వేణువై వచ్చారు..
వెదురులోకి ఒదిగిన కుదురులేని గాలి.. హుస్సేన్‌సాగర్ అలల తరంగాలను తాకుతూ గానకేళిగా పల్లవించింది. వేణువై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మలయమారుతాల్లా ప్రతిధ్వనించారు. ట్రిబ్యూట్ టు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా పేరిట ట్యాంక్‌బండ్ మెయిన్ రోడ్‌లోని సెయిలింగ్ అనెక్స్‌లో ఆదివారం జరిగిన సుస్మిత, దేవప్రియ చటర్జీ సిస్టర్స్ వేణుగానం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.