Delta Farmers
-
కరువు దుర్భిక్షంలో డెల్టా రైతన్నలు
-
ఆధునికీకరణకు నిధులేవీ?
అమలాపురం :ఈ సీమవాసుల భాగ్యరేఖ నుదుటిపై కాదు.. నీటిబొట్టుపై రాసి ఉంటుంది. దాన్ని తొలుత రాసిన వాడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన సృష్టించిన గోదావరి డెల్టాకు కాలువలు, చానళ్లు, బోదెలు జీవనాడులు. క్షామ పీడిత ప్రాంతంలో సిరులు కురిపించి.. డెల్టావాసుల తలరాతలు మార్చిన భాగ్యరేఖలు. పచ్చని పంటపొలాలు.. పాలవెల్లువలతో డెల్టా రైతుల కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయంటే అందుకు ధవళేశ్వరం ఆనకట్ట, తరువాత కాలంలో బ్యారేజ్ ఎంత కారణమో.. బ్యారేజ్ వద్ద నుంచి నీరు పంట చేలకు అందించే పంట కాలువలు, చానళ్లు, బోదెలు అంతే కారణం. కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ, కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుతున్న ఆ కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోక కుచించుకుపోవడంతో డెల్టా రైతులు అవస్థలు పడుతున్నారు. నష్టాల పాలవుతున్నారు. పూర్తయినవి అతి తక్కువ పనులే.. గోదావరి డెల్టా పంటకాలువలు, మురుగునీటి కాలువలు పూడుకుపోయి, నానాటికీ చిక్కి శల్యమవుతున్నాయి. దశాబ్దాలుగా కనీస మరమ్మతులకు నోచుకోని ఈ కాలువల ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు పూర్తయి ఉంటే డెల్టా పూర్వవైభవం సంతరించుకునేది. అయితే టెండర్లు ఖరారు కాకపోవడం, ఖరారైన చోట పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్లు దోపిడీ కోసం కేవలం మట్టిపనులు మాత్రమే చేయడం, అందుకు అధికారులు వత్తాసు పలకడం, రైతులు సకాలంలో రబీ పూర్తి చేయకపోవడం, లాంగ్ క్లోజర్‌కు సమయం లేదని చిన్నచిన్న పనులతో సరిపెట్టడం వెరసి డెల్టా ఆధునికీకరణ మరుగున పడిపోయింది. జిల్లాలో రూ.1,670 కోట్లతో 2008లో మొదలైన ఈ పనుల్లో ఇప్పటి వరకు కేవలం రూ.319 కోట్ల పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. వీటిలో పంట కాలువలపై రూ.245 కోట్లు, మురుగునీటి కాలువలపై రూ.74 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. బాబు రాకతో కొండెక్కనున్న ఆధునికీకరణ! దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు తరువాత ముఖ్యమంత్రులుగా ఉన్న కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలలో మందగించాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఆధునికీకరణ పనులు కొండెక్కుతాయని రైతులు అనుమానిస్తున్నారు. ఈ పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, అధికారులు ఖర్చుపెట్టిన తీరు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. గత ఏడాది రూ.75 కోట్లతో పనులు చేయాలని తొలుత నిర్ణయించి, కేవలం రూ.30 కోట్ల పనులు కూడా చేయలేదు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. పశ్చిమ వాటా పోగా మన జిల్లాకు వచ్చేది రూ.15 కోట్లు కావడం గమనార్హం. ఈ కేటాయింపులు చూపి బాబు ఉండగా డెల్టా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం లేదని రైతులు ఒక అంచనాకు వస్తున్నారు. ఆధునికీకరణ పనులకు పెద్దగా కేటాయింపులు చేయని ప్రభుత్వం డెల్టాను ఎడారి చేస్తుందేమోనని రైతులు భయపడుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మొత్తం నిధులు కేటాయించి ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయం విశేషం. ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టం డెల్టాలో పంట, మురుగునీటి కాలువలు పూడుకుపోవడంతో రైతులు ఏటా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. ఖరీఫ్‌లో చేలు మునిగిపోవడం, రబీలో ఎండిపోవడం షరామామూలుగా మారింది. ఈ నష్టం ఏటా రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కనీసం పంటకాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్ల శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. డెరైక్ట్ పైప్‌లు(డీపీలు) పూడుకుపోతున్నా పట్టించుకునేవారు లేక శివారు, మెరక భూములకు నీరు చేరడంలేదు. ప్రస్తుత రబీలో సుమారు 15 వేల ఎకరాల్లో పంటదెబ్బతినే అవకాశం ఉందని అంచనా. నిధులు కేటాయించకపోవడంతో చానల్లు, డ్రైన్లు, పంటకాలువలు, పంటబోదెలను ఉపాధి హామీ పథకంలో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కూలీలు లెవెల్స్ పాటించకుండా ఇష్టానుసారం పనులు చేపట్టడంతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండడంలేదు. -
