త్యాగికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి ఢిల్లీ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసిన ఆయన్ను శనివారం పటియాలో కోర్టులో హాజరు పర్చింది. దీంతో త్యాగితో మరో ఇద్దరు సంజీవ్ త్యాగి, న్యాయవాది గౌతమ్ కు డిశెంబర్ 30వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంపై దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ ఎస్పీ త్యాగి ని అరెస్ట్ చేసింది. భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ ఖేతాన్తో పాటు త్యాగి సోదరుడు సంజీవ్ త్యాగి అలియాస్ జూలీని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. విచారణకు సహకరించకపోవడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు సిబిఐ తెలిపింది.