desert countries
-
ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!
కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల్లో దేశాల్లో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు రైతులు వాన నీటి సంరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటిలో ‘అర్ధ చంద్రాకారపు గుంతలు’ తవ్వటం ఒక పద్ధతి. చెట్టు చేమ కరువైన ప్రదేశాల్లో అరుదుగా కురిసే కొద్దిపాటి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి భూమిలోకి ఇంకింపజేయటంలో ఈ వినూత్న ఇంకుడు గుంతలు ఉపయోగపడుతున్నాయి. వెస్ట్ సహెల్‌లో రైతులు భూసారం కోల్పోయిన భూములను పునరుజ్జీవింపజేయటం కోసం, ఎడారీకరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతిలో లోతు తక్కువ గుంతలు తవ్వి సత్ఫలితాలు సాధించారు. వాలుకు అడ్డంగా అర్థ చంద్రాకారంలో గుంతలు తవ్వి, తవ్విన మట్టిని లోతట్టు వైపు గట్టుగా వేస్తే.. వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూమిలోకి ఎక్కువగా ఇంకుతోంది. నీరు ఇంకడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల భూమి పైపొర మట్టి కోతకు గురికాకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతోంది. ఎడారీకరణ బారిన పడిన రైతుల మొహాల్లో ఆనందాన్ని నింపుతుండటంతో వీటికి ‘జాయ్ పిట్స్’ అని కూడా పేరొచ్చింది! ఖర్చు, శ్రమ తక్కువ.. ఫలితం ఎక్కువ! అర్థ చంద్రాకార గుంతలు నిర్మించడం సులభం, ఖర్చు స్వల్పం. వాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న భూముల్లో నేల కోతను నియంత్రించేందుకు, వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎత్తులో వ్యత్యాసం దాదాపుగా బెత్తెడు ఎక్కువ ఉంటే వాలు 5% కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్మించేదెలా? మొదట భూమిపై వాలు వైపు తిరిగి నిలబడి అర్ధ చంద్రుని ఆకారాన్ని రెండు మీటర్ల వెడల్పుతో గీయాలి. రెండు పిడికిళ్ల (10 సెంటీమీటర్ల) లోతు మట్టిని తవ్వి, ఆ మట్టిని దిగువ వైపున కట్టగా వేయండి. కట్ట బలంగా ఉండాలంటే కట్ట కింది వైపు ఇరవై అంగుళాల వెడల్పు ఉండాలి. పైభాగం కనీసం సగం (10 అంగుళాల) వెడల్పు ఉండాలి. ఎత్తు అడుగు సరిపోతుంది. వర్షాకాలంలో చివరి నెలన్నరలో అర్ధ చంద్రాకార కందకాలను తవ్వాలి. అప్పుడు నేల తేమగా ఉంటుంది. తవ్వటం, గట్లు వేయటం సులభం అవుతుంది. ఎండా కాలంలో వానకు ముందు దీన్ని ఏర్పాటు చేయాలంటే కష్టం. అర్ధ చంద్రాకారపు గుంతలు తీయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పార, పలుగు చాలు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్.. తిన్నారా? అంతే సంగతి!) -
ఎడారి నగరాలను మించిన ఎండ..
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదే రోజు దుబాయ్, అబుదాబి, మస్కట్ వంటి ఎడారి నగరాల్లో ఉష్ణోగ్రత కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో రెండేళ్ల గరిష్టస్థాయిలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దుబాయ్‌లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని అంచనా కాగా. అబుదాబి, ఒమన్‌లలోనూ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఇక రాజస్ధాన్‌లోని బికనీర్, జోథ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి నగరాలను మించి భారత నగరాల్లో ఉష్ణోగ్రతలు నమోదవడం బెంబేలెత్తిస్తోంది. -
కారా‘ఘోరం’.. సౌదీ జైలులో వలస కార్మికులు
నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు ఆదుకోవాలంటూ ‘న్యూస్‌లైన్’కు ఫోన్ చేసిన బాధితులు కామారెడ్డి, న్యూస్‌లైన్: బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి మండలం రాజఖాన్పేటకు చెందిన విజయ్, ఎల్లంపేటకు చెందిన మోహన్, సదాశివనగర్ మండలం కన్నాపూర్‌కు చెందిన భిక్షపతి, తాడ్వాయి మండలం అర్గొండకు చెందిన సాయిలు, కొండాపూర్‌కు చెందిన రాంచందర్‌తోపాటు వివిధ ప్రాంతాలవారు ఇందులో ఉన్నారని వివరించారు. జైలులో సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గోడును భారత రాయబార కార్యాలయం అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి నాయకులకు ఫోన్లు చేసి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
ఈ రోజులు మాకొద్దు.. డొక్కలెండి.. ‘వలస’ బండి
తెలుగునేల నుంచి ఎడారి దేశాలకు.. పాలమూరు నుంచి ముంబై.. శ్రీకాకుళం నుంచి సూరత్.. రాయలసీమ నుంచి బెంగళూరు.. రోజూ వలసలే.. నిత్యకృత్యాలే.. కన్నతల్లి లాంటి పల్లె అన్నం పెట్టలేక మాడిపోవాలా?.. పనులు లేక బతుకులు వాడిపోవాలా?.. ఆరుగాలం కష్టపడ్డా ఐదు వేళ్లూ మూడు పూటలా నోట్లోకెళ్లని స్థితిలోనే బతకాలా?.. కాయకష్టం చేసుకుందామన్నా.. కళ్లెదుట పనేమీ లేకపోతే వలసబాట పట్టాలా?.. ఏ బాయిలో పడలేక, బొగ్గుబాయిలోనూ పనిదొరకక.. ముంబయి, దుబాయి పోవాలా? ఉన్న ఊరిని, కన్నవారిని.. కట్టుకున్నదానిని, కడుపున పుట్టినవారిని వదిలేసి వెళ్లాలా?.. అయినవారందరూ ఉన్నా.. ఎవరూ లేని అనాథలా బతకాలా? కడుపు చేతబట్టుకుని పరాయి రాష్ట్రంలో.. కానివారిలా జీవించాలా? పట్టెడన్నం కోసం.. పది రూకల కోసం దేశాలు పట్టిపోవాలా? లేక.. బువ్వ కరువై గంజికేడుస్తూ రోజులు వెళ్లదీయాలా? కన్నీళ్లు దిగమింగుకుంటూ కడుపులో కాళ్లు పెట్టుకుని కాలం గడపాలా? . ... వద్దు.. వద్దే వద్దు.. ఈ రోజులు మాకొద్దు అంటున్నారు కష్టజీవులు. పేదలను పట్టించుకోని పాలకులు అసలే వద్దంటున్నారు సగటు మనుషులు. ఉన్న ఊరు పచ్చగా కళకళలాడాలి.. పనులు చేసుకుంటూ హాయిగా బతికాలి అంటున్నారు. - సాక్షి నెట్వర్క్.