Delhi gangrape
-
బాల నేరస్తుడిపై సుప్రీంకోర్టు ఏమందంటే..
న్యూఢిల్లీ: బాల నేరస్తుల చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు)ని విడుదల చేయకుండా ఉండాలని ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటంటే.. మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం? ఏదైనా జరిగిందంటే అది చట్టానికి లోబడే, చట్ట ప్రకారమే జరిగింది. మేం చట్టానికి అతీతులం కాదు రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును మేం హరించలేము. చట్టంలో అలాంటి అవకాశం పొందుపరచలేదు. మేం మీ ఆందోళనను అర్ధం చేసుకోగలం.. కానీ, ఈ కేసులో చట్టం మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు అనుమతించదు ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటి వరకు అతడిని అదుపులో ఉంచుకోగలమా? ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట అనుమతి ఏది? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. -
'నేరం గెలిచింది.. మమ్మల్ని పాతాళానికి తొక్కారు'
న్యూఢిల్లీ: తమ విషయంలో నేరమే గెలిచిందని ఢిల్లీలో లైంగిక దాడికి గురై ప్రాణాలుకోల్పోయిన నిర్భయ(జ్యోతిసింగ్) తల్లి ఆశాదేవీ అన్నారు. తమ మూడు సంవత్సరాల పోరాటం వృధా అయిందని, శూన్యంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. అతడిని తన సొంతప్రాంతం ఉత్తరప్రదేశ్‌కు పంపించకుండా ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించారు. అతడి విడుదల సందర్భంగా నిరసన తెలుపుతున్న నిర్భయ(జ్యోతిసింగ్) తల్లిదండ్రులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తన తీరు, దేశ న్యాయవ్యవస్థపట్ల వారు తీవ్రంగా కలత చెందారు. మిగిలిన నలుగురు నేరస్తులను కూడా విడిచిపెడతారా అని ప్రశ్నించారు. తమ మూడేళ్ల పోరాటం శూన్యంగా మిగిలిందంటూ కంటతడిపెట్టారు. ఈ న్యాయవ్యవస్థ తమ కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసిందని అన్నారు. బాల నేరస్తుల చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి అని కూడా ఆమె ప్రశ్నించారు. -
రాంగ్ రూట్లో రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్
-
జంతర్‌మంతర్‌లో నేటికీ...
సాక్షి, న్యూఢిల్లీ: ‘డిసెంబర్ 16’ రాత్రి ఘటన ఇంకా ఢిల్లీవాసుల మదిలో మెదులుతూనే ఉంది. ఆడబిడ్డపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ చిన్నా పెద్దా.. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరి పిడికిళ్లు బిగిశాయి. కన్నెర్ర చేసిన ఢిల్లీయువత ఆగ్రహానికి రైసినాహిల్స్ జనసంద్రంగా మారింది. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీ యావత్తు ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. అంతా ఒక్కటై నిర్భయకు న్యాయం చేయాలని నినదించారు. పోలీసు ఆంక్షలు వారిని ఆపినా.. బారికేడ్లు అడ్డుపెట్టినా జనసామాన్యం గొంతుకను వినిపించే జంతర్‌మంతర్ ఆందోళనలో తాను పాలుపంచుకుంది. ఆందోళనకారులను తన అక్కున చేర్చుకుని నినాదాలతో ఘోషించి ంది. 16 డిసెంబర్ క్రాంతి పేరిట ఏర్పడిన సంస్థ నిర్భయ నిందితులను తుదముట్టించేవరకు పోరు సాగిస్తాంటూ జంతర్‌మంతర్‌లో నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏడాది గడిచినా జంతర్‌మంతర్‌లో నిర్భయ ఘటన అనంతర ఉద్యమాల తాలూకా జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నేటికి మారుమ్రోగుతున్న నినాదాలు: కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన దాడి ఘటన తర్వాత జనాగ్రహం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తూ వచ్చింది. రోజురోజుకు ఆందోళనలో పాల్గొనే వారి సంఖ్య వందల నుంచి వేలల్లోకి మారిపోయింది. ‘వీ వాంట్ జస్టిస్...’ ‘ఫాంసీదో.. ఫాంసీదో..’అంటూ చేసిన నినాదాలు నేటికి ఆ ప్రాంతానికి వెళితే చెవుల్లో మారుమ్రోగినట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుపై పడుకునేందుకు ఉడికిపోయారు యువత. నిరసన వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకున్నారు. కొందరు ఆవేదనతో దిక్కులు పిక్కటిల్లేలా ‘న్యాయం చేయండి’అంటూ నినదిస్తే.. జావత్ జాతిని మేల్కొలిపిన ‘చెల్లెమ్మ’ ఆరోగ్యం కుదుటపడాలంటూ నిరంతరం ప్రార్థనలు చేశారు. కళాకారులు సైతం కుంచె కలిపారు. తమ బొమ్మలతో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చూపారు. నిర్భయ సమాధిని ఏర్పాటుచేసి అక్కడ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జంతర్‌మంతర్‌లో చేసే ధర్నాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిర్భయ ఘటనలు ఒకటి. ఇక్కడ ఏళ్లుగా ఆందోళనలు చేసినా నెరవేరని ఎన్నో డిమాండ్లు ఉన్నా, నిర్భయ ఘటనలో యువత స్పందించిన తీరు.. జంతర్‌మంతర్‌లో కొనసాగిన నిరసనల హోరు పార్లమెంట్‌నూ కుదిపేసింది.ఘటన జరిగిన తర్వాత నుంచి నిర్భయ మతి ఆతర్వాతి పరిణామాల వరకు యావత్ దేశం చూపంతా జంతర్‌మంతర్‌పైనే కేంద్రీకతమై ఉంది. దేశ, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం చర్చకు దారితీసిన ఓ ‘ఘటన’కు జంతర్‌మంతర్ సజీవ సాక్ష్యం నిలిచింది. ఇక్కడ రోజుల తరబడి చేసిన ఆందోళనలే తర్వాతి కాలంలో ‘నిర్భయ చట్టం’రావడానికి కారణమాయ్యయనేది చరిత్ర మరువని సత్యం. -
నిర్భయ కేసు తీర్పుపై న్యాయనిపుణులు
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అమలు కావడానికి కనీసం ఏడాది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో ఎలాగూ ఈ తీర్పును సవాల్ చేస్తారు కాబట్టి అవి తుది నిర్ణయానికి రావడానికి నెలల వ్యవధి పట్టవచ్చు. ఈ కేసుపై ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు త్వరగా విచారణ నిర్వహించినా.. తుది తీర్పు వెలువరించడానికి కనీసం నాలుగు నెలలు పట్టవచ్చని అంచనా. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నాగేంద్ర రాయ్ ఈ విషయమై మాట్లాడుతూ ‘కేసు మళ్లీ మొదటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అధికారికంగా సాక్ష్యాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. దోషులుగా ఉరిశిక్ష విధించవచ్చా లేదా అనే విషయమై స్వతంత్రంగా ఒక నిర్ణయానికి రావాలి. ఈ కేసులో ఉరిని ధ్రువీకరించడానికి అవకాశాలు ఉండవచ్చు. ప్రస్తుతం హైకోర్టు దగ్గర మరణశిక్షల కేసులు భారీ సంఖ్యలో ఏమీ లేవు. ఇలాంటి పిటిషన్లపై అది త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసుపై న్యాయమూర్తులందరికీ అవగాహన ఉంది కాబట్టి నిర్ణయం త్వరగా జరగవచ్చు’ అని ఆయన వివరించారు.