demolisation
-
సఫిల్‌గూడ చెరువులో మిగిలింది ఇదే
-
మా టార్గెట్ నాగార్జున, బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ నేతలైనా వదలం
-
40 అంతస్థుల ట్విన్ టవర్స్.. రెండు వారాల్లో కూల్చేయాల్సిందే?
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నోయిండా జంట భవనాల కేసులో నిర్మాణ కంపెనీకి సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. రెండు వారాల్లో 40 అంతస్థుల జంట భవనాల కూల్చివేత పనులు ప్రారంభించాలంటూ నోయిడా అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టును తప్పుదారి పట్టించినందుకు నిర్మాణ కంపెనీ డైరెక్టర్లను జైలుకి పంపించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. ఇదీ వివాదం దేశ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే నోయిడాలో గ్రీన్ జోన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి సూపర్ టెక్ అనే సంస్థ 40 అంతస్థులతో రెండు జంట భవనాలు నిర్మించింది. ఇందులో మొత్తం 915 అపార్ట్మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాక అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. గ్రీన్ జోన్ పరిధిలో నిర్మించినందుకు ఈ రెండు భవనాలు కూల్చేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పు తప్పే అలహాబాద్ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది నిర్మాణ కంపెనీ. కేసు వివరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు 2021 ఆగస్టులో అలహాబాద్ కోర్టు తీర్పును సమర్థిస్తూ మూడు నెలల్లోగా జంట భవనాలు కూల్యేయాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దీంతో నిర్మాణ కంపెనీ తప్పు జరిగిందని ఒప్పుకుంటూ ఎంతో ఖర్చు చేసినందున కేవలం ఒక్క భవనం కూల్చేసి.. మరో భవనం ఉంచేయాలంటూ కోర్టుకి విన్నవించింది. గడువు పూర్తైనా జంట భవనాల కూల్చివేతకు సంబంధించిన కోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తైన ఎటువంటి కదలిక లేకపోవడంతో 2022 జనవరి 12న మరోసారి సుప్రీం ఈ కేసుపై దృష్టి సారించింది. పలుమార్లు ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం 2022 ఫిబ్రవరి 7 మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో జంట భవనాల కూల్చివేతకు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు కార్యాచరణ ప్రారంభించాలని నోయిడా సీఈవోకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోగా కూల్చివేత పనులు మొదలు కావాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికైనా కోర్టు తీర్పు అమలుకు సహకరించాలని లేదంటే వడ్డీతో సహా ఇక ఈ భవనంలో అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్న 633 మందికి 12 శాతం వడ్డీతో సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులకు రూ. 2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్ -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్‌లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్‌కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్‌ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్‌గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్‌కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
ఇది కంగనాకు అనవసర ప్రచారం: పవార్
ముంబై: ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేత చర్య ఆమెకు అనవసరమైన ప్రచారాన్ని ఇచ్చిందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా కవరేజీపై తనకు అభ్యంతరం ఉందన్నారు. అనవసరమైన విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపించిందని, ఇలాంటి వాటిని విస్మరించాలని ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో పేర్కొన్నారు. బృహన్ ముంబై మున్నిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిబంధనల ప్రకారమే నటి భవనాన్ని కూల్చివేసిందన్నారు. అయితే ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశంగా వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక ముంబైలో అక్రమ కట్టడాలు కొత్త విషయం కాదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నటి కార్యాలయం కూల్చివేత పలు సందేహలకు దారి తీసిందని పవార్ పేర్కొన్నారు. (చదవండి: కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ) అయితే కంగనాకు, శివసేనకు మధ్య జరుగుతున్న మాటల యుధ్దంలో భాగంగా ఆమె భవనం కూల్చివేసినట్లుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. అంతేగాక