denim clothes
-
Fashion: స్టైల్‌తో పాటు వింటర్పై ఈజీగా విన్ అయ్యేలా.. డెనిమ్ వేర్
చలిగాలుల సందడి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న డ్రెస్సింగ్ స్టైల్‌కి కొత్త మార్పు రాబోతోంది. అది స్వెటర్ కావచ్చు లేదంటే శాలువా అవ్వచ్చు. కానీ, డెనిమ్ ఎంచుకుంటే.. స్టైల్‌తో పాటు వింటర్పై ఈజీగా విన్ అవ్వచ్చు. అందుకే, డెనిమ్ క్యాజువల్ వేర్ నుంచి కంఫర్ట్ వేర్‌గా ఆఫీస్ వేర్ నుంచి పార్టీవేర్‌గా సీజన్‌కి తగిన లుక్‌తో అట్రాక్ట్ చేసేస్తోంది. ఇండోవెస్ట్రన్ స్టైల్‌ను డెనిమ్ సూట్స్‌తో ఇట్టే తీసుకురావచ్చు. డెనిమ్ జాకెట్స్ చీరల మీదకూ ధరించవచ్చు. ఈ కాంబినేషన్‌కు ప్యాచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు. ఫంకీ జ్యువెలరీ ఈ స్టైల్‌కి బెస్ట్ ఎంపిక అవుతుంది. -
జీన్స్ జాకెట్
అమెరికాలో ఫ్యాక్టరీ వర్కర్లూ పొలాల్లో కష్టమైన పనులు చేసే కర్షకుల కోసం ప్రత్యేకంగా తయారైనదే ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్.అంత బలమైనది.. అంత చరిత్ర ఉన్నది ఇవ్వాళమహిళ ఓ కవచంలా ధరిస్తుంది.మహిళకు వచ్చిన స్వేచ్చకు జీన్స్ జాకెట్ ఒక సింబల్.అమ్మాయిలు అందంగా ఉండాలని అనుకునే ప్రపంచంలో ఇది ఒక అందమైన ధిక్కారం. చీర కు మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ జాబితాలో చేరిపోయింది. కాలానుగుణంగా, సౌకర్యంగా ఉండే విభిన్న రకాల బ్లౌజ్ డిజైన్స్ మ్యాచింగ్ లేకుండా ధరించడం ఇప్పటి ట్రెండ్. ఇది వింటర్సీజన్. వెచ్చగా చలి నుంచి రక్షణగా ఉండే బ్లౌజ్ అయితే బాగుండు అనుకునేవారూ, సంప్రదాయ శారీతోనే స్టైలిష్ లుక్‌తో వెలిగిపోవాలని చూసేవారికి డెనిమ్ జాకెట్స్ సరైన ఎంపిక. ►చీర రంగుకు మ్యాచ్ అయ్యే డెనిమ్ బ్లౌజ్‌ని డిజైన్ చేయించడం కొంచెం కష్టమైన పనే. కానీ, ఇప్పుడు రెడీమేడ్‌గానూ డెనిమ్ బ్లౌజ్‌లు లభిస్తున్నాయి. మ్యాచింగ్ కోరుకునేవారు బ్లౌజ్ కలర్ శారీని ఎంపిక చేసుకోవాలి. ►ప్లెయిన్ హ్యాండ్లూమ్ శారీకి ఎంబ్రాయిడరీ చేసిన డెనిమ్ బ్లౌజ్‌ను బోట్‌నెక్, షార్ట్ స్లీవ్స్‌తో డిజైన్ చేశారు. ►పొడవాటి డెనిమ్ జాకెట్ చీర మీదకు ధరించినప్పుడు మరీ క్యాజువల్‌గా అనిపించకుండా ఓ డిఫరెంట్ స్టైల్ తీసుకురావాలి. అందుకు బెల్ట్, సిల్వర్ జువెల్రీ సరైన ఎంపిక. ►ఇది పూర్తిగా వెస్ట్రన్ స్టైల్ డెనిమ్ బ్లౌజ్. ఇవి డెనిమ్ స్కర్ట్, ప్యాంట్ మీదకు టాప్స్లా ధరిస్తారు. దీనిని శారీకి జత చేర్చడంతో అల్ట్రామోడ్రన్ లుక్ వచ్చేసింది. ►సీజన్‌కి తగిన క్యాజువల్ లుక్ ఇది. డెనిమ్ లాంగ్ జాకెట్ ప్రింటెడ్ శారీ మీదకు ధరించడంతో వెస్ట్రన్ లుక్‌తో స్టైల్ ఆకర్షణీయంగా మారింది. ►డెనిమ్ జాకెట్ ధరించినప్పుడు బంగారు ఆభరణల అలంకరణకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. మోడ్రన్ లుక్ రావాలంటే జర్మన్ సిల్వర్ జువెల్రీని ధరించాలి. -
మందంగా... అందంగా!
