హైదరాబాద్‌కి థ్యాంక్స్ | Deeksha panth says thanks to Hyderabad city | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కి థ్యాంక్స్

Published Fri, Jul 4 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

Deeksha panth says thanks to Hyderabad city

‘‘ఇక్కడికి చదువుకునే సమయంలో వచ్చాను. చదువుకుంటుండగానే మోడల్‌గా, ఆ తర్వాత సినీనటిగా మారాను. ఇవన్నీ ఈ సిటీలో ఉండగానే సాధించాను. అందుకే హైదరాబాద్‌కి థ్యాంక్స్’’ అంది దీక్షాపంత్. ఓ లగ్జరీ ఎక్స్‌పోను ప్రారంభించిన ఈ నైనిటాల్ బ్యూటీ.. నగరంతో తనకున్న   అనుబంధాన్ని నెమరేసుకుంటూ.. ‘‘ఈ సిటీలో మూడున్నర సంవత్సరాల పాటు మోడల్‌గా ఉన్నాను. పాప్యులర్ బ్రాండ్స్‌తో వర్క్ చేశాను. నగరంలోనే 100కుపైగా ర్యాంప్‌షోల్లో పాల్గొన్నాను.

ఆ తర్వాత హైదరాబాద్ నేపధ్యంతో వచ్చిన గుల్లుదాదా-3 సినిమాలో నటించాను. అలా అలా టాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాను’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒకలైలా కోసం, గోపాల-భూపాల, తొండి తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నానని చెప్పిన ఈ స్లిమ్ గాళ్.. గుల్లుదాదా చిత్రంతో తనకు పాతబస్తీలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని సంబర పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement