ఫలితాల కోసం ఎదురుచూపు..!
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ తృతీయ ఏడాది ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. ఫలితాల కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడంలేదు. ఇప్పటికే ఏయూ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ మాత్రం ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. జిల్లా నుంచి డి గ్రీ తృతీయ ఏడాది 14,550 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 4 నుంచి 17 వరకు పరీక్షలు జరిగాయి.
ఎడ్సెట్, ఐసెట్, ఆసెట్, ఇతర యూనివర్సిటీల పీజీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఫలితాలు విడుదలైతే రెట్టింపు ఉత్సాహంగా చదివేందుకు ఆస్కారం ఉన్నా విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ పరీక్షణ నిర్వహణాధికారి ప్రొఫసర్ తమ్మినేని కామరాజు వద్ద ప్రస్తావించగా మరో పది రోజుల్లో ఫలితాలు ప్రకటించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.