26 మంది విద్యార్థులకు అస్వస్థత
వికటించిన డీఈసీ మాత్రలు
కరీంనగర్ హెల్త్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పైలేరియా నివారణ మాత్రలు వికటించి కరీంనగర్ సప్తగిరికాలనీ లోని కస్తూరిబా విద్యాలయానికి చెందిన 26 మంది విద్యార్థినులు బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసిన విద్యార్థుకు రెండున్నర ప్రాంతంలో ఈ మాత్రలు వేశారు.
భోజనం చేసిన వెంటనే మాత్రలు వేయాల్సి ఉండగా, సుమారు రెండు గంటలు ఆలస్యంగా వేయడం వల్ల రాత్రి వరకు 26 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుం టూ అవస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి గమనించిన పా ఠశాల సిబ్బంది 108కు సమాచారం అందించి పిల్లలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో అలీమ్‌ను వివరణ కోరగా.. విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, వారికి ఎలాంటి అపాయం లేదని తెలిపారు.