డెల్టా రైతులను ముంచేందుకే పట్టిసీమ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధ్వజం సాక్షి, హైదరాబాద్: డెల్టా ప్రాంత రైతులను నట్టేట ముంచేందుకే టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీహెచ్ జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్బీ అమ్జాద్ బాషా, అత్తార్ చాంద్‌బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్వేశ్వరరావులతో కలసి జగ్గిరెడ్డి మాట్లాడారు. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 12.5 మీటర్ల ఎత్తులో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కింద మోటార్లు బిగించడం వల్ల గోదావరి జిల్లాల రైతులకు సాగునీరందని పరిస్థితి ఏర్పడుతుందని జగ్గిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, దీనికి తమ పార్టీ కూడా కలసివస్తుందన్నారు. రాయలసీమ మీద ప్రేమ ఉంటే జీవోలో సీమ ప్రస్తావన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కమీషన్ల మోజుతో సింగపూర్, జపాన్ విధానాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు. ఈ పరిస్థితుల్లో శాసనసభలో పట్టిసీమపై చర్చించేందుకు విపక్షానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అమ్జాద్‌బాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించే ప్రయత్నం చేస్తుంటే పాలక పక్షం సభలో, బయట కూడా విపక్షంపై ఎదురు దాడి చేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయింపులు చూస్తే ఉద్యోగుల జీతాలకు సరిపోయే పరిస్థితి, అలాంటిది రాయలసీమను ఆదుకుంటామని పాలకపక్షం చెప్పడంపై ప్రజలు బాధపడుతున్నారన్నారు. చివరికి బ్రాహ్మణి స్టీల్స్‌కు కూడా బడ్జెట్లో కేటాయింపులు చూపలేదన్నారు.రాయలసీమను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేకుండా కాంట్రాక్టర్లకు సొమ్ము చేయడానికే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. దీనివల్ల రూ.4 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ పట్టిసీమపై సుదీర్ఘమైన చర్చ జరిగినప్పడే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో పాలకపక్షం సభ్యులు అసంతృప్తితో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబుకు భయపడి మాట్లాడడం లేదన్నారు. -
ఎత్తిపోస్తే..డెల్టా ఎడారే
కాకినాడ సిటీ :ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా రైతులను నట్టేట ముంచే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఎలుగెత్తారు. ఈ డిమాండ్‌తో సోమవారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్, రైతు కార్యాచరణ సమితి, రైతాంగ సమాఖ్య, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రైతులు ప్రభుత్వం విడుదల చేసిన మోసపూరితమైన జీఓ నంబర్-1ని వెంటనే రద్దు చేయాలని, ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని నినదించారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ గేటు వద్ద రెండు గంటలపాటు ధర్నా చేసి... ‘ఎత్తిపోతలు వద్దు - పోలవరం ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. రైతులు రాస్తారోకోకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం జీవో-1 ప్రతులను దహనం చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు అందజేశారు. ‘పోలవరం’ ఉండగా ఎత్తిపోతలెందుకు? ధర్నానుద్దేశించి నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం ఎత్తిపోతల పథ కం ఎందుకు తలపెట్టినట్టని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల డెల్టాలో మొదటి పంటకే నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తోందన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్థిక లబ్ధి పొందాలన్న దురాలోచనలో పాలకులు ఉన్నారన్నారు. సర్కార్ ఎత్తుగడలను ఎదుర్కొని పోరాడకుంటే గోదావరి డెల్టా భవిష్యత్‌లో ఎడారైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి, కృష్ణా ఆయకట్లకు నష్టమే తప్ప ప్రయోజనం లేదన్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ వద్ద ఏడు గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం అందలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళుతోం దని పోలవరం సాధన సమితి నాయకుడు గోపాలకృష్ణ విమర్శించారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం కల సాకారం అవుతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం అసమంజసమన్నారు. ఆందోళనలో వైఎస్సార్ కాం గ్రెస్ రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ళ వెంకటానంద్, మండపేట వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభి, కిసా న్ సంఘ్ నాయకులు ముత్యాల జమీలు, అడ్డాల గోపాలకృష్ణ, రైతు సంఘ సభ్యుడు వైట్ల విద్యాధర్, జిల్లా కార్యదర్శి చెల్లుబోయిన కేశవశెట్టి, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రైతు సంఘాల నాయకులు జి.