చెలరేగిన సందీప్
జింఖానా, న్యూస్‌లైన్: డెక్కన్ క్రానికల్ జట్టు బ్యాట్స్‌మన్ సందీప్ (68 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. దీంతో ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో రోజు మ్యాచ్‌లో ఎన్స్‌కాన్స్ జట్టుపై డెక్కన్ క్రానికల్ జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎన్స్‌కాన్స్ జట్టు 278 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ జట్టు 345 పరుగులు చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఎన్స్‌కాన్స్ జట్టు 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన్మయ్ అగర్వాల్ (85) అర్ధ సెంచరీతో రాణించాడు. డెక్కన్ క్రానికల్ బౌలర్ ఆకాష్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన డెక్కన్ క్రానికల్ రెండు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి నెగ్గింది.
డెక్కన్ క్రానికల్ 13, ఎన్స్‌కాన్స్ 5 పాయింట్లు దక్కించుకున్నాయి. మరో మ్యాచ్ బీడీఎల్ జట్టుపై, ఆంధ్రాబ్యాంక్ జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్‌లో బీడీఎల్ జట్టు 129, ఆంధ్రాబ్యాంక్ జట్టు 216 పరుగులు చే శాయి. తదనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బీడీఎల్ 185 పరుగులు చేసింది. విశాల్ జూడ్ ఫిలిప్స్ 41 పరుగులు చేశాడు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్స్ లలిత్ మోహన్ 5, కనిష్క్ నాయుడు 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆంధ్రాబ్యాంక్ రెండే వికెట్లకు 99 పరుగులు చేసి గెలిచింది. బీడీఎల్ 4, ఆంధ్రాబ్యాంక్ 10 పాయింట్లు పొందాయి.