
పట్టిసీమ ‘ఎత్తిపోతలు’ డెల్టా రైతుకు శాపం!
ఉభయ గోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలకు మట్టికొట్టేలా సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల చరిత్ర లోనే లేనివిధంగా రూ. 1,200 కోట్ల విలువైన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బదలాయించడం అన్యాయం. ఈ పథకం రద్దుకు కదులుతున్న గోదావరి జిల్లాల రైతాంగానికి జేజేలు!!
రాష్ట్రంలో సేద్యపు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మరో వివాదానికి తెరలేపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎగువ ప్రాంతాలను సస్యశ్యామ లం చేసేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలకు పెద్ద చరిత్రే ఉంది. కాటన్ దొర వందేళ్లకు మునుపే కృష్ణానదిలోకి గోదావరి జలాల మళ్లింపు ప్రతిపా దించారు. గోదావరి జలాల పూర్తి వినియోగానికి చర్యల ఆవశ్యకతను ఖోస్లా కమిటీ, కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్, గుల్హాతి కమీషన్ మూడూ సిఫార్సు చేసినా ప్రయోజనం శూన్యం.
ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరు గని రీతిలో పోలవరం ప్రాజెక్టును, కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మె ట్ట ప్రాంతాలకు కూడా సేద్యపు నీటి వసతి కల్పిం చడం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఒక యుద్ధం లాంటి పోరాటాన్నే చేశారు. పోల వరం డిజైన్ మార్పు చేయడానికి సోనియాతో భేటీ లో కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించినా వైఎస్ రాజీ పడలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు అనుమ తుల కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా పోలవరా నికి గుర్తింపు వచ్చాక కేంద్రం నుండి నిధులు రాబట్టుకొని పూర్తి చేయడానికి బదులు, నేడు పట్టి సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు తెరపైకి తెస్తున్నా రు. అలా పోలవరం ప్రాజెక్టు ఫలితాలను గోదావరి జిల్లాల ప్రజలకు దక్కకుండా చేయడమో, మరింత ఆలస్యంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగే పరిస్థితులు కల్పించడమో జరుగబోతుంది. దీనిపై ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం, రైతు సంఘా లు రేకెత్తుతున్న అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత బాబుపై ఉన్నది.
నేడు సమాధానం చెప్పాల్సిన సందేహాలు ఇవి. 1. పట్టిసీమ దగ్గర గోదావరి నదిపై 8500 క్యూసెక్కులతో లిప్టు పెట్టి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి (పులిచింతల దిగువన) పంపి స్తారు. 2. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్ర బాబు చెబుతున్నారు. అటువంటప్పుడు ఈ లిప్టు ఎందుకు పెడుతున్నట్లు? 3. ఈ లిప్టు గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రమే గోదావరికి వరద వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నీరు తోడితే ఎక్కడ నిల్వ చేస్తారు. 4. వచ్చే ఖరీప్‌కు లిప్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశిస్తే కనీసం రెండే ళ్లు పడుతుందని అధికారులు నివేదించారు. అలాం టప్పుడు ఈ లిప్ట్‌కి అయ్యే ఖర్చు రూ. 1200 కోట్ల ను పోలవరానికి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేసి కుడి కాలువ ద్వారా కృష్ణానదికి నీటిని పంపవచ్చు. 5. 2014 జూన్, జూలై నెలలో ధవళేశ్వరం వద్ద 8000 క్యూసెక్కులు మించి నీరు రాలేదు. అటువంటి సమయాలలో ఈ లిప్టు ద్వారా నీటిని తోడితే ఉభ య గోదావరి జిల్లాలో డెల్టా సంగతి ఏమిటి? 6. లిప్టు వచ్చిన తరువాత వరద సమయంలోనే లిప్టు చేస్తారన్న గ్యారంటీ లేదు.
7. లిప్టుకి 30 స్పెషల్ పంపులు కావాలి. వీటి ఆర్డరుకి, తయారీకి, తదిత ర నిర్మాణాలకు చాలా కాలం పడుతుంది. ఎగువన రాయలసీమ రైతుల ప్రయోజనాలు తీర్చడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతు న్నట్లు ఒక వాదన చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నిజానికి చంద్రబాబుకు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన రూ.4,500 కోట్లు వెచ్చిస్తే హంద్రీనీవా స్టేజ్ 1-2 పనులు పూర్తవుతా యి. కానీ బాబు నేడు తన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు మాత్రమే వెచ్చించారు. గాలేరు నగరి, తెలుగు గంగకు ప్రాజెక్టులను పట్టించుకో కుండా పట్టిసీమ ప్రాజెక్టుతో సీమ జిల్లాలకు సేద్య పు నీటి తాగునీటి వసతి కల్పిస్తానని చెప్పడం దగా.
నేడు ఉభయ గోదావరి జిల్లాల రైతాంగ ప్రయోజనాలకు మట్టికొట్టే విధంగా చంద్రబాబు ఏకపక్షంగా సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో లేని రీతి లో 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు చేపట్టిన కాంట్రాక్టర్లకు బదలాయించడం అన్యాయం. అక్రమం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కోసం అన్ని రకాలైన ప్రాజెక్టు ప్రతిపాదనలు అధికా రులు పూర్తి చేస్తే దాన్ని పక్కనబెట్టి, నామినేషన్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును అనుబంధ ప్రాజెక్టుగా పోలవరం కాంట్రాక్టర్లకు ఎందుకు బదలాయిస్తు న్నారు? చంద్రబాబులో ఏమాత్రం నిజాయితీ, పారదర్శకత ఉందని నిరూపించుకోవాలంటే కృష్ణా గోదావరి డెల్టాలో రైతు సంఘాల నేతలతో భేటీ ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేయాలి. చంద్ర బాబు అబద్ధాల పునాదులకు వ్యతిరేకంగా గోదావ రి, కృష్ణా డెల్టా రైతులు ఉద్యమించి వస్తున్నారు. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన సమ యం ఆసన్నమైంది. ఈ సందర్భంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం రద్దును కోరుతూ పోరాడుతున్న గోదావరి జిల్లాల రైతాంగానికి జేజేలు!!
- ఇమామ్
(వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు)
మొబైల్ : 99899 04389