జమీ, పిన్నమరాజు పెదబాబు, కడియం తమ్మయ్య, పెమ్మిరెడ్డి సత్యం, కలిదిండి సూరిబాబురాజు, పిన్నమరాజు శ్రీను, పెద్దిరెడ్డి మునీంద్రరావు, సలాది శేషారావు, పశ్చిమగోదావరి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఆర్.పండురాజు, కొమరిపాలెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి సుధాకరరెడ్డి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోస్తే..డెల్టా ఎడారే
కాకినాడ సిటీ :ఉభయ గోదావరి జిల్లాల్లో డెల్టా రైతులను నట్టేట ముంచే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని రైతుల, రైతుసంఘాల ప్రతినిధులు ఎలుగెత్తారు. ఈ డిమాండ్‌తో సోమవారం కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్, నీటి వినియోగదారుల సంఘాలు, రైతులు ప్రభుత్వం విడుదల చేసిన మోసపూరితమైన జీఓ నంబర్-1ని వెంటనే రద్దు చేయాలని, ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని నినదించారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ గేటు వద్ద రెండు గంటల పాటు ధర్నా చేసి... ‘ఎత్తిపోతలు వద్దు - పోలవరం ముద్దు’ అంటూ నినాదాలుచేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకోకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ఎత్తిపోతల నిర్మాణానికి విడుదల చేసిన జీఓ-1 జిరాక్స్ ప్రతులను దహనం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రైతు సంఘాల నాయకులు అందజేశారు. ‘పోలవరం’ ఉండగా ఎత్తిపోతలెందుకు? ధర్నానుద్దేశించి నీటివినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ఎందుకు తలపెట్టినట్టని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల డెల్టాలో మొదటి పంటకే నీరు రాని పరిస్ధితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తోందన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్థిక లబ్ధి పొందాలన్న పాలకుల దురాలోచన అన్నారు. సర్కార్ ఎత్తుగడలను ఎదుర్కొని పోరాడకుంటే గోదావరి డెల్టా భవిష్యత్‌లో ఎడారైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి, కృష్ణా ఆయకట్లకు నష్టమే తప్ప ప్రయోజనం లేదన్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ వద్ద ఏడు గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం అందలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళుతోందని పోలవరం సాధన సమితి నాయకుడు గోపాలకృష్ణ విమర్శించారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం కల సాకారం అవుతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం అసమంజసమన్నారు.ఆందోళనలో వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ళ వెంకటానంద్, మండపేట వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభి, కిసాన్ సంఘ్ నాయకులు ముత్యాల జమీలు, అడ్డాల గోపాలకృష్ణ, రైతు సంఘ సభ్యుడు వైట్ల విద్యాధర్, జిల్లా కార్యదర్శి చెల్లుబోయిన కేశవశెట్టి, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, డీసీసీబీ డెరైక్టర్ గోదశి నాగేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు జి.జమీ, పిన్నమరాజు పెదబాబు, కడియం తమ్మయ్య, పెమ్మిరెడ్డి సత్యం, కలిదిండి సూరిబాబురాజు, పిన్నమరాజు శ్రీను, పెద్దిరెడ్డి మునీంద్రరావు, సలాది శేషారావు, వట్టూరి తాతయ్యకాపు, పశ్చిమగోదావరి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పండురాజు, కొమరిపాలెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి సుధాకరరెడ్డి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు, మట్టా బాబు తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ ‘ఎత్తిపోతలు’ డెల్టా రైతుకు శాపం!
