Deeksha Panth
-
చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా!
సందీప్ బొలినేని, విష్ణుప్రియ, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్ మేట్’. ‘సూటిగా సొల్లు లేకుండా’ అన్నది ఉపశీర్షిక. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వేలంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ వేలంపల్లి మాట్లాడుతూ– ‘‘కొత్త రకం ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘చెక్ మేట్. మామూలుగా ప్రతి ప్రేమకథలో వారి కుటుంబ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి.. అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు క్లోజ్ ఫ్రెండ్ వల్లే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేంటి? స్నేహితురాలి నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తన ప్రేమని గెలిపించుకుంది? అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగమ్మాయి చేస్తే బాగుంటుందని విష్ణు ప్రియని సెలక్ట్ చేశాం. తన ఫ్రెండ్‌గా దీక్షా పంత్ నటించారు’’ అన్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, కృష్ణ భగవాన్, సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, సుధీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: అంజి (‘గరుడవేగ’ ఫేమ్), నేపథ్య సంగీతం: సాగర్ మహతి, సంగీతం–నిర్మాత–దర్శకత్వం: ప్రసాద్ వేలంపల్లి. -
‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆపరేషన్ 2019 జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : శ్రీకాంత్, దీక్షా పంత్, యగ్న శెట్టి, పోసాని కృష్ణమురళి సంగీతం : రాప్ రాక్ షకీల్ దర్శకత్వం : కరణం బాబ్జీ నిర్మాత : అలివేలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కనిపిస్తున్న వేళ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ 2019. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆపరేషన్ దుర్యోధన తరహాలో బోల్డ్‌గా తెరకెక్కించారు. కొంత కాలంగా సరైన హిట్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నారు. మరి తెలంగాణ ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆపరేషన్ 2019 ఏ మేరకు ఆకట్టుకుంది..? కథ ; నిరుపేద కుటుంబంలో పుట్టిన ఉమాశంకర్ (శ్రీకాంత్) ఊరి ప్రజల సహకారంతో ఉన్నత చదువులు చదివి ఫారిన్లో సెటిల్ అవుతాడు. చిన్నతనంలో ఊరి ప్రెసిడెంట్.. వీలైనంతలో నీ ఊరికో దేశానికో ఉపయోగపడాలని చెప్పిన మాటలు ఉమాశంకర్‌ను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తుంది. తమ ప్రాంతంలోని రైతులు అప్పులు తీర్చలేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయలను వారికోసం ఆ ప్రాంత ఎమ్మెల్యేకు పంపిస్తాడు. కానీ ఎమ్మెల్యే ఆ డబ్బును రైతులకు అందించకపోవటంతో రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఈ విషయం తెలిసి చలించిపోయిన ఉమాశంకర్ ఇండియా వచ్చి ఆ ఎమ్మెల్యేను ఎదిరిస్తాడు. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు తన తరుపున నారాయణ మూర్తి(శివకృష్ణ) అనే సామాజిక వేత్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలక్షన్లలో నిలబెడతాడు. కానీ కులం, మతం పేరుతో ప్రజలు అధికార పార్టీ నాయకుడికే పట్టం కడతారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మారాల్సింది నాయకులు కాదు ప్రజలు అని భావించిన ఉమాశంకర్ ఏం చేశాడు..? ప్రజలకు, నాయకులకు ఎలా కనువిప్పు కలిగించాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా శ్రీకాంత్ ఒక్కడి చుట్టూనే తిరుగుతుంది. మంచివాడిగా, మూర్ఖుడైన రాజకీయనాయకుడిగా రెండు కోణాల్లోనూ శ్రీకాంత్ నటన బాగుంది. దీక్షాపంత్, శివకృష్ణ, పోసాని కృష్ణమురళి, నాగినీడు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఎవరికీ పెద్దగా స్క్రీన్‌టైం దక్కలేదు. ఇక మంచు మనోజ్, సునీల్‌లు పెద్దగా ప్రాధాన్యం లేని అతిథి పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ : ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు కరణం బాబ్జీ మంచి కథను రెడీ చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో పరిస్థితులు, గెలిచిన నేతలు పార్టీలు మారటం, అమ్ముడుపోవటం, క్యాంప్ రాజకీయాలు లాంటి అంశాలతో కథ తయారు చేసుకున్నా.. ఆసక్తికరంగా తెరకెక్కించటంలో కాస్త తడబడ్డాడు. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి స్వయంగా అన్ని పర్మిషన్లు ఇచ్చేయటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ద్వితీయార్థంలో కథనం కాస్త వేగం అందుకుంటుంది. రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు ఆకట్టుకున్నా.. ప్రతినాయక పాత్రలు బలంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. షకీల్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; శ్రీకాంత్ సెకండ్‌హాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ స్క్రీన్‌ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
దమ్ముందా?
అదొక మహల్. అందులో ఏముందో చూడాలనే ఆసక్తి కలిగితే మాత్రం గుండె నిండా దమ్మూ ధైర్యం కావాలి. ఎందుకంటే అదొక మాయా మహల్. దాని గురించి తెలిసినవాళ్లు ఆమడ దూరం ఉంటారు. కానీ, కొందరు ధైర్యం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘మాయామాల్’. డేర్ టు ఎంటర్... అనేది ఉపశీర్షిక. దిలీప్, ఈషా, దీక్షా పంత్ ముఖ్య తారలుగా గోవింద్ లాలం దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ళ, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. గోవింద్ లాలం మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, యాక్షన్: విజయ్. 7 -
హైదరాబాద్‌కి థ్యాంక్స్
‘‘ఇక్కడికి చదువుకునే సమయంలో వచ్చాను. చదువుకుంటుండగానే మోడల్‌గా, ఆ తర్వాత సినీనటిగా మారాను. ఇవన్నీ ఈ సిటీలో ఉండగానే సాధించాను. అందుకే హైదరాబాద్‌కి థ్యాంక్స్’’ అంది దీక్షాపంత్. ఓ లగ్జరీ ఎక్స్పోను ప్రారంభించిన ఈ నైనిటాల్ బ్యూటీ.. నగరంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ.. ‘‘ఈ సిటీలో మూడున్నర సంవత్సరాల పాటు మోడల్‌గా ఉన్నాను. పాప్యులర్ బ్రాండ్స్‌తో వర్క్ చేశాను. నగరంలోనే 100కుపైగా ర్యాంప్షోల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ నేపధ్యంతో వచ్చిన గుల్లుదాదా-3 సినిమాలో నటించాను. అలా అలా టాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాను’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒకలైలా కోసం, గోపాల-భూపాల, తొండి తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నానని చెప్పిన ఈ స్లిమ్ గాళ్.. గుల్లుదాదా చిత్రంతో తనకు పాతబస్తీలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని సంబర పడిపోయింది.