దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నోయిండా జంట భవనాల కేసులో నిర్మాణ కంపెనీకి సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. రెండు వారాల్లో 40 అంతస్థుల జంట భవనాల కూల్చివేత పనులు ప్రారంభించాలంటూ నోయిడా అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టును తప్పుదారి పట్టించినందుకు నిర్మాణ కంపెనీ డైరెక్టర్లను జైలుకి పంపించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది.
ఇదీ వివాదం
దేశ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే నోయిడాలో గ్రీన్ జోన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి సూపర్ టెక్ అనే సంస్థ 40 అంతస్థులతో రెండు జంట భవనాలు నిర్మించింది. ఇందులో మొత్తం 915 అపార్ట్‌మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్‌మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాక అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. గ్రీన్ జోన్ పరిధిలో నిర్మించినందుకు ఈ రెండు భవనాలు కూల్చేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
తప్పు తప్పే
అలహాబాద్ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది నిర్మాణ కంపెనీ. కేసు వివరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు 2021 ఆగస్టులో అలహాబాద్ కోర్టు తీర్పును సమర్థిస్తూ మూడు నెలల్లోగా జంట భవనాలు కూల్యేయాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దీంతో నిర్మాణ కంపెనీ తప్పు జరిగిందని ఒప్పుకుంటూ ఎంతో ఖర్చు చేసినందున కేవలం ఒక్క భవనం కూల్చేసి.. మరో భవనం ఉంచేయాలంటూ కోర్టుకి విన్నవించింది.
గడువు పూర్తైనా
జంట భవనాల కూల్చివేతకు సంబంధించిన కోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తైన ఎటువంటి కదలిక లేకపోవడంతో 2022 జనవరి 12న మరోసారి సుప్రీం ఈ కేసుపై దృష్టి సారించింది. పలుమార్లు ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం 2022 ఫిబ్రవరి 7 మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
రెండు వారాల్లో
జంట భవనాల కూల్చివేతకు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు కార్యాచరణ ప్రారంభించాలని నోయిడా సీఈవోకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోగా కూల్చివేత పనులు మొదలు కావాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికైనా కోర్టు తీర్పు అమలుకు సహకరించాలని లేదంటే
వడ్డీతో సహా
ఇక ఈ భవనంలో అపార్ట్‌మెంట్లు బుక్ చేసుకున్న 633 మందికి 12 శాతం వడ్డీతో సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులకు రూ. 2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం.
చదవండి: Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్
Comments
Please login to add a commentAdd a comment