ఉభయ గోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలకు మట్టికొట్టేలా సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల చరిత్ర లోనే లేనివిధంగా రూ. 1,200 కోట్ల విలువైన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బదలాయించడం అన్యాయం. ఈ పథకం రద్దుకు కదులుతున్న గోదావరి జిల్లాల రైతాంగానికి జేజేలు!! రాష్ట్రంలో సేద్యపు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మరో వివాదానికి తెరలేపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎగువ ప్రాంతాలను సస్యశ్యామ లం చేసేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలకు పెద్ద చరిత్రే ఉంది. కాటన్ దొర వందేళ్లకు మునుపే కృష్ణానదిలోకి గోదావరి జలాల మళ్లింపు ప్రతిపా దించారు. గోదావరి జలాల పూర్తి వినియోగానికి చర్యల ఆవశ్యకతను ఖోస్లా కమిటీ, కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్, గుల్హాతి కమీషన్ మూడూ సిఫార్సు చేసినా ప్రయోజనం శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరు గని రీతిలో పోలవరం ప్రాజెక్టును, కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మె ట్ట ప్రాంతాలకు కూడా సేద్యపు నీటి వసతి కల్పిం చడం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఒక యుద్ధం లాంటి పోరాటాన్నే చేశారు. పోల వరం డిజైన్ మార్పు చేయడానికి సోనియాతో భేటీ లో కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించినా వైఎస్ రాజీ పడలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు అనుమ తుల కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా పోలవరా నికి గుర్తింపు వచ్చాక కేంద్రం నుండి నిధులు రాబట్టుకొని పూర్తి చేయడానికి బదులు, నేడు పట్టి సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు తెరపైకి తెస్తున్నా రు. అలా పోలవరం ప్రాజెక్టు ఫలితాలను గోదావరి జిల్లాల ప్రజలకు దక్కకుండా చేయడమో, మరింత ఆలస్యంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగే పరిస్థితులు కల్పించడమో జరుగబోతుంది. దీనిపై ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం, రైతు సంఘా లు రేకెత్తుతున్న అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత బాబుపై ఉన్నది. నేడు సమాధానం చెప్పాల్సిన సందేహాలు ఇవి. 1. పట్టిసీమ దగ్గర గోదావరి నదిపై 8500 క్యూసెక్కులతో లిప్టు పెట్టి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి (పులిచింతల దిగువన) పంపి స్తారు. 2. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్ర బాబు చెబుతున్నారు. అటువంటప్పుడు ఈ లిప్టు ఎందుకు పెడుతున్నట్లు? 3. ఈ లిప్టు గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రమే గోదావరికి వరద వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నీరు తోడితే ఎక్కడ నిల్వ చేస్తారు. 4. వచ్చే ఖరీప్‌కు లిప్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశిస్తే కనీసం రెండే ళ్లు పడుతుందని అధికారులు నివేదించారు. అలాం టప్పుడు ఈ లిప్ట్‌కి అయ్యే ఖర్చు రూ. 1200 కోట్ల ను పోలవరానికి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేసి కుడి కాలువ ద్వారా కృష్ణానదికి నీటిని పంపవచ్చు. 5. 2014 జూన్, జూలై నెలలో ధవళేశ్వరం వద్ద 8000 క్యూసెక్కులు మించి నీరు రాలేదు. అటువంటి సమయాలలో ఈ లిప్టు ద్వారా నీటిని తోడితే ఉభ య గోదావరి జిల్లాలో డెల్టా సంగతి ఏమిటి? 6. లిప్టు వచ్చిన తరువాత వరద సమయంలోనే లిప్టు చేస్తారన్న గ్యారంటీ లేదు. 7. లిప్టుకి 30 స్పెషల్ పంపులు కావాలి. వీటి ఆర్డరుకి, తయారీకి, తదిత ర నిర్మాణాలకు చాలా కాలం పడుతుంది. ఎగువన రాయలసీమ రైతుల ప్రయోజనాలు తీర్చడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతు న్నట్లు ఒక వాదన చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నిజానికి చంద్రబాబుకు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన రూ.4,500 కోట్లు వెచ్చిస్తే హంద్రీనీవా స్టేజ్ 1-2 పనులు పూర్తవుతా యి. కానీ బాబు నేడు తన బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు మాత్రమే వెచ్చించారు. గాలేరు