denotify
-
ఏది న్యాయం? ఎవరిది ధర్మం?
నాకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. నాకు దేవుడి దయ, ఆశీర్వదించే ప్రజలు ఉన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అవ్వ, తాత తోడుగా నిలబడతారన్న నమ్మకం ఉంది. వారు అబద్ధాలను, కుట్రలను, మీడియాను, దత్తపుత్రుడిని, వారి పొత్తులను నమ్ముకుంటే.. నేను దేవుడి దయను, అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగుంటే జగనన్నకు తోడుగా నిలవండి. – సీఎం జగన్ ఆయన గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఇలా నాలుగేళ్లో, ఐదేళ్లో కాపురం చేసి.. ఎంతో కొంత డబ్బులిచ్చి విడాకులు ఇచ్చేసి.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే.. అలా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులు మనకు అవసరమా.. ఆలోచించండి. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని వారు, వెన్నుపోటు దారులు ఎన్నికల సమయంలో రంగు రంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. ఎన్నికల తర్వాత వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని కనీసం వెబ్సైట్లలో కూడా కనిపించకుండా చేస్తారు. ఇలాంటి వారంతా దుష్టచతుష్టయంగా ఏర్పడ్డారు. మీ బిడ్డ మీద.. మన ప్రభుత్వం మీద.. మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట? ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతుండటం ఆశ్చర్యం వేస్తోంది. రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, విజయవాడ: ‘ప్రజలకు మనం మంచి చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఆ పెద్ద మనిషి (చంద్రబాబు).. తన దత్తపుత్రుడి (పవన్ కళ్యాణ్)తో ఎలా తిట్టించారో అందరం చూశాం. మనం మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాట్లాడుతుంటే, కాదు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ ఆయన గారు సెలవివ్వడమూ విన్నాం. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మును ముందు మరెన్నో కుట్రలు కనిపిస్తాయి. వాటిన్నింటినీ తిప్పికొట్టి.. ఏది న్యాయం, ఎవరిది ధర్మమో ఆలోచించండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన 22(ఏ)1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనందరి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంటే దుష్టచతుష్టయం ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►మీ గ్రామంలో మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పులను గమనించండి. గ్రామ సచివాలయాలు, అందులో 10 మంది ఉద్యోగులైన మన పిల్లలు మనకు సేవలు అందిస్తూ.. ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకూ వలంటీర్ కనిపిస్తున్నారు. ప్రతి అడుగులోనూ మనకు మంచి చేస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నాడు. ►వివక్ష చూపకుండా, లంచాలు అడగకుండా 1వ తారీఖునే సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా, పండుగ అయినా ఇంటికి వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టి వెళ్తాడు. ►అదే గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతులను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తోంది. మన కళ్లెదుటనే పారదర్శకంగా ఈ–క్రాప్ జరుగుతోంది. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కల్తీ లేకుండా అందిస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో అండగా నిలుస్తున్నారు. ►మరో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రాక్టీçషనర్ అక్కడే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ 67 రకాల మందులిస్తూ.. 14 రకాల డయోగ్నిస్టిక్ టెస్టులు చేస్తూ.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా పని చేస్తున్నారు. ►ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు–నేడుతో స్కూళ్ల రూపు రేఖలను మార్చాం. డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టబోతున్నాం. మన గ్రామాలలో మన పిల్లల కోసం వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మన కళ్ల ఎదుటే గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. ►కాబట్టే మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని, సవినయంగా చెప్పుకుంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చెప్పుకోవడానికి ఏమీ లేనివాళ్లంతా, గతంలో ప్రజలకు ఏ మేలూ చేయని వారంతా ఈ రోజు ఏం చేస్తున్నారో గమనించండి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సీఎం వైఎస్ జగన్ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం అవనిగడ్డకు వరాల జల్లు.. ►అవనిగడ్డకు సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అడిగారు. అవనిగడ్డ–కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నా. కృష్ణానది కుడి, ఎడమ కరకట్ట.. సముద్రపు కరకట్టను పటిష్టం చేయడానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డలో కంపోస్ట్ యార్డు తరలించడానికి రూ.5–10 కోట్లు.. సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ.10–15 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మంజూరు చేస్తాం. ►ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, ఆర్కే రోజా, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థ సారధి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీధి రౌడీలను మించి బూతులు ►వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ఈ రోజు వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. నాయకులుగా చెప్పుకుంటున్న వారు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మన నాయకులా? ►అవ్వాతాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. దత్తపుత్రుడితో, దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అందరం చూస్తున్నాం. ►ఎవ్వరికీ, ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండి.. అని చెప్పుకుంటున్న వారి గురించి ఆలోచించండి. అలాగైతే రేపు మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన కూతుళ్ల పరిస్థితి ఏంటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ►వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు మేలు చేసిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మేలు చేయని పచ్చ రంగు పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతోంది. మరో 18–19 నెలల పాటు రోజూ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఆ దుష్టచతుష్టయం మోసాలను నమ్మొద్దు. ఆ పేపర్లను చదవొద్దు. ఆ టీవీలను చూడొద్దు. -
ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్
సీఎం జగన్ అవనిగడ్డ పర్యటన.. అప్డేట్స్ 12:50PM నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు 12:08PM సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవు రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో ఇబ్బందులు వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నాం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాం భూముల రీసర్వేతో రికార్టులను అప్డేట్ చేస్తున్నాం చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చేశాం రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం హద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందజేస్తాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం పేదవాడి బాగోగులను పట్టించుకునే ప్రభుత్వం మనది మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం వాగ్దాలను నెరవేర్చాం గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం మనది వాలంటీర్ వ్యవస్థతో నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు ఆర్బీకేల్లో విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సేవలు అవనిగడ్డ నియోజకవర్గంలో 15, 791 ఎకాలు, 10,019 మంది రైతన్నలకు ప్రయోజనం రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది ఆ భూములను డీనోటిఫై చేసి రైతన్నలకు మేలు చేశాం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశాం రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలన్నింటికీ పరిష్కారం దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణ మన పాలన, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి వెన్నపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదు దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతుంటే ఆశ్చర్యమేస్తోంది ఇది మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం పేదవానికి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం మనం ఎవరికీ అన్యాయం చేయలేదు మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే..కాదు మూడు పెళ్లిళ్లు వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు మీరు చేసుకోండి.. అని ఏకంగా టీవీల్లో చెబుతున్నారు అలా అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులా మనకు దిశ దశ చూపేది? దుష్టచతుష్టయంగా ఏర్పడి కలిసి కూటములు కడతారు వాళ్ల మాదిరిగా నేను కుట్రలు, మీడియాను నమ్ముకోలేదు నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా 11:51AM మంత్రి ధర్మాన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్ చెప్పారు భూములపై సీఎం జగన్ అన్ని హక్కులు కల్పించారు భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్ రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్ కల్పించారు 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్ ఆర్డర్ ఇచ్చారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం 11:30 అవనిగడ్డ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ 10:51AM అవనిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన మంత్రులు ధర్మాన, రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అధికారులు 10:00AM గురువారం అవనిగడ్డ పర్యటనలో భాగంగా.. గుంటూరులోని తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్. ► అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే రైతులకు భూపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సాగనుంది. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. -
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి: ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
రాజధానిలో పదివేల ఎకరాలు తరచూ మునక!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన భూమిలో పదివేల ఎకరాలు తరచూ ముంపునకు గురవుతున్నదిగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) తేల్చింది. ప్రధానంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవునా 7,300 క్యూసెక్కుల వరదనీరు కేపిటల్ సిటీ మీదుగా ప్రవహిస్తుందని పేర్కొంది. ఈ వరదలో మొత్తం 13,500 ఎకరాలు మునిగిపోతుందని, ఇందులో 10,600 ఎకరాలు కేపిటల్ సిటీలో ఉందని తేల్చింది. ఇందుకోసం కాంటూరు సర్వే చేయించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతల్ని ఆర్వీ అసోసియేషన్‌కు రూ.1.70 కోట్లకు అప్పగించింది. అలాగే వరద తీవ్రతను గుర్తించేందుకు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచించేందుకు అనుభవమున్న హైడ్రాలజికల్ కన్సల్టెంట్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా కృష్ణా బ్యారేజీ వద్ద నీటి అడుగుభాగంలో సర్వేకోసం ఐఐజీ టెక్నాలజీస్‌ను కన్సల్టెంట్‌గా నియమించింది. రూ.1.53 కోట్లకు ఈ బాధ్యతల్ని అప్పగించింది. కృష్ణా నది కాంటూరు టొపో షీట్‌ను రూపొందించడంతోపాటు కృష్ణా వరదకట్టల సమీపంలో నీటి అడుగున ఇసుక, పూడిక ఎంత ఉందో తేల్చనున్నారు. వరద కట్టల్ని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. కొండవీటివాగు ద్వారా వచ్చే వరదను నియంత్రించే చర్యలకు సంబంధించిన సర్వేను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా జియో టెక్నికల్ సర్వే బాధ్యతల్ని రూ.6.30 లక్షలకు ఎస్.శ్రీధర్ అనే వ్యక్తికి అప్పగించారు. భూపటిష్టత సామర్థ్యం ఈ సర్వే ద్వారా తేలనుంది. అదేవిధంగా రాజధానిలోని 29 గ్రామాల్ని ఇంటిగ్రేట్ చేసే బాధ్యతల్ని ఆర్వీ అసోసియేషన్‌కు రూ.2.10 కోట్లకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. 53 వేల ఎకరాల అటవీ భూమి డీ నోటిఫై రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అటవీ భూముల్ని డీ నోటిఫై చేయించి వాటిని పారిశ్రామికవేత్తలకు, వాణిజ్యవేత్తలకు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి అవసరమైతే అటవీ భూముల్ని డీ నోటిఫై చేస్తామని కేంద్రప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. అయితే రాష్ట్రప్రభుత్వం రాజధానికోసం రైతుల నుంచి భూముల్ని సమీకరించిన తరువాత ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు, ఇతర వాణిజ్యవేత్తలకు భూముల్ని కేటాయించేందుకు వీలుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 53 వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.