devadula pipeline
-
దేవాదుల పైపులైన్ లీకేజీ
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరి గూడెం శివారులో దేవాదుల పైపులైన్ గేట్ వాల్వు లీక్ అయింది. దీంతో పైప్లైన్ నుంచి 30 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. అలాగే ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండిరామారం వెళ్లే పైప్ లైన్ మూడుచోట్ల లీక్ అయింది. రెండో దశ దేవాదుల పైప్లైన్ నుంచి సుమారు మూడు గంటలుగా నీరు వృథాగా పోతున్నది. పంట పొలాల్లోకి నీరు భారీగా చేరుకుంది. -
ఫౌంటేన్ కాదు.. పైప్లైన్ లీక్ !
ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్ఘన్పూర్కు పంపింగ్ అవుతున్న దేవాదులు ఫేజ్ –1 పైప్లైన్ ఎయిర్వాల్వ్ బుధవారం ఉదయం రెండు చోట్ల లీక్ అయింది. మండంలోని పెద్దపెండ్యాల, తాటికాయల గ్రామశివార్లలో లీక్ కావడంతో పొలాల్లోకి నీరు వరదలా వచ్చింది. విషయం తెలుసుకున్న దేవాదుల ప్రాజెక్టు సిబ్బంది లీకేజీని సరిచేశారు. – ధర్మసాగర్ -
పగిలిన దేవాదుల పైప్లైన్
హసన్పర్తి: వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో బుధవారం రెండు చోట్ల దేవాదుల పైప్లైన్ పగిలింది. పైప్ నుంచి నీరు సుమారు 50 మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడుతోంది. సుమారు మూడు గంటల సేపు నీరు వృథాగా పోయింది. లీకేజీతో చుట్టుపక్కల పొలాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లా భారీ నీటిపారుదల శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ లీకేజీ అయింది. మధ్యాహ్నానికి అధికారులు వచ్చి మరమ్మత్తుల చేపట్టారు.