Delhi Beauty
-
పాట కోసం 50 గంటల ప్రయాణం!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్‌కి మంచి మలుపు అయ్యింది. ఎక్స్‌ప్రెస్ వేగంతో ఆమె కెరీర్ దూసుకెళుతోంది. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో ఉన్న ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతున్నారు. దాంతో ప్రయాణాలు బాగా అలవాటై పోయాయి. కానీ, ఇప్పటివరకూ చేయనంత సుదీర్ఘ ప్రయాణం ఆమె చేశారు. అది ‘సరైనోడు’ సినిమా కోసం. అల్లు అర్జున్, రకుల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఆ పాటను సౌత్ అమెరికాలోని బొలీవియాలో గల ఉయుని నగరంలో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉయుని చేరుకోవాలంటే దాదాపు 50 గంటలు పడుతుందట. ఆ విషయం గురించి రకుల్ ప్రస్తావిస్తూ - ‘‘50 గంటలైనా ఇంకా చేరుకోలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణం మంచి అనుభూతినిస్తోంది. ఉయుని చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన ప్రదేశం వెళ్లడం కోసం ఇన్ని గంటలు కష్టపడడం సబబే’’ అని మరికాసేపట్లో గమ్యం చేరుకుంటారనగా పేర్కొన్నారు. మొత్తానికి లాంగ్ జర్నీ చేసి, ఈ యూనిట్ ఆ తర్వాత ఉయుని చేరుకున్నారు. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా షూటింగ్ జరగని అద్భుత ప్రదేశమది. ఈ నెల 13 వరకూ పాట చిత్రీకరించి, చిత్రబృందం హైదరా బాద్‌కు తిరుగు ప్రయాణమవుతుంది. -
ఒక్కసారి తప్పటడుగేస్తే...!
‘‘ఎన్ని పాత్రలు చేసినా చేయడానికి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి. అందుకే వందల సినిమాలు చేసినా కళాకారుల దాహం తీరదు’’ అని తాప్సీ అన్నారు. ఈ ఢిల్లీ బ్యూటీ గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చిత్రాల్లో కనిపిస్తారు. ఇప్పటికే మూడు చిత్రాలు కమిట్ అయ్యారామె. వాటి గురించి తాప్సీ చెబుతూ - ‘‘ప్రస్తుతం అంగీకరించిన చిత్రాల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘ఘాజి’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. నా కెరీర్‌కి ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఇది కాకుండా సంతకం చేసిన మరో రెండు సినిమాలు కూడా నటిగా నాకు ఇంకా మంచి పేరు తెచ్చే విధంగానే ఉంటాయి. మంచి పాత్రల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అందుకే, కొన్ని రోజులు ఖాళీగా కూడా ఉన్నాను. నా నిరీక్షణ వృథా కాలేదు. మంచి అవకాశాలు దక్కాయి. హిందీ పరిశ్రమలో అవకాశాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మంచి కథలు ఎంపిక చేసుకోవడం మాత్రం కష్టమే. ఒక్క సెలక్షన్ రాంగ్ అయితే చాలు... ఇక రెండోది సెలక్ట్ చేసుకునే అవకాశమే ఉండదు. అందుకే, ప్రతి అడుగూ పదిలంగా వేయాలి. ఆ... ఏముందిలే అని ఎలా పడితే అలా సినిమాలు చేసేస్తే, నిలదొక్కు కోవడం కష్టం. అందుకే సిని మాల సెలక్షన్ విషయంలో కాస్త ఓపికగా వ్యవహరించాలి’’ అని వివరించారు. -
ఢిల్లీలో అబ్బాయిలు వెంటపడతారు
ఢిల్లీలో అబ్బాయిలు వెంటపడతారు, అల్లరి చేస్తారు అని అంటోంది నటి తాప్సీ. తాప్సీ ఢిల్లీ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. బాల్యం నుంచి నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు కోలీవుడ్ వయా టాలీవుడ్ అంటూ హీరోయిన్గా విరాజిల్లుతున్న ఈ భామ కోలీవుడ్‌లో విజయం కోసం ఎదురు చూసి వేశారగా ఎట్టకేలకు కాంచన-2తో దాన్ని అందుకుంది. ఆ తరువాత కూడా అంతగా అవకాశాలు లేవు. ప్రస్తుతం శింబు సరసన కాన్ అనే చిత్రం చేస్తోంది. హిందీలో రెండు, మూడు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు పనిలో పనిగా స్నేహితురాళ్లతో కలిసి