నగరి, తెలుగు గంగకు ప్రాజెక్టులను పట్టించుకో కుండా పట్టిసీమ ప్రాజెక్టుతో సీమ జిల్లాలకు సేద్య పు నీటి తాగునీటి వసతి కల్పిస్తానని చెప్పడం దగా. నేడు ఉభయ గోదావరి జిల్లాల రైతాంగ ప్రయోజనాలకు మట్టికొట్టే విధంగా చంద్రబాబు ఏకపక్షంగా సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో లేని రీతి లో 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు చేపట్టిన కాంట్రాక్టర్లకు బదలాయించడం అన్యాయం. అక్రమం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కోసం అన్ని రకాలైన ప్రాజెక్టు ప్రతిపాదనలు అధికా రులు పూర్తి చేస్తే దాన్ని పక్కనబెట్టి, నామినేషన్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును అనుబంధ ప్రాజెక్టుగా పోలవరం కాంట్రాక్టర్లకు ఎందుకు బదలాయిస్తు న్నారు? చంద్రబాబులో ఏమాత్రం నిజాయితీ, పారదర్శకత ఉందని నిరూపించుకోవాలంటే కృష్ణా గోదావరి డెల్టాలో రైతు సంఘాల నేతలతో భేటీ ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయాలి. చంద్ర బాబు అబద్ధాల పునాదులకు వ్యతిరేకంగా గోదావ రి, కృష్ణా డెల్టా రైతులు ఉద్యమించి వస్తున్నారు. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన సమ యం ఆసన్నమైంది. ఈ సందర్భంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం రద్దును కోరుతూ పోరాడుతున్న గోదావరి జిల్లాల రైతాంగానికి జేజేలు!! - ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) మొబైల్ : 99899 04389 -
ఆయకట్టంతటికీ అనుమతి
ఖరీఫ్‌లో దిగుబడులు రాక, రబీ ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్న డెల్టా రైతులకు శుభవార్త. రబీలో జిల్లాలోని మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని ఐఏబీ తీర్మానించింది. అయితే మార్చి 31 నాటికి సాగు పూర్తి కావాలని నిర్ణయించింది. నీటి లభ్యతను బట్టి ఆయకట్టు కుదింపు అనివార్యమన్న అధికారుల మాటను ప్రజాప్రతినిధులు తిరస్కరించారు. కాకినాడ/ అమలాపురం :సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన శుక్రవారం జరిగింది. శాసనమండలిలో విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు హరిబాబు, ఎస్ఈ సుగుణాకరరావు, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఎస్ఈ సుగుణాకరరావు గోదావరిలో నీటి లభ్యతను వివరించారు. రబీకి సుమారు 83 టీఎంసీలు (ఒక టీఎంసీ 10,830 ఎకరాలు) అవసరం కాగా, కేవలం 67 టీఎంసీలే అందుబాటులో ఉంటుందన్నారు. కేవలం 80 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరిస్తామని, దీని వల్ల జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టాల్లో 87,313 ఎకరాల్లో సాగు ఉండదని చెప్పారు. జోన్లవారీగా ఆయకట్టును ఎంపిక (శుక్రవారం సంచికలో ‘30 శాతం మూనకు దూరం!’ శీర్షికన వచ్చిన కథనంలో అధికారుల యోచన ఇదేనని ‘సాక్షి’ పేర్కొంది) చేస్తామన్నారు. అయితే అభ్యంతరం తెలిపిన ప్రజాప్రతినిధులు మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. 16 టీఎంసీల లోటు భర్తీకి అవసరమైన చర్యల్ని వివరిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులమంజూరుకు కృషి చేస్తామన్నారు. పాత లెక్కలు మానండి : వరుపుల, చిర్ల పాతకాలం నాటి లెక్కలు మాని కొత్త లెక్కలు వేస్తే మొత్తం ఆయకట్టుకు నీరివ్వొచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ప్రత్తిపాడు, కొత్తపేట ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా రైతులు ఖరీఫ్‌లో నష్టపోయినందున గోదావరి డెల్టా, ఏలేరు, -
కావేరి పరవళ్లు
►సెకనుకు 50 వేల ఘనపుటడుగుల నీటి రాక ►తీర గ్రామాల్లో అలర్ట్ ►పెరుగుతున్న మెట్టూరు నీటి మట్టం ►అన్నదాతల్లో ఆనందం కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు డెల్టా అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నారుు. కావేరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో రాష్ట్రంలోకి నీటి రాక పెరిగింది. మెట్టూరు డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ తీర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సాక్షి, చెన్నై: వర్షాభావ పరిస్థితులు, కావేరి నదీ జల వివాదం వెరసి గత ఏడాది డెల్టా అన్న