దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా జంట భవనాల కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి నిబంధనలకు విరుద్ధంగా కట్టిన సూపర్‌టెక్ ఎమరాల్డ్ భవనాలు కూల్చేయబోతున్నారు. అందులో భాగంగా టెస్ట్ బ్లాస్ట్‌కి తేదీ, సమయం నిర్ణయించారు.
2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:00 గంటల వరకు టెస్ట్‌బ్లాస్ట్ చేయాలని నిర్ణయించారు. దీంతో జంట భవనాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలకు నోయిడా అధికారులు.ముందుస్తు జాగ్రత్తలు సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల వరకు సమీమ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. వీలయితే కిటీకీలు, తలుపులు మూసుకోవాలని సూచించారు. బాల్కనీల్లో, బిల్డింగ్‌ల పైకి ఎక్కి బ్లాస్టింగ్ చూడటం, వీడియోలు తీయడం వంటి పనులు చేయొద్దని తెలిపారు.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడా సెక్టార్ 93ఏలో రియల్టీ సంస్థ సూపర్ టెక్ ఎమరాల్డ్ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే 32వ అంతస్థు వరకు నిర్మాణ పనులు జరిగాక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టులో కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జంట భవనాలు కూల్చేయాలని తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు మేరకు నోయిడా పాలనాధికారులు ఎడిఫైస్ ఇంజనీరింగ్ అంట్ జెట్ డిమాలిషన్స్ అనే సంస్థకు కూల్చివేత పనులు అప్పగించారు. 2022 మే 22న కూల్చేయబోతున్నారు. అంతకంటే ముందు పేలుడు ప్రభావాన్ని అంచనా వేసేందుకు టెస్ట్ బ్లాస్ట్ జరుపుతున్నారు.
చదవండి: 40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్ టవర్స్ మాయం..!
Comments
Please login to add a commentAdd a comment