devas multimedia
-
భారత ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిన పారిస్ కోర్టు..?
పారిస్ కోర్టు భారత ప్రభుత్వానికి గట్టి షాకిచ్చింది. గురువారం దేవాస్ వాటాదారులకు పారిస్‌లోని ఎయిర్ ఇండియాకు చెందిన ఒక అపార్ట్మెంట్ ఆస్తి మీద తాత్కాలిక హక్కులను కల్పిస్తూ పారిస్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ విలువ 3.8 మిలియన్ యూరోలు(సుమారు రూ.32 కోట్లు). "భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని దేవాస్ షేర్ హోల్డర్స్ సీనియర్ సలహాదారు జే న్యూమాన్ అన్నారు. పారిస్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దేవాస్ వాటాదారులు పారిస్ అప్ మార్కెట్ ప్రాంతంలోని ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. దేవాస్ వాటాదారులు జాతీయ క్యారియర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎయిర్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను కెనడాలోని క్యూబెక్ లోని కోర్టు కొట్టివేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. క్యూబెక్ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి మిచెల్ ఎ. పిన్సన్నాల్ట్ జనవరి 8న ఇచ్చిన తీర్పు ప్రకారం.. దేవాస్ వాటాదారులు అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం(ఐఏటీఏ) వద్ద ఉన్న ఎయిర్ ఇండియా నిధులలో 50 శాతం వరకు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విషయంపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే, అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి తర్వాత నిర్ణయం తీసుకొనున్నట్లు ఒక విమానయాన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మీడియా తెలిపారు. ఇండియా దేవాస్ మల్టీమీడియా కేసు జనవరి 2005లో ఆంట్రిక్స్ కార్పొరేషన్, ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీ మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీకి చెందిన రెండు ఉపగ్రహాలను ఆంట్రిక్స్ నిర్మించి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉపగ్రహాలను ఆపరేట్ చేయడానికి ఎస్-బ్యాండ్ 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని దేవాస్ మీడియాకు కేటాయించడానికి ఆంట్రిక్స్ కార్పొరేషన్ అంగీకరించింది. ఈ రెండు ఉపగ్రహాల సహాయంతో భారతదేశం అంతటా హైబ్రిడ్ శాటిలైట్, టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని యోచించింది. ఈ ఒప్పందాన్ని ఆంట్రిక్స్ ఫిబ్రవరి 2011లో రద్దు చేసింది. 2011 జూన్ నెలలో దేవాస్ మల్టీమీడియా ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ఆశ్రయించింది. 2015 సెప్టెంబరులో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇస్రో వాణిజ్య విభాగాన్ని 672 మిలియన్ డాలర్లు దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని కోరింది. ఈ నిర్ణయం ఆధారంగా దేవాస్ విదేశీ వాటాదారులు రికవరీ కోసం కెనడా అలాగే అమెరికాతో సహా చాలా దేశాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అందులో భాగంగానే పారిస్ కోర్టులో వారికి అనుకూలంగా వచ్చింది. (చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..!) -
దేవాస్ అబద్ధం చెప్పింది: సీబీఐ
న్యూఢిల్లీ: దేవాస్ మల్టీమీడియా సంస్థ స్థాపితమైన నెల రోజుల్లోనే.. తమ వద్ద మల్టీమీడియా సమాచారాన్ని సరఫరా చేసేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, దానిపై మేధో సంపత్తి హక్కులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి.. ఇస్రో వాణిజ్య సంస్థ యాంత్రిక్స్‌తో ఒప్పందం చేసుకుందని సీబీఐ ఆరోపించింది. దానివల్ల దేవాస్ షేర్ ధరలు ఏకంగా 1.25 లక్షల రెట్లు పెరిగిపోయిందని పటియాలా హౌస్ కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో తెలిపింది. అంతేగాకుండా దేవాస్ రూ. 579 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ రాబట్టుకోగలిగిందని చెప్పింది. -
భారత్ కు 1 బిలియన్ డాలర్ల జరిమానా!
ది హాగ్: బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీ మీడియాతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన ఆంథ్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోనుంది. రెండు కొత్త శాటిలైట్లను తయారుచేసి, వాటి వినియోగానికి ఎస్-బాండ్ స్పెక్ట్రమ్ ను లీజ్ కు ఇచ్చేందుకు దేవాస్ ఆంథ్రిక్స్ తో 2005లో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో ఇస్రో ద్వారా రెండు కొత్త శాటిలైట్లను నిర్మించి దేవాస్ కు అందించాల్సివుంది. శాటిలైట్ల నిర్మాణ అనంతరం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా తక్కువ ఖరీదు కలిగిన సెల్ ఫోన్లకు దేవాస్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 12 ఏళ్ల పాటు ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ని వినియోగించుకునేందుకు ఆంథ్రిక్స్ కు దేవాస్ రూ.578 కోట్లను చెల్లించింది. అప్పటికే 2జీ స్పెక్ట్రమ్ స్కాంతో సతమతమవుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2011 ఫిబ్రవరిలో దేవాస్ తో ఆంథ్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో స్పెక్ట్రమ్ కేటాయింపుల సమయంలో ఆంథ్రిక్స్ దేవాస్ కు ఎటువంటి కేటాయింపులు చేయలేదు. దాంతో చర్యలు చేపట్టిన దేవాస్ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడంపై 2015లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ లో కేసు వేసింది. దేవాస్ మల్టీమీడియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అర్ధాంతరం రద్దు చేయడం వల్ల దేవాస్ లో పెట్టుబడులు పెట్టిన వారందరూ నష్టాలపాలయ్యారని ట్రైబ్యునల్ పేర్కొంది. భారత ప్రభుత్వం దేవాస్ కు అన్యాయం చేసిందని వ్యాఖ్యనించింది. ట్రైబ్యునల్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల వద్ద భారత్ కు ఉన్న కీర్తి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా దాదాపు ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని భారత ప్రభుత్వం దేవాస్ కు చెల్లించే అవకాశం ఉంది. ఇస్రోకు చెందిన మాజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న దేవాస్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తనకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు వారిని ఉపయోగించిందని సమాచారం. దేవాస్ ఒప్పందంపై సంతకం చేసిన అప్పటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పుపై స్పందించిన మాధవన్ దేవాస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక ఆలోచన లేని చర్య అని వ్యాఖ్యనించారు.