దాతలను ఆందోళనకు గురిచేసింది. ఎట్టకేలకు కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాలు చివరి క్షణంలో అన్నదాతలను ఆదుకోవడం కొంత మేరకు ఊరటనిచ్చింది. ఈ ఏడాది సైతం వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన రెట్టింపు అయింది. కావేరి నీరు రాకపోవడం, వివాదం ముదరడంతో కురువై సాగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఆశించిన మేరకు ఈ ఏడాది డెల్టా అన్నదాతలు సాగుకు ముందుకు రాలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో నైరుతి ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది డెల్టా అన్నదాతలకు వరంగా మారింది. అక్కడి వర్షాలతో కృష్ణ రాజ సాగర్, కబిని డ్యాంలలోకి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ డ్యాంల నుంచి ఉబరి నీటిని బయటకు వదులుతున్నారు. కావేరి ఉగ్ర రూపం: కృష్ణరాజ సాగర్, కబిని డ్యాంల ఉబరి నీటికి తోడుగా కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలతో, చిన్న చిన్న చెరువులు, కాలువల నుంచి వస్తున్న నీటితో ఆ నది నాలుగైదు రోజులుగా పరవళ్లు తొక్కుతోంది. హొగ్నెకల్ జలపాతంలో నీటి ఉధృతి మరింత పెరగడంతో సందర్శకులను అనుమతించడం లేదు. అలాగే, తెప్ప పడవల్లో విహారాన్ని నిషేధించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం కావేరి మరింత ఉగ్రరూపం దాల్చింది. క బిని పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి వేశారు. ఉబరి నీరు పూర్తిగా బయటకు పంపుతుండటంతో కృష్ణరాజ సాగర్‌లో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరువవుతుండడంతో నీటి విడుదల శాతాన్ని పెంచారు. దీంతో ఈ రెండు డ్యాంల నుంచి తమిళనాడు వైపుగా సెకనుకు 70 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ నీరు సాయంత్రానికి రెండు రాష్ట్రాల సరిహద్దులోని పులిగుండుల వద్దకు చేరింది. అయితే, సెకనుకు 50 వేల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు మేల్కొన్నారు. రాత్రికి ఆ నదిలో సెకనుకు 60 వేల ఘనపుటడుగుల మేరకు నీళ్లు ప్రవహించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. హొగ్నెకల్‌లో వరద పోటెత్తుతుండడంతో సినీ ఫాల్స్, పెరియ ఫాల్స్, జవర్ ఫాల్స్, మెయిన్ ఫాల్స్ల్లో జలధార పోటెత్తుతోంది. ఇక, ఈ ఉధృతితో మెట్టూరు డ్యాంకు నీటి రాక పెరిగింది. వారం రోజుల్లో నీటి మట్టం పది అడుగులు పెరగ్గా, మంగళవారం రాత్రి నుంచి ఒకే రోజులో మూడు అడుగులు అదనంగా పెరిగింది. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 61 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సెకనుకు 20 వేలకు పైగా ఘనపుటడుగుల నీళ్లు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. అప్రమత్తం: కావేరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి ఉధృతి మరి కొన్నాళ్లు కొనసాగాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. ఇదే రకంగా నీటి ఉధృతి మరో వారం పది రోజులు కొనసాగిన పక్షంలో మెట్టూరు నీటి మట్టం ఆశించిన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మెట్టూరు డ్యాంకు మరింతగా నీళ్లు వచ్చిచేరిన పక్షంలో సాగుబడికి నీళ్లు చివరి క్షణంలో అందుతాయన్న అన్న ఆశాభావంతో అన్నదాతలున్నారు. ఇక, కావేరి ఉధృతి మరింత పెరగనుండడంతో ఆ తీర గ్రామాల్లోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. కావేరి నదిలోకి వెళ్లొద్దని, కావేరి నది వైపుగా గ్రామాల్లోకి వెళ్లే మార్గాల్లో జాగ్రత్తగా వెళ్లాలని దండోరా వేయించే పనిలో పడ్డారు. నీటి ఉధృతి మరింతగా పెరిగిన పక్షంలో ఈ తీరంలోని మొదలి పన్నై, కోట మలై, రాణి పేట, కామరాజనగర్, మరపునం గ్రామాల ప్రజలకు ముప్పు తప్పదు. దీంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కురవని మబ్బు.. కదలని కర్రు
