428 జీవో అమలయ్యేనా?
ఖానాపూర్ : ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగుల కొరత తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 1979-80 విద్యా సంవత్సరంలో వృత్తి విద్యాకోర్సులను ప్రారంభించిం ది. 1985లో సీఎంగా పనిచేసిన ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆది నారాయణ వృత్తి విద్యాకోర్సులు చదివిన వారికి సంబంధిత ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని 428 జీవో విడుదల చేశారు. వివిధ శాఖల్లో పనిచేసిన పలువురు కార్యదర్శులు ఈ జీవో అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పశువైద్యశాఖ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ తదితర శాఖల్లో మాత్రమే ఈ జీవో అమలవుతోంది. ఈ కోర్సులను ప్రారంభించినపుడు చదివిన వారి కి ఉద్యోగావకాశాలు లేవు అని చెబితే ఎవరూ ప్రవేశాలు పొందేవారు కాదు. కోర్సు ప్రారంభంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ప్రచారం చేసి తీరా కోర్సు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో ఈ వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసినవారు నిరాశకు లోనవుతున్నారు.
తమ విలువైన రెండేళ్ల కాల వ్యవధిని ఆయా ప్రభుత్వాలు వృథా చేశాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అప్పటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వృత్తి విద్యా కోర్సులు చదివిన తమతో ఆటలాడుకున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత శాఖల మం త్రులకు వినతిపత్రాలు అందించినా 428 జీ వో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హ యాంలోనైనా జీవోను పకడ్బందీగా అమలు చేయాలని కోర్సులు పూర్తి చేసిన తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.