delivery mens
-
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్‌తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్‌ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్‌కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
ఇక ‘పిట్ స్టాప్’ ఉచిత మరమ్మతు సేవలు
బెంగళూరు: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది, అగ్నిమాపక, పోలీస్, అంబులెన్స్, వైద్యులు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే వ్యక్తులు ఉపయోగించే వాహనాలు మధ్యలో ఆగిపోతే వారికి ఉచిత మరమ్మతు సేవలందించేందుకు గాను పిట్ స్టాప్ అనే సంస్థ ముందుకొచ్చింది. పిట్ స్టాప్ ఉచిత మరమ్మతు సేవల్ని పొందేందుకు గాను 626262 1234 నంబర్‌కు ఫోన్ గానీ, లేదా www.getpitstop.comను గానీ సంప్రదించవచ్చు. సమాచారం అందుకున్న పిట్ స్టాప్ సిబ్బంది తమ సంచార వాహనంతో వచ్చి సదరు వాహనాన్ని రిపేరు చేసి వెళ్లిపోతుందని సంస్థ ప్రతినిధులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సేవలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, చెన్నై, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ వివరించింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వారందరికీ పిట్ స్టాప్ సంస్థ తరఫున సీఈవో మిహిర్ మోహన్ సెల్యూట్ చేసి అభినందించారు. -
డెలివరీ బాయ్స్ బ్యాగులకే కన్నం వేశాడు
తుర్కయంజాల్: ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేస్తున్న ఓ యువకుడు వస్తువు డెలవరీ చేసేందుకు వస్తున్న ఆయా కంపెనీ ఉద్యోగుల బ్యాగ్‌లతో ఉడాయిస్తున్నాడు. సదరు కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. క్రైం సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, డీఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని తణుకుకు చెందిన సురేష్ (26) వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఇతగాడు మొదట ఆన్లైన్లో తప్పుడు చిరునామాతో వస్తువులు బుక్ చేస్తాడు. ఆర్డర్ చేసిన వస్తువులను ఆయా కంపెనీల ఉద్యోగులు డెలవరీ చేసేందుకు ఇతడు పేర్కొన్న అడ్రస్‌కు వస్తారు. తాను ఇంటి పై అంతస్తులో ఉన్నానని పార్శిల్ తీసుకుని రావాలని ఆ ఉద్యోగికి చెప్తాడు. అతను తన బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్తాడు. కిందే ఉన్న సురేష్ అతలోనే బైక్‌పై ఉన్న బ్యాగ్ ఎత్తుకుపోతాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్‌కాలనీలో నాప్టాల్, షాపింగ్‌జోన్ సంస్థల ఉద్యోగుల బ్యాగ్‌లు ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ బ్యాగ్‌లు కాజేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల 20 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.