- గణనీయంగా తగ్గిన వర్షపాతం - అన్నదాత ఆశలకు అశనిపాతం - వర్షాభావం కొనసాగితే ఆరుతడి పంటలే శరణ్యం అమలాపురం : ‘వాన రాకడ.. ప్రాణం పోకడ’ తెలియదన్నది నానుడి. వానలు రావలసిన సమయంలో రాకపోగా వడగాడ్పులు చెలరేగడంతో జిల్లాలో అనేక ప్రాణాలు పోయాయి. అన్నదాతలసాగు ఆశలూ.. నడివేసవిలో నీటిచెలమల్లా నానాటికీ ఆవిరవుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టే.. నైరుతి రుతుపవనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు. సాధారణంగా జిల్లాలో జూన్ రెండో వారంలోనే రుతుపవనాలు ప్రవేశించి ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతుంటాయి. అయితే ఇప్పటి వరకూ వాతావరణ మార్పుల వల్ల అడపాదడపా వర్షాలు కురిసినా తొలకరి వర్షం మాత్రం పడలేదు. జిల్లాలో సాధారణంగా జూన్‌లో తొలి 19 రోజులకూ సగటు వర్షపాతం 80.4 మిల్లీ మీటర్లు. ఈ ఏడాది అది కేవలం 13 మిల్లీ మీటర్లు మాత్రమే కావడం వర్షాభావ తీవ్రతకు నిదర్శనం. గత ఏడాది ఇదే సమయానికి 56.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత ఊహించని విధంగా భారీ వర్షాలు కురవడంతో మెట్ట, డెల్టా రైతులు వేల ఎకరాల్లో పంటను కోల్పోవాల్సి వచ్చింది. అసాధారణంగా జూలైలోనే గోదావరికి వరద వచ్చింది. గోదావరికి నాలుగుసార్లు వరదలు రాగా ఆ ఉధృతి నెలరోజులకు కొనసాగింది. దీని వల్ల కూడా రైతులు పంట నష్టాలను చవిచూశారు. డెల్టాలోనూ అరకొరగానే నారుమడులు మెట్ట, ఏజెన్సీలలోనే కాదు.. డెల్టాలో కూడా వర్షం వస్తే కానీ నాగలి కర్రు చురుకుగా కదిలేలా లేదు. ప్రధానంగా వర్షాధార పంటలు సాగు చేసే మెట్ట, ఏజెన్సీలలో ఈ ఏడాది వరిసాగు తగ్గిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ వర్షం కురిసి మెట్ట, ఏజెన్సీలలోని చెరువులు, ప్రాజెక్టులు నిండినా పూర్తిస్థాయిలో నీరందడం లేదు. చెరువులు, ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న కాలువల వ్యవస్థ అధ్వానంగా మారడమే ఇందుకు కారణం. అలాంటిది వర్షాభావం కొనసాగితే సాగు వదులుకోవాల్సిందేనని ఏజెన్సీ, మెట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు తొలి దఫా దుక్కులు చేసి వర్షం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. డెల్టాలో కాలువలకు నీరు వదిలినా ఎండలకు జడిసి రైతులు నారుమడులు వేయడం లేదు. గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడడంతో కొందరు నారుమడులు వేసినా..భారీ వర్షాలు కురిసి వాతావరణం పూర్తి అనుకూలంగా మారాకే వేయాలని ఎక్కువమంది భావిస్తున్నారు. పొంచి ఉన్న కరువు పరిస్థితి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకుంటే ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలు కరువుబారిన పడే ప్రమాదముంది. 2011-12లో వర్షాలు తక్కువగా పడడం వల్ల కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో జిల్లాలో సుమారు 13 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు. ఈ ఏడాది కూడా ఈ పరిస్థితి తప్పదనే ఆందోళన రైతులలోనే కాక అధికారయంత్రాంగంలోనూ ఉంది. వర్షాభావం కొనసాగితే వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాల్సి ఉంది. -
నిండా ముంచిన ‘స్వర్ణ’
* నీటి ముంపుతో కుదేలైన వరి రకం * వరుస తుపాన్లతో డెల్టా రైతుకు తీవ్ర నష్టం * డెల్టాకు నీటి విడుదల జాప్యంతోనూ దెబ్బ * ముంపు తట్టుకునే రకాల ఆవశ్యకత సాక్షి, హైదరాబాద్: సమయానికి విడుదల కాని కాల్వ నీరు... మరోవైపు అనువుగాని ‘స్వర్ణ’రకం వరి సాగు కారణాల వల్లే డెల్టా రైతు నిండా మునిగాడు. ‘స్వర్ణ’లాంటి అననుకూల రకాలను సాగు చేయడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగితే, కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో ఆలస్యం కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టం కలిగింది. గోదావరి జిల్లాల్లో కూడా కాల్వల ఆధునీకరణ పనులు, మరమ్మతులు లాంటి కారణాలతో కాస్త ఆలస్యంగా నీరు అందిన గ్రామాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. తుపాను సమయానికి కోతలు పూర్తికాని ‘స్వర్ణ’ వరి పూర్తిగా దెబ్బతింది. ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 వరి రకాల్లో నష్టం తక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో పర్యటించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం పరిశీలనలో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జూన్ 13న నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, కాళ్ల, ఉండి, భీమవరం తదితర మండలాల పరిధిలోని కాల్వల ఆధునీకరణ పనుల కారణంగా ఈ ప్రాంతాల్లో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. ఇలా ఆలస్యమైన చోట సాగైన ‘స్వర్ణ’ రకం వరి వరుస తుపాన్లకు పూర్తిగా దెబ్బతింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కాల్వలకు నీళ్లు వచ్చే సమయానికే బోర్ల కింద నారుమళ్లు సాగు చేసుకుని జూన్ చివరి వారంలోపు నాట్లు వేశారు. ఈ పంటంతా తుపాన్ల నుంచి బయట పడింది. నాట్లు ఇంకొంత ఆలస్యమైన చోట తుపాను సమయానికి కోతలు పూర్తయ్యి కుప్పలు పడ్డాయి. ఇక్కడా నష్టం స్వల్పంగానే ఉంటుంది. నాటు ఇంకా ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రధానంగా ‘స్వర్ణ’రకం తుడిచిపెట్టుకు పోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా కింద దాదాపు 32 వేల ఎకరాల్లో వరి సాగు ఉంది. ఇక్కడ అక్టోబర్ మూడో వారంలో కానీ నాట్లు పడలేదు. తుపాను దెబ్బకు ఈ సాగు అంతా దెబ్బతింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 70 శాతం విస్తీర్ణంలో ‘స్వర్ణ’ రకం వరే సాగు చేశారు. తుపాను సమయానికి కోతలు పూర్తికాని అన్ని చోట్లా ఆ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో 70 శాతం అంటే దాదాపు 8 లక్షల ఎకరాల్లో ‘స్వర్ణ’ రకమే సాగయ్యింది. దీనికి తుపానులతో త్వరగా పైరు పడిపోయే స్వభావం ఉంటుంది. రెండు మూడు రోజుల ముంపుకే గింజ మొలకెత్తుతుంది. కృష్ణా నీటి విడుదలలోనూ జాప్యమే ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి చివరి ప్రాంతానికి ముందు నీటిని వదలి, అక్కడ నుంచి పై ప్రాతాలకు నీటిని విడుదల చేస్తూ వస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ విధానం తలకిందులుగా అమలయ్యింది. జూలై 22న జూరాల నుంచి నీరు విడుదల చేశారు. జూలై 28న పోతిరెడ్డిపాడుకు నీరు విడుదలైంది. ఆగస్టు 2న సాగర్ కాల్వకు, 6న సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా నీటి విడుదలలో జరిగిన జాప్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. తుపాను తీవ్రత తక్కువ ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బ తింది. ‘హెలెన్’తో పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ పేర్కొన్న వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఇందులో 83 వేల ఎకరాల్లో తుపాను సమయానికే పంట రైతుల ఇళ్లకు చేరిపోయింది. పనలపై 91 వేల ఎకరాల్లో, కుప్పలేసిన వరి 94 వేల ఎకరాల్లో నీటి ముంపులో ఉంది. తుపాను ధాటికి 2.93 లక్షల ఎకరాల్లో వరి పడిపోయింది. కుప్పలేసిన వరిలో నష్టం పెద్దగా ఉండదు. పనలపైన, పడిపోయిన వరిలోనే నష్టం అధికంగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనలపైన కానీ, కుప్పలేసిన వరి కానీ ఒక్క ఎకరా కూడా లేదు. గింజ గట్టిపడే దశలో ఉన్న దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి చేతికందకుండా పోయింది. ఇక్కడ ప్రధానంగా బీపీటీ 5204 రకం తుపానుకు ఎక్కువ దెబ్బతింది. మార్టేరు వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యనారాయణ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కీటక శాస్త్ర శాఖాధిపతి డాక్టర్ రమేష్ బాబు, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త పి.నారాయణ రెడ్డి, సీడ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ కేశవుల బృందం ఇటీవల తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించింది. ‘స్వర్ణ’ వద్దు... ఎంటీయూ 1121 మేలు ‘‘నీటి విడుదలలో అనిశ్చితి, ఎప్పుడు తుపాన్లు వస్తాయో చెప్పలేని పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి డెల్టాల్లో ‘స్వర్ణ’, బీపీటీ-5204 లాంటి రకాల సాగు మంచిది కాదు. నమ్మకమైన దిగుబడి, గింజ నాణ్యత ఉండటం తదితర లక్షణాలు ఉన్నా, తుపాన్లకు ఇవి తట్టుకోలేవు. మూడు, నాలుగు రోజులు నీటి ముంపులో ఉంటే గింజ మొలకెత్తుతుంది. డెల్టాలో ఈ రకాలు సాగు చేయడం అంటే ‘గాలిలో దీపం పెట్టినట్లే’. ఎంటీయూ 1121 అనే కొత్త వంగడం ఈ ప్రాంతంలో సాగుకు అన్నివిధాలా సరిపోతుంది. 125 రోజుల్లో కోతకొస్తుంది. అగ్గితెగులును తట్టుకుంటుంది. అన్నిటికీ మించి రెండు వారాలపాటు నీటిలో ఉన్నా గింజ మొలకెత్తదు.’’ - పీవీ సత్యనారాయణ, మార్టేరు వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త