దీనిపై బీఎంసీ కంగనాకు తగినంత సమయం ఇచ్చిందా లేదనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కంగనా ముంబైలో నెలల తరబడి ఉంటుందని, ఇంతకు ముందు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలను ప్రతిఒక్కరిలో వెలువడుత్నన్నాయి. దీంతో శివసేనకు కంగనా మధ్య నెలకొన్న వివాదంలో భాగంగానే ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం బాద్రాలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇది అక్రమ నిర్మాణంలో భాగమని అందువల్లే కూల్చివేస్తున్నట్లు బీఎంసీ వెల్లడించింది. దీనిపై ఆమె ముంబై హైకోర్టుకు వెళ్లగా, కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. (చదవండి: ముంబైలో అడుగుపెట్టిన కంగనా) -
కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
ముంబై: బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. Babur and his army 🙂#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 దీనిపై బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. मणिकर्णिका फ़िल्म्ज़ में पहली फ़िल्म अयोध्या की घोषणा हुई, यह मेरे लिए एक इमारत नहीं राम मंदिर ही है, आज वहाँ बाबर आया है, आज इतिहास फिर खुद को दोहराएगा राम मंदिर फिर टूटेगा मगर याद रख बाबर यह मंदिर फिर बनेगा यह मंदिर फिर बनेगा, जय श्री राम , जय श्री राम , जय श्री राम 🙏 pic.twitter.com/KvY9T0Nkvi — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
సచివాలయ కూల్చివేతపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే కొనసాగుతూనే ఉంది. సచివాలయం కూల్చివేత అంశంలో అడిషనల్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు పిటిషనర్‌ను కోరింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భవనాల కూల్చివేతకు రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని పలు తీర్పులు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ రిప్లై దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం-2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రిజర్వ్‌మెంట్స్ తీసుకోవాలని పిటిషనర్ తెలుపగా, లీగల్ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పిటిషనర్‌ను కోరింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. (15 వరకు సచివాలయ కూల్చివేత ఆపండి: హైకోర్టు) భవనాల కూల్చివేతకు కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొనగా, ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని ఈ సందర్భంగా ఏజీ పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని, నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ, స్థానిక అధికారులు, పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. కాగా సోలిసిటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. (యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?) -
’కుంభకోణాలు చేసినవాళ్లూ క్యూ లైన్లో నిలబడ్డారు’
పణజి: సంచలన రీతిలో రూ.500, రూ.1000 నోట్లను రద్దచేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బలంగా సమర్థించుకున్నారు. ఆదివారం పణజి(గోవా)లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి దాదాపు గంటసేపు ప్రసంగించారు. నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెలు బద్దలయ్యాయని, అక్రమార్కులు ఎట్టిపరిస్థితుల్లోనూ తనను వదిలిపెట్టరని ప్రధాని మోదీ అన్నారు. అయితే దేశం కోసం కుటుంబాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన తనకు ప్రాణాలు లెక్కకాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ నల్లధనాన్ని రూపుమాపి తీరతానని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘2జీ స్కాం.. బొగ్గు కుంభకోణం.. ఇంకా ఎన్నో అక్రమాలకు పాల్పడిన గత పాలకులకు మోదీ నిర్ణయం రుచించట్లేదు. అలాంటి వాళ్లు కూడా ఇవ్వాళ నగదు కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఢిల్లీలో ఉండే నాయకుడొకరు రూ.4 వేల కోసం గంటలపాటు బ్యాంకు ముందు లైన్లో నిల్చున్నాడు. ఇదీ.. మా ప్రభుత్వ విజయం. ఏ స్థాయి వ్యక్తులనైనా ఉపేక్షించబోమనడానికి ఇంత కన్నా నిదర్శనం కావాలా?’అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు సంధించారు. తన దగ్గరున్న పాత నోట్లను మార్చుకునేందు రాహుల్ గాంధీ గత శుక్రవారం పార్లమెంట్ వీధిలోని ఎస్ బీఐకి వచ్చి, గంటపాటు లైన్ లోనే ఉండి కొత్త నోట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.