Deep freezer
-
గడ్డకట్టిన అమెరికా సూపర్ ఫోటోలు చూడండి
-
కరెంట్ అవసరం లేని బుల్లి ఏసీ!
డీప్ ఫ్రీజర్ను మరింత సమర్థంగా వాడుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఫొటోలో కనిపిస్తున్న బుల్లి ఏసీ మీకోసమే. గైజర్ అని పిలుస్తున్న దీనికి కరెంటే అవసరం లేదు.. ఎక్కువ స్థలం కూడా పట్టదు. మండే ఎండల్లో ఇంట్లో చల్లటి గాలి అందిస్తుంది. మంచుముక్కలతో కూడిన ఓ బుల్లిపెట్టెను ఈ గాడ్జెట్లో పెట్టేస్తే సరి. ఈ పరికరం అడుగుభాగంలో ఉండే బ్యాటరీ ద్వారా పై భాగంలో ఉండే ఫ్యాన్ తిరుగుతుంది. ఈ మంచు ముక్కలు కరగడం ద్వారా చల్లటి గాలి బయటకు వస్తుంది. ఈ గైజర్లో ఉండే ఓ ప్రత్యేకమైన రసాయనం.. మంచు చాలా నెమ్మదిగా కరిగేలా చేస్తుంది. అందులోనూ కలపతో తయారైన ఈ గైజర్ వేడి లేదా చల్లదనం ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. దీనిపైన ఉండే ప్రత్యేకమైన కిటికీ ద్వారా దాదాపు 12 చదరపు మీటర్ల వైశాల్యమున్న గదులను కూడా తొందరగా చల్లబరుస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం కిక్స్టార్టర్లో నిధుల సమీకరణ జరుగుతోంది. -
నిలవకు విలువైన సూత్రాలు
ఇంటిప్స్ సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్లో నిలవ ఉంచితే ఎక్కువ రోజులు వాసన పోకుండా తాజాగా ఉంటాయి. పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు.కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్ చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ల మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. పుట్టగొడుగులు వాతావరణంలోని తేమ ను పీల్చుకుని ఉంటాయి. వండేటప్పుడు కడిగితే మరింతగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కడగకుండా శుభ్రమైన పేపర్తో కాని వస్త్రంతో కాని తుడవాలి. బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి.కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. -
ఐస్ చక్రాలు...
లండన్లోని లెక్సస్ కారు కంపెనీలో పనిచేసే ఔత్సాహికులకు ఓ ఆలోచన వచ్చింది. మంచు బాగా కురుస్తున్నపుడు రోడ్లపై కార్లు పట్టుతప్పి పక్కకు జారిపోవడం లేదా మంచులో కూరుకుపోవడం చూస్తుంటాం. అలాంటపుడు అదే మంచుతో చక్రాలను తయారు చేసి చూస్తే... అని సరదాగా అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ నలుగురు సుమారు 36 గంటల పాటు శ్రమించి నాలుగు మంచు చక్రాలను తయారు చేశారు. లెక్సస్ ఎన్ఎక్స్ హైబ్రిడ్ కారును డీప్ ఫ్రీజర్ను పోలిన వాతావరణం ఉండే రూములో ఉంచి మంచు చక్రాలను బిగించారు. తర్వాత మెల్లిగా మైదానంలోకి తీసుకొచ్చి నడిపారు. ఎంతదూరం నడిపారు... ఈ చక్రాలు ఎంతవరకు కరిగిపోకుండా ఉన్నాయనే వివరాలేమీ వీరు బయటపెట్టలేదు. సరదాగా చేసిన ప్రయత్నమని చెప్పుకొచ్చారు.