delhi state
-
‘ఢిల్లీ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘ఢిల్లీ’ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఓకే చెప్పడంతో బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లయింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్ గవర్నర్దే అంతిమాధికారం అని చెప్పే ఈ బిల్లు ఆమోదం సందర్భంగా బుధవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ఎస్పీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు వాకవుట్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ) ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్ట్నెంట్ గవర్నరే!. ముందుగా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వాదనలు జరిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లుతో ఢిల్లీలో బలమైన ప్రభుత్వయంత్రాంగం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 1991లో తెచ్చిన చట్టంలోని సందిగ్ధతలు తొలగించేందుకే ఈ బిల్లు తెచ్చామన్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల సారాంశానికి అనుగుణంగానే మార్పులు చేశామని వివరించారు. ప్రజాస్వామ్యానికి దుర్దినం బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినంగా అభివర్ణించారు. అయితే తిరిగి ప్రజా ప్రభుత్వానికి అధికారాలు పునఃసంప్రాప్తించేందుకు తాను చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. ప్రజలకు తిరిగి అధికారం సాధించేవరకు పోరాటం ఆపను. మంచిపనులు ఆగవు, నెమ్మదించవు’ అని ఆయన ట్వీట్ చేశారు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీ టాప్
న్యూఢిల్లీ: అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 17లలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా జాబితా రూపొందించింది. -
ఢిల్లీలో బీజేపీ సర్కారు?
హస్తినలోనూ జెండా ఎగరేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశం లభించేలా ఉంది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పటినుంచి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. అత్యధిక స్థానాలు పొందిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి ఓ నివేదిక పంపారు. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేముందు సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం బీజేపీకి ఇవ్వడం మంచిదని ఆయన పేర్కొన్నారు. అయితే.. బీజేపీని ఆహ్వానించడం రాజ్యాంగవిరుద్ధమని, దీనివల్ల పార్టీలు మారేవాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం చెబుతున్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 29 మంది సభ్యులున్న బీజేపీ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది ఉన్నారు. వాస్తవానికి బీజేపీ తరఫున 31 మంది గెలిచినా, ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ సహా ముగ్గురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. దాంతో ఇప్పుడు సభలో మెజారిటీ కావాలంటే బీజేపీకి మరో ఐదుగురి మద్దతు అవసరం. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా లేదా అని బీజేపీ కూడా మల్లగుల్లాలు పడుతోంది.