జీన్స్‌ జాకెట్‌ | Denim Fabric Woman Wearing a shield | Sakshi
Sakshi News home page

జీన్స్‌ జాకెట్‌

Published Fri, Jan 4 2019 1:45 AM | Last Updated on Fri, Jan 4 2019 1:45 AM

Denim Fabric Woman Wearing a shield - Sakshi

అమెరికాలో ఫ్యాక్టరీ వర్కర్లూ పొలాల్లో కష్టమైన పనులు చేసే కర్షకుల కోసం ప్రత్యేకంగా తయారైనదే ఈ డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌.అంత బలమైనది.. అంత చరిత్ర ఉన్నది ఇవ్వాళమహిళ ఓ కవచంలా ధరిస్తుంది.మహిళకు వచ్చిన స్వేచ్చకు జీన్స్‌ జాకెట్‌ ఒక సింబల్‌.అమ్మాయిలు అందంగా ఉండాలని అనుకునే ప్రపంచంలో ఇది ఒక అందమైన ధిక్కారం.

చీర కు మ్యాచ్‌ అయ్యే బ్లౌజ్‌ వేసుకోవడం అనే కాన్సెప్ట్‌ ఇప్పుడు ఓల్డ్‌ ఫ్యాషన్‌ జాబితాలో చేరిపోయింది. కాలానుగుణంగా, సౌకర్యంగా ఉండే విభిన్న రకాల బ్లౌజ్‌ డిజైన్స్‌ మ్యాచింగ్‌ లేకుండా ధరించడం ఇప్పటి ట్రెండ్‌. ఇది వింటర్‌సీజన్‌. వెచ్చగా చలి నుంచి రక్షణగా ఉండే బ్లౌజ్‌ అయితే బాగుండు అనుకునేవారూ, సంప్రదాయ శారీతోనే స్టైలిష్‌ లుక్‌తో వెలిగిపోవాలని చూసేవారికి డెనిమ్‌ జాకెట్స్‌ సరైన ఎంపిక. 

►చీర రంగుకు మ్యాచ్‌ అయ్యే డెనిమ్‌ బ్లౌజ్‌ని డిజైన్‌ చేయించడం కొంచెం కష్టమైన పనే. కానీ, ఇప్పుడు రెడీమేడ్‌గానూ డెనిమ్‌ బ్లౌజ్‌లు లభిస్తున్నాయి. మ్యాచింగ్‌ కోరుకునేవారు బ్లౌజ్‌ కలర్‌ శారీని ఎంపిక చేసుకోవాలి.

►ప్లెయిన్‌ హ్యాండ్లూమ్‌ శారీకి ఎంబ్రాయిడరీ చేసిన డెనిమ్‌ బ్లౌజ్‌ను బోట్‌నెక్, షార్ట్‌ స్లీవ్స్‌తో డిజైన్‌ చేశారు. 

►పొడవాటి డెనిమ్‌ జాకెట్‌ చీర మీదకు ధరించినప్పుడు మరీ క్యాజువల్‌గా అనిపించకుండా ఓ డిఫరెంట్‌ స్టైల్‌ తీసుకురావాలి. అందుకు బెల్ట్, సిల్వర్‌ జువెల్రీ సరైన ఎంపిక.

►ఇది పూర్తిగా వెస్ట్రన్‌ స్టైల్‌ డెనిమ్‌ బ్లౌజ్‌. ఇవి డెనిమ్‌ స్కర్ట్, ప్యాంట్‌ మీదకు టాప్స్‌లా ధరిస్తారు. దీనిని శారీకి జత చేర్చడంతో అల్ట్రామోడ్రన్‌ లుక్‌ వచ్చేసింది.

►సీజన్‌కి తగిన క్యాజువల్‌ లుక్‌ ఇది. డెనిమ్‌ లాంగ్‌ జాకెట్‌ ప్రింటెడ్‌ శారీ మీదకు ధరించడంతో వెస్ట్రన్‌ లుక్‌తో స్టైల్‌ ఆకర్షణీయంగా మారింది.

►డెనిమ్‌ జాకెట్‌ ధరించినప్పుడు బంగారు ఆభరణల అలంకరణకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. మోడ్రన్‌ లుక్‌ రావాలంటే జర్మన్‌ సిల్వర్‌ జువెల్రీని ధరించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement