక.. చావే శరణ్యమని..) కాగా, నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్ (28), అశిష్ (24) ఈనెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణవీధిలోని ఒక ప్రైవేట్ సత్రంలో రూమ్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కాగా, అర్ధరాత్రి దాటాక సురేశ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపించారు. దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్ నంబర్ కనుగొన్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం గణేష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. -
రుణాలు తీర్చలేక.. చావే శరణ్యమని..
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/నిజామాబాద్ అర్బన్: అప్పులు, అధిక వడ్డీలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుటుంబం అప్పుల కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో రోడ్డున పడింది. ఆస్తులన్నీ అప్పులకే పోగా.. ఇంకా కట్టాల్సిన బకాయిల కోసం అప్పుల వాళ్లు ఎదురు చూస్తుండటంతో ఇక చావే శరణ్యమనుకున్నారు. పక్షం రోజుల పాటు ఊరూరా తిరిగారు. చివరకు ఏపీలోని విజయవాడ దుర్గమ్మ చెంత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్ (28), అశిష్ (24) ఈనెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణవీధిలోని ఒక ప్రైవేట్ సత్రంలో రూమ్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కాగా, అర్ధరాత్రి దాటాక సురేశ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపించారు. దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్ నంబర్ కనుగొన్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకుని.. అశిష్ బీ ఫార్మసీ చదవడంతో మెడికల్ పరిజ్ఞానం ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇన్సులిన్ అధిక మోతాదులో తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వెంట తెచ్చుకున్న ఇంజెక్షన్లను ఆశిష్ సాయంతో అందరూ తీసుకున్నారు. దాంతో తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ ముందుగానే స్పృహ తప్పినట్లు తెలిసింది. ఆ తరువాత తండ్రి సురేశ్ పెద్ద కుమారుడు అఖిల్ నదిలో దూకాలని నిర్ణయించుకొని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి 52వ కానా నుంచి నదిలోకి దూకారు. ఆర్థిక ఇబ్బందులా.. ఇతర కారణాలా? కేవలం ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యలకు పాల్పడ్డారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిజామాబాద్ నుంచి బంధువులు విజయవాడకు వస్తే వారు ఇచ్చే సమాచారాన్ని బట్టి అన్ని విషయాలు తెలుస్తాయని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. కాగా, తన బావ సురేశ్ కుటుంబం ఆత్మహత్య చేసుకునేంతగా కోట్లలో అప్పులు లేవని మృతుని బావమరిది శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఎవరో తీవ్రంగా బెదిరించినందు వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుల బాధ భరించలేక.. సత్రానికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు మృతుల వివరాలు సేకరించారు. సురేశ్ కుటుంబం నిజామాబాద్‌లో మెడికల్ షాపుతో పాటు కిరాణా దుకాణాన్ని నిర్వహించేది. ఏడాది కిందట పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా చేరిన పెద్దకుమారుడు బంక్‌ను తాను లీజుకు తీసుకున్నట్లు చెప్పి దాదాపు రూ.70 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిసింది. ఇదేకాక స్థానికంగా మరికొంతమంది వద్ద కూడా అప్పులు తీసుకోగా, వారు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. మరో పక్క తమ ఫ్లాట్‌పై తండ్రి సురేశ్ సుమారు రూ.30 లక్షల మేర అప్పు చేసినట్లు తెలిసింది. కాగా, సురేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారని వెల్లడైంది. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్ అనే ఫైనాన్స్ సంస్థ బకాయిల వసూలు కోసం శుక్రవారం సురేశ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో ఫ్లాట్ గోడపై ‘ఈ ఆస్తి పీసీహెచ్‌ఎఫ్‌ఎల్’కి చెందినదిగా రాసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అప్పులు ఇచ్చినవారు, ఫైనాన్స్‌ల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సురేశ్ కుటుంబం 15 రోజుల క్రితమే ఊరు వదిలి వచ్చినట్లు తెలిసింది. అఖిల్ (ఫైల్) ఆశిష్ (ఫైల్ ) -
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
వేర్వేరు చోట్ల ఐదుగురు రైతుల ఆత్మహత్య సాక్షి, నెట్వర్క్: ఎండనకా, వాననక ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు కాలం కలిసిరాకపోవడంతో విలవిల్లాడుతున్నారు. అయితే ఖరీఫ్, లేదంటే రబీ, ఇలా ఎప్పటికప్పుడు ఆశతో ఎన్ని పంటలు సాగు చేసినా.. వర్షాభావంతో దెబ్బతింటుండటంతో చివరకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అప్పులు మిగిలే దుస్థితి ఏర్పడుతోంది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో రైతులు ఉసురు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐదుగురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా మక్తభూపతిపూర్‌కు చెందిన రైతు రాజెల్లిపేట సత్యనారాయణ(35)కు గ్రామ శివారులో రెండెకరాల వ్యవసాయభూమి ఉంది. అందులో బోరుబావిని తవ్వి వ్యవసాయం చేస్తున్నాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులు చేసి రెండేళ్లక్రితం సత్యనారాయణ దుబాయికి వలసవెళ్లాడు. అక్కడ విదేశీ వలసదారులపై నిషేధం విధించటంతో సంవత్సరం క్రితం తిరిగి స్వదేశానికి వచ్చాడు. అటు అప్పులు తీరే మార్గంలేక.. ఇటు పంటలు పండే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన రైతు అల్లూరి ప్రతాపరెడ్డి(45) తనకున్న ఎకరంన్నర భూమిలో మామిడితోటతోపాటు పొలం సాగు చేస్తున్నాడు. కరువు నేపథ్యంలో చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. దీంతో పురుగులమందు తాగాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన రైతు తిప్పిరెడ్డి రాజిరెడ్డి(40) తన మూడు ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసి రూ.2 లక్షలు అప్పులు చేశాడు. వర్షాభావంతో పంటలు పండే అవకాశం లేదని, తెచ్చిన అప్పు తీర్చలేమనే బెంగతో బుధవారం సాయంత్రం పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన మహిళా కౌలు రైతు నంగి ఓజయ్య భార్య నంగి ఎల్లవ్వ(50) తనకున్న ఎకరంతోపాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిపంట వేసింది. పెట్టుబడులు, ఇతర ఖర్చులకు రూ.2 లక్షల అప్పులయ్యూరుు. వర్షాభావంతో పంట దెబ్బతినడంతో.. అప్పులు తీర్చలేమని మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరివేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందిన రైతు బాషమోని బాలస్వామి (35) అప్పులబాధతో గురువారం ఒంటికి నిప్పం టించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.