deputy inspector
-
ఉగ్రవాదులకు పోలీసు సాయం..
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్ కూడా కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు. దొరికారిలా.. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్ ఎస్పీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు. కీలక మిలిటెంట్లు హతం.. జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్ ఫయాజ్ లోనె , ఫైజాన్ హమిద్, అదిల్ బాషిర్ మిర్ అలియాస్ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం
సాక్షి, టెక్కలి: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో మొదటిసారిగా ఏసీబీ దాడులు జరిగాయి. లంచం తీసుకుంటూ డీఐఎస్ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే) అధికారి నిమ్మక ఏకాశి ఏసీబీ అధికారులకు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో డివిజన్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూమి సబ్ డివిజన్ విషయంలో టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్ ఏకాశి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ బీ.వీ.ఎస్.ఎస్ రమణమూర్తి నేతృత్వంలో సీఐలు భాస్కరరావు, హరితోపాటు ఇతర సిబ్బంది శనివారం కార్యాలయం వద్ద మాటు వేసి మధ్యాహ్నం సమయంలో డీఐఎస్ ఏకాశి బాధితుడు క్రాంతి కిరణ్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వివరాలు సేకరించి అనంతరం కేసు నమోదు చేసి డీఐఎస్‌ను అరెస్టు చేశారు. భూమి సబ్ డివిజన్‌కు లంచం డిమాండ్.. నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్‌కు అదే మండలం పాలవలస సమీపంలో సర్వే నంబరు 244లోని 2ఏ, 3బీ, 4ఏ లో సుమారు 57 సెంట్లు, సర్వే నంబరు 246లోని 1బీ నంబరు 16 సెంట్లు భూమి ఉంది. ఎస్సీ కేటగిరిలో పెట్రోల్ బంక్ నిర్మాణం నిమిత్తం భూమిని సబ్ డివిజన్ చేసేందుకు జూలై 17న మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నారు. సర్వే ఫైలు నందిగాం తహసీల్దారు కార్యాలయం నుంచి టెక్కలి ఆర్డీఓ కార్యాలయానికి ఫైలు చేరింది. పలుమార్లు డీఐఎస్ ఏకాశి వద్దకు కిరణ్ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు రూ.5 లక్షలను డిమాండ్ చేసినట్లు క్రాంతి కిరణ్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తన జేబులో ఉన్న తక్కువ మొత్తాన్ని సైతం లాగేసుకున్నారని బాధితుడు వాపోయాడు. విసిగిపోయిన బాధితుడు గత రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా చేయడమే ఏసీబీ లక్ష్యం. ఈ విషయంలో బాధితులు ఆశ్రయిస్తే ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు. ప్రజలకు సేవ చేయడమే అధికారుల పని. ఈ విషయంలో లంచాన్ని ప్రొత్సహించకుండా ప్రజలే ప్రశ్నించాలి. –బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.. నందిగాం మండలం పాలవలస సమీపంలో తనకు చెందిన మొత్తం 73 సెంట్లను సబ్ డివిజన్ చేయాలని టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్ ఏకాశిని ఆశ్రయించాను. మొదట లేనిపోని కొర్రీలు పెట్టారు. చివరకు ఖర్చు అవుతుందని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. పలుసార్లు చిన్న మొత్తాల్లో నగదును వసూలు చేశారు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. –దడ్ల క్రాంతి కిరణ్, బాధితుడు -
ఏసీబీ వలలో యూఎల్సీ డిప్యూటీ ఇన్స్పెక్టర్
విశాఖ: విశాఖ అయప్పనగర్ ప్రాంతంలో ఉంటున్న విశాఖపట్నం అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకూ సుమారు రూ. 20 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. 1990లో రూ.1450 ల జీతంతో ఆయన ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి రాజేశ్వరరావు విశాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 2012-2016 మధ్య కాలం అంటే కేవలం నాలుగేళ్లలో అత్యధికంగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించామని డీఎస్పీ రమాదేవి తెలిపారు.