పెళ్లిళ్లు కుదిర్చే కంపెనీ ప్రారంభించింది. అం తే కాకుండా ముంబైలోలో ఎడాపెడా రెండు ఇళ్లు కొని పడేశారు. దీని గురించి తాప్సీ తెలుపుతూ తాను ఢిల్లీ అమ్మాయినని, ఢిల్లీ అంటే చాలా చాలా ఇష్టం అని తెలిపింది. అయితే ఢిల్లీలోనే ఇల్లు కొనుక్కోవచ్చుగా అని మీరు అడగవచ్చు. అక్కడ ఇల్లు కొనాలంటూ చాలా పెట్టుబడి కావాలి. ఇప్పుడది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ముంబైలోని నోయిడా ప్రాంతంలో రెండు ఇళ్లు కొని పడేస్తే తరువాత వాటి విలువ పెరుగుతుందని భావించానని వివరించింది. ఆ ఇళ్లను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే బాలీవుడ్ ఢిల్లీకి మారాలని రోజూ దేవుడిని మొక్కుకుంటానని పేర్కొంది. ఢిల్లీ అమ్మాయిగా తాను గర్వపడతానని, ఢిల్లీలో అమ్మాయిలకు రక్షణ లేదుగా అన్న ప్రశ్నకు ప్రతి ప్రాంతంలో ప్లస్, మైనస్‌లు ఉంటాయని, తానిప్పటికీ ఢిల్లీకి కారులో ఒంటరిగానే వెళుతుంటానని చెప్పింది. ఒక్కోసారి కొందరు అబ్బాయిలు వెంటపడతారని, అల్లరి పెడతారని అంతకంటూ పెద్దగా ఏమీ జరగదని తాప్సీ తెలిపింది. -
నా ఫిగరే జవాబు చెబుతుంది
నటి సురభి చూడడానికి చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అయితే ప్రవర్తనలో మాత్రం చాలా బోల్డ్. ఇవన్‌వేరమాదిరి చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచ యం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. ఆ మధ్య వేలై ఇల్లా పట్టాదారి చిత్రం చిన్న పాత్ర అయినా పెద్ద పేరే పొందిన సురభి తాజాగా నటుడు జై సరసన పుగళ్ చిత్రంతో తెరపైకి రావడానాకి సిద్ధం అవుతోంది. మరిన్ని ఆఫర్లు ఎదురు చూస్తున్నాయంటున్న ఈ భామతో చిన్న చిట్‌చాట్.. ప్రశ్న: ఉత్తరాది నుంచి వచ్చారు. తమిళ భాషలో నటించడం కష్టం అనిపించడం లేదా? జ: నాకు చిన్నతనం నుంచి నట నంటే యమ పిచ్చి. హిరోయిన్ కా వాలన్నది నా కల. అందుకే యా క్టింగ్లో శిక్షణ పొందాను. అయితే తమిళంలో పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు వస్తాయని ఊహించలే దు. ఇక్కడ మరిన్ని చిత్రాలను చెయ్యాలని ఆ శిస్తున్నాను. అందుకే తమిళ భాష కష్టం అయి నా ఇష్టపడి నటిస్తున్నాను. ఒక రకంగా ఛాలెంజింగే. సంభాషణలను ఇంగ్లిష్ లో రాసుకుని బట్టీ పట్టి ముందుగా నే ప్రాక్టీస్ చేసుకుంటాను.డబ్బింగ్ నే ను చెప్ప ను కాబట్టి లిప్ మూమెంట్ విషయంలో జాగ్రత్త వహిస్తాను.చెన్నైకి వచ్చి వెళ్లడం వల్ల ఇప్పుడు తమిళ భాషను అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్రశ్న: మీ శారీరక భాష గురించి కామెంట్ చేసే వాళ్లపై మీ స్పందన? జ: తమిళ భాష నాకిప్పుడు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. నా శారీరక భాష సమ్‌థింగ్ బ్యాడ్ అనే వాళ్లకు ముందు ముందు నా ఫిగరే సమాధానం చెబుతుంది. ప్రశ్న: ఇంకా యాక్షన్ క్లాసులకు వెళుతున్నారట? జ: అవును ఢిల్లీలోని మెర్రీ జాన్ యాక్టింగ్ సూడియోలో యాక్టింగ్ క్లాసులకు వెళుతున్నాను. ఈ క్లాసులు నా యాక్టింగ్‌కు చాలా హెల్ప్ అవుతున్నాయి. ప్రశ్న: సరే జైతో నటిస్తున్న పుగళ్ చిత్రం గురించి? జ: ఇది రాజకీయ నేపథ్యంలో రూపొం దుతున్న విభిన్న కథా చిత్రం.ఇందులో నాది చిన్న చిన్న విషయాల్లో కూడా ఫైట్ చేసే డామినేటెడ్ గర్ల్ పాత్ర. చిత్ర రెండవ భాగంలో హీరో జై మంచి పనులను అర్థం చే సుకుని తనకు సహకరిస్తాను. చాలా ఆసక్తికరమైన పాయింట్‌తో రూపొందుతున్న కథా చిత్రం. ప్రశ్న: ఇతర భాషల్లో కూడా నటిస్తున్నట్లున్నారు? జ: తెలుగులో ఇప్పటికే బిరువా చిత్రంలో నటించాను. త్వరలో శర్వానంద్ సరసన మరో చి త్రం చేయనున్నాను.అలాగే తమిళంలో ఒక పెద్ద చిత్రం చేయనున్నాను.ఆ విషయాలు తరువాత వెల్లడిస్తాను.