
ఢిల్లీలో అబ్బాయిలు వెంటపడతారు
ఢిల్లీలో అబ్బాయిలు వెంటపడతారు, అల్లరి చేస్తారు అని అంటోంది నటి తాప్సీ. తాప్సీ ఢిల్లీ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. బాల్యం నుంచి నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు కోలీవుడ్ వయా టాలీవుడ్ అంటూ హీరోయిన్‌గా విరాజిల్లుతున్న ఈ భామ కోలీవుడ్‌లో విజయం కోసం ఎదురు చూసి వేశారగా ఎట్టకేలకు కాంచన-2తో దాన్ని అందుకుంది. ఆ తరువాత కూడా అంతగా అవకాశాలు లేవు. ప్రస్తుతం శింబు సరసన కాన్ అనే చిత్రం చేస్తోంది.
హిందీలో రెండు, మూడు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు పనిలో పనిగా స్నేహితురాళ్లతో కలిసి పెళ్లిళ్లు కుదిర్చే కంపెనీ ప్రారంభించింది. అం తే కాకుండా ముంబైలోలో ఎడాపెడా రెండు ఇళ్లు కొని పడేశారు. దీని గురించి తాప్సీ తెలుపుతూ తాను ఢిల్లీ అమ్మాయినని, ఢిల్లీ అంటే చాలా చాలా ఇష్టం అని తెలిపింది. అయితే ఢిల్లీలోనే ఇల్లు కొనుక్కోవచ్చుగా అని మీరు అడగవచ్చు. అక్కడ ఇల్లు కొనాలంటూ చాలా పెట్టుబడి కావాలి. ఇప్పుడది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ముంబైలోని నోయిడా ప్రాంతంలో రెండు ఇళ్లు కొని పడేస్తే తరువాత వాటి విలువ పెరుగుతుందని భావించానని వివరించింది.
ఆ ఇళ్లను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే బాలీవుడ్ ఢిల్లీకి మారాలని రోజూ దేవుడిని మొక్కుకుంటానని పేర్కొంది. ఢిల్లీ అమ్మాయిగా తాను గర్వపడతానని, ఢిల్లీలో అమ్మాయిలకు రక్షణ లేదుగా అన్న ప్రశ్నకు ప్రతి ప్రాంతంలో ప్లస్, మైనస్‌లు ఉంటాయని, తానిప్పటికీ ఢిల్లీకి కారులో ఒంటరిగానే వెళుతుంటానని చెప్పింది. ఒక్కోసారి కొందరు అబ్బాయిలు వెంటపడతారని, అల్లరి పెడతారని అంతకంటూ పెద్దగా ఏమీ జరగదని తాప్సీ తెలిపింది.