బీడీఎల్, డీసీ మ్యాచ్ డ్రా
చెలరేగిన ఆకాశ్ భండారి, రాజన్
ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా బీడీఎల్, డెక్కన్ క్రానికల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 317/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ భండారి (99) సెంచరీ అవకాశం కోల్పోగా... సందీప్ రాజన్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు.
ఫలితంగా డీసీ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. అంతకుముందు బీడీఎల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులకు ఆలౌటైంది. దీంతో డెక్కన్ క్రానికల్‌కు 22 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌తో డెక్కన్ క్రానికల్ 8 పాయింట్లు సాధించగా, బీడీఎల్ 4 పాయింట్లతో సరిపెట్టుకుంది.
ఎన్స్కాన్స్తో ఆంధ్రా బ్యాంక్ మ్యాచ్ డ్రా
ఎన్స్‌కాన్స్, ఆంధ్రా బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. మ్యాచ్ మూడో రోజు గురువారం రెండో ఇన్నింగ్స్ప్రారంభించిన ఎన్స్‌కాన్స్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అరుణ్ దేవా (92), హిమాలయ్ అగర్వాల్ (55), హబీబ్ అహ్మద్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు అవకాశం లభించలేదు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచిన ఆంధ్రా బ్యాంక్‌కు 10 పాయింట్లు దక్కగా, ఎన్స్‌కాన్స్ 5 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.