‘అమ్మా! ఈ జీన్స్ ప్యాంటు ఇక వేసుకోను, ఒక్కసారికని తమ్ముడికిస్తే వాడు ప్యాంటు అంచులు చించేశాడు’ అనే కంప్లయింట్ కూతురి నుంచి. ‘అక్క ప్యాంటు పొడవుగా ఉంది, ఆడుకునేటప్పుడు అంచులు నేలకు తాకి నలిగిపోయింది నేనేం చేయను’ తన పొరపాటేమీ లేదన్నంత అమాయకంగా వస్తుంది కొడుకు నుంచి జవాబు. ‘సరే! ఇక చేసేదేముంది... ఆ ప్యాంటు అంచులు కత్తిరించి మడిచి కుట్టిస్తే సరి, ఈసారి పండక్కి తమ్ముడికి ప్యాంటు కొనక్కర్లేదు’ ఈ సమాధానంతో కూతురి ముఖం వెలిగిపోతుంది, కొడుకు ముఖం ఉక్రోషంతో ఎర్రబడుతుంది. కొంచెం అటూ యిటూగా ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్లు ఉండనే ఉంటాయి. పుట్టినరోజులు, పండుగలు ఇలా పిల్లలకు ఏడాదికి కనీసం నాలుగు నుంచి ఆరు జతలు తప్పనిసరిగా కొనక తప్పదు. వార్డ్రోబ్ నిండా లెక్కలేనన్ని డెనిమ్ క్లాత్ ప్యాంట్లు, షర్టులు చేరుతుంటాయి. పిల్లలు పైకి చెప్పరు కానీ లోలోపల ‘వీటిని వదిలించుకోవడం ఎలా’ అనుకుంటుంటారు. ‘జీన్స్ ప్యాంట్లు అన్ని షేడ్లలోనూ ఉన్నాయి. ఈ సారి బర్త్‌డేకి ఏ షేడ్ కొనుక్కోవాలి’ అనేది వాళ్లకో మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానంగా ఒక్కో ప్యాంటుని తీసి కత్తిరించి ముక్కలు చేయండి... ఆ ముక్కలను కలిపి ఇక్కడ ఫొటోల్లో ఉన్నట్లు కుట్టండి. దానికి అంచుగా మెత్తటి క్లాత్‌తో బోర్డర్ కుట్టండి. దట్టమైన క్విల్ట్ (బొంత) రెడీ అవుతుంది. పైగా వచ్చేది చలికాలం కూడ. చక్కగా ఉపయోగపడుతుంది. డెనిమ్ క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి వలయాకారపు డిజైన్ల జోలికి పోవద్దు. డెనిమ్ క్లాత్‌ని నలుచదరంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ కత్తిరించుకుంటే కుట్టడం సులువు. క్విల్ట్ ఆకర్షణీయంగా ఉండాలంటే రంగురంగుల క్లాత్‌ని పువ్వుల్లా కత్తిరించి ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు.