defection MLA
-
చంద్రబాబు అసెంబ్లీలోఅడుగుపెట్టడానికి అనర్హుడు..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. కొవ్వూరు, నిడదవోలు, పత్తిపాడు ఎమ్మెల్యే టికెట్లు సిట్టింగులకు కేటాయించొద్దని పార్టీ నేతలు అధిష్టాన్ని హెచ్చరించినట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానాల పరిధిలో శనివారం అభ్యర్థుల ఎంపిక సమావేశం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చ సందర్భంగా.. కొవ్వూరు స్థానం మంత్రి జవహర్‌కు కేటాయించొద్దని తమ్ముళ్లు పట్టుబట్టారు. జవహర్ మద్యం, ఇసుక మాఫియాలో కూరుకుపోయాడని పార్టీ నాయకులు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ మాటను లెక్కచేయక జవహర్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. ఇక, కాకినాడ పార్లమెంటు పరిదిలోని పత్తిపాడు ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు చంద్రబాబు టికెట్ నిరాకరికంచిట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో వరుపుల రాజాకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. నిడదవోలు పరిస్థితి కూడా అంతే.. నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటు ఇవ్వొద్దని స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం ఎక్కువైందని, శేషారావు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరావుపై కూడా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థిని మార్చాలని నేతలు డిమాండ్ చేశారు. నేతల విభేదాలతో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యుర్థుల ఎంపిక వాయిదా పడింది. -
ఫిరాయింపులు కూడా మోదీ ఘనతేనా?
సాక్షి, న్యూఢిల్లీ : వరుసగా ఒక్కో రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ అధికారం కైవసం చేసుకుంటున్న బీజేపీ మిగతావాటిపై కూడా దృష్టిసారించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మేఘాలయాలో ఎన్నికల ముందుగానే ఒక్కసారిగా రాజకీయంగా అలజడి చెలరేగింది. అసంతృప్త అధికారపక్ష నేతలు ఒక్కోక్కరిగా ఎన్టీఏ మిత్ర పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరిపోతున్నారు. అయితే ఈ ఫిరాయింపులను కూడా మోదీ పుణ్యమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటుండటం విశేషం. బీజేపీ జాతీయ ప్రతినిధి రామ్ మాధవ్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. మేఘాలయ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం. ఆయన పిలుపు మేరకే అభివృద్ధి కోసం వారంతా పార్టీ మారుతున్నారు అంటూ మాధవ్ పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామిక వ్యతిరేక ఫిరాయింపులను కూడా గర్వంగా ప్రధాని కట్టబెడుతున్న మాధవ్ మేధస్సుకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కాగా, మేఘాలయాలో ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండటం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రొవెల్ల్ లింగ్దోతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఎన్పీపీలో చేరిపోయారు. మరో ముగ్గురు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎన్పీపీలో చేరిపోగా.. ఇప్పుడు మరో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో.. ప్రస్తుతం సీఎం ముకుల్ సంగ్మా తరపున 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. In Meghalaya today, 4 MLAs from Congress n other parties will join BJP together with other elected members n hundreds of supporters. 'Meghalaya for Change - Meghalaya for BJP' is PM's call — Ram Madhav (@rammadhavbjp) 2 January 2018 -
ఫిరాయింపు ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత
-
పాత నేతలకు భంగపాటు
