defectors mlas
-
కులాల లెక్కన...‘ఆకర్ష్’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్‌కార్పెట్ వేయగా, ఎన్నికల షెడ్యూల్ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది. ముందే చేరికలను తెరతీసిన బీజేపీ గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్దేవ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్ రాజ్‌భర్‌ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్భర్లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్‌రాజ్ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్ తివారీ, మరో కీలక నేత విజయ్ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్‌లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్సింగ్, నరేంద్రసింగ్ భాటి, సీపీచాంద్, రామ్ నిరంజన్లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ ఆటలో వేడి పెంచిన ఎస్పీ చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్‌కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్ మసూద్‌ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్ సైనీ, మసూద్ అక్తర్‌లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్ వ్యూహ రచన చేస్తున్నారు. -
అన్యులకు సీట్లు.. బీజేపీలో ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్టీ నుంచి బయటకు వెళ్దామంటే పార్టీ కార్యకర్తలే పట్టుకొని తంతారు. పార్టీ అధిష్టానమేమో పార్టీ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి బొట్టు పెట్టి టిక్కెట్లు ఇస్తోంది’ ఇది పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో నెలకొన్న పరిస్థితి. ఈ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ సీట్లను బీజేపీ అధిష్టానం అన్యులకు కేటాయించింది. దీనిపై జిల్లా నాయకత్వం, కార్యకర్తలు మండిపోతున్నారు. ఉత్తర బెంగాల్‌లోని మాల్డా ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. మాల్డాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కొన్నేళ్లుగా బలపడుతుండడంతో అక్కడ కూడా రాజకీయ అలజడ మొదలయింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి బీజేపీ ఓ సీటును కూడా గెలుచుకొంది. ఈ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటి బీజేపీకి ఒక్క సీటు రావడం విశేషం. 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా మత ఘర్షణలు చెలరేగడం బీజేపీకి లాభించింది. కాలియాచౌక్ పట్టణంలోని పోలీసు స్టేషన్‌పై ముస్లింలు దాడి చేయడంతోపాటు రెండు డజన్ల వాహనాలను దగ్ధం చేశారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాజెన్ ముర్మూ మార్చి 12వ తేదీన బీజేపీలో చేరారు. ఆయనకు మాల్డా ఉత్తర లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ అధిష్టానం ఇచ్చింది. ఇక మాల్డా దక్షిణ లోక్‌సభ సీటును 2015లో బీజేపీలో చేరిన మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శ్రీరూపా మిత్ర చౌధురికి కేటాయించింది. పర్యవసానంగా జిల్లా పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి అలుముకున్న విషయం తనకు తెలుసునని జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజిత్ మిశ్రా అంగీకరించారు. అయితే అన్ని పార్టీల్లో కూడా ఇలా జరుగుతుందని, అభ్యర్థులను ప్రకటించిన వెంటనే అసంతృప్తులను మరచిపోయి వారి విజయానికి కృషి చేయడం క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తల బాధ్యతని తాను నచ్చచెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు. ఒక్క మాల్డా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీ అధిష్టానం అన్యులకే పార్టీ టిక్కెట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 42 సీట్లకుగాను బీజేపీ 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో పది మంది అభ్యర్థులు తృణమూల్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుబడ్డ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్ కూడా ఉన్నారు. ఈ కారణంగా చాలా చోట్ల స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాలుగో అభ్యర్థి విషయంపై నిర్ణయం వాయిదా
విజయవాడ: రాజ్యసభకు నాలుగవ అభ్యర్థి విషయంలో చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఆయన మరోసారి సమావేశం కానున్నారు. అయితే ఈసారి సీన్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సోమవారం భేటీ అయిన ఆయన రేపు మలివిడత సమావేశం అవుతారు. కాగా అంతకు ముందు సమావేశంలో.... ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు అడిగినట్లు సమాచారం. ఈలోగా ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఫోన్లు రావడంతో మళ్లీ మాట్లాడతానంటూ ఆయన లోనికి వెళ్లిపోయారు. దీంతో నాలుగో అభ్యర్థి విషయంలోనూ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు (బీజేపీ) పేర్లను చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేశామని, అనంతరం సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారికే తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ భేటీ అయ్యారు. వాస్తవానికి టీడీపీ బలం రెండు రాజ్యసభ సీట్లు గెల్చుకోవడానికే సరిపోతుంది. కానీ..నాలుగు సీట్లకు అభ్యర్థులను నిలుపుతామంటూ టీడీపీ నేతలు ఎల్లో మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిపించుకునే బలం లేకపోయినా టీడీపీ మాత్రం పోటీకి సిద్ధం అవుతోంది. ఓటుకు కోట్లు తరహాలో వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడింది. సాక్షాత్తూ సీఎం అధికార నివాసంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దిగజారని విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ బాషా, జయరాములు, ఆదినారాయణరెడ్డి, సునీల్ కుమార్, గొట్టిపాటి రవికుమార్, డేవిడ్ రాజు, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, కిడారి సర్వేశ్వరరావు, సుజయకృష్ణ రంగారావు, కలమట వెంకటరమణ ...తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.