♦ ఎమ్మెల్యేలు చెప్పినట్లే సీఐల బదిలీలు ♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ♦ వారు చెప్పిన వారికే పోస్టింగులు ♦ జిల్లాలో ఆరుగురు సీఐల నియామకం ♦ అధికార పార్టీ పాత నేతలకు మొండిచేయి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చిన అధిష్టానం టీడీపీ పాత నేతలకు మొండిచేయి చూపించింది. పాత టీడీపీ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పినట్లే సీఐలను బదిలీ చేసి వారికే ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు లోకేష్ గట్టిగా సంకేతాలు పంపినట్లయింది. దీంతో 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసిన తమ్ముళ్లకు భంగపాటు తప్పలేదు. వారి భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది వేచి చూడాల్సిందే.. జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జరిగిన బదిలీలు పరిశీలిస్తే... కొత్తగా పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి సీఐగా ఉన్న బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావును నియమించారు. పార్టీ మారకముందు నుంచి గొట్టిపాటికి సీఐ ప్రసాద్ అంటే పడదు. వారి మధ్య విభేదాలున్నాయి. తాజాగా అధికార పార్టీలో చేరిన గొట్టిపాటి ఎట్టకేలకు సీఐను బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అతనిని బదిలీ చేసి పార్టీ అధిష్టానం కరణంకు మొండిచేయి చూపించింది. గిద్దలూరు సీఐగా ఉన్న ఫిరోజ్ పట్ల ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి వ్యతిరేకత ఉంది. అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరటంతోనే ఫిరోజ్ బదిలీకి పట్టుపట్టినట్లు సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అడ్డుపడటంతో ఫిరోజ్ బదిలీ తాత్కాలికంగా ఆగింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రితో పాటు చినబాబు లోకేష్ సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఫిరోజ్ బదిలీ కోసం అశోక్‌రెడ్డి మరోమారు పట్టుపట్టారు. దీంతో ఎమ్మెల్యే చెప్పినట్లే ఫిరోజ్‌ను బదిలీ చేసి ఆయన ప్రతిపాదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీరాంను గిద్దలూరు సీఐగా నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు భంగపాటు తప్పలేదు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆదేశాల మేరకు కందుకూరు సీఐగా ఉన్న లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసిన అధికారులు ఆయన స్థానంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన వీఆర్‌లో ఉన్న నరసింహారావును కందుకూరు సీఐగా నియమించారు. పార్టీలో చేరకముందు నుంచి పోతుల రామారావుకు లక్ష్మణ్ అంటే గిట్టదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరడంతో ఎట్టకేలకు లక్ష్మణ్‌ను బదిలీ చేయించి ఎమ్మెల్యే ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో పాత కాపు దివి శివరాంకు అధిష్టానం మొండిచేయి చూపించినట్లయింది. చీరాల నియోజకవర్గానికి సంబంధించి చీరాల సీఐ సత్యనారాయణను ఏసీబీకి బదిలీ చేసి వీఆర్‌లో ఉన్న కె.వెంకటేశ్వరరావును చీరాల సీఐగా నియమించారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరిక మేరకే నిమ్మగడ్డ సత్యనారాయణను బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పాత టీడీపీ వర్గం పోతుల సునీతతో పాటు ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వర్గాలకు అధిష్టానం మొండిచేయి చూపింది. ఒంగోలు రూరల్ సీఐగా ఉన్న సంజీవ్‌కుమార్‌ను ఏసీబీకి బదిలీ చేసి డీజీపీ పీఆర్ఓగా ఉన్న మురళీకృష్ణను ఒంగోలు రూరల్ సీఐగా నియమించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదేశాల మేరకు సీఐ నియామకం జరిగినట్లు సమాచారం. మొత్తం మీద సీఐల బదిలీల్లో పార్టీ అధిష్టానం ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చి పాత పచ్చచొక్కా నేతలకు మొండిచేయి చూపించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో ఇప్పటికే గిద్దలూరు, అద్దంకి, కందుకూరు ప్రాంతాల్లో టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక గొడవలు అధిష్టానం వద్దకు చేరాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు చినబాబు లోకేష్‌లు ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు సీఐల బదిలీల వ్యవహారంలో పాత నేతలను పక్కనపెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకే అధిష్టానం ప్రాధాన్యతనిచ్చింది. ఈ పరిస్థితుల్లో పాత నేతల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. భంగపాటుకు గురైన పాత నేతలు అధికారం కోసం తలొగ్గి ఎమ్మెల్యేల చెప్పుచేతల్లో పని చేస్తారా... లేక అధిష్టానంతో ఆమీతుమీకి తేల్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.