development ..
-
బిందువే సిరుల సింధువు
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోళ్లోపల్లి రైతులను వర్షాభావం ఏళ్ల తరబడి పట్టి పీడించింది. అక్కడి రైతులు రాగి, సజ్జలు, ఉలవలు, అలసందలు, పెసర, మినుములు, పొద్దు తిరుగుడు మినహా ఇతర పంటలను సాగు చేయరు. కరవు కాటకాల వల్ల ఆరు తడి పంటలు సైతం ఏనాడూ పూర్తిగా చేతికందని దుస్థితి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం కొందరు కువైట్‌కు మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.దశాబ్దాల పాటు ఊళ్లో యువకులెవరూ కానరాని విచిత్రం ఆ ఊరి సొంతం. ఈ గ్రామంలో 1,800 కుటుంబాల్లో 134 మంది రైతులుండేవారు. సేద్యం కలిసిరాక 100 మందికి పైగానే గ్రామం నుంచి వలస వెళ్లారు. అప్పో సప్పో చేసి సేద్యం చేసే వారి సంఖ్య 30కి మించి ఉండేదికాదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా గ్రామంలో మోటారు సైకిల్ లేని ఇల్లు లేదు. ప్రతి పదిళ్లకూ ఒక కారు ఉంది. పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు.ఒకప్పుడు ఈ ఊరి యువకులకు పిల్లనివ్వడానికే సంకోచించేవారు. ఇప్పుడు సంబంధాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎందుకింత మార్పు అంటే..? సంక్షేమం ఆ గ్రామంలో ప్రతి తలుపూ తట్టింది. సేద్యంలో ఆ ఊరు గెలిచింది. సేద్యం లాభదాయకంగా మారి వలసలకు పగ్గాలు వేసింది. వేసిన పంటలు చేతికందుతున్నాయి. పెట్టుబడి పదింతలు మిగులుతోంది. పోళ్లోపల్లి రూపురేఖలను బిందుసేద్యం మార్చేసింది. కువైట్ నుంచి 90 శాతం స్వగ్రామానికి..ఒకప్పుడు అక్కడ పంటలకు నీటితడులు పెట్టేందుకు రాత్రనకా, పగలనకా చెలగ పార చేత పట్టుకుని పొలాల్లోనే కాపురాలు పెట్టేవారు. మోటారు కరెంటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పంటలు పండించడానికి ఇంటిల్లిపాదీ కష్టపడే వారు. ఇప్పుడు పగటి పూటే 9 గంటల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందుతుండడంతో నీటి తడుల కోసం బెంగలేకుండా పోయింది. కావాల్సినంత నీరందుతోంది. సూక్ష్మ సేద్యానికి సంక్షేమం తోడవడంతో వలస వెళ్లిన వారిలో నూటికి 90 మంది తిరిగి స్వగ్రామం బాటపట్టారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతుల సంఖ్య 230కి పెరిగింది. ఒకప్పుడు సొంత పొలాలనే ఖాళీగా వదిలేసిన రైతులు ఇప్పుడు పక్క ఊళ్లోని పొలాలనూ కౌలుకు తీసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు. 90 శాతం సబ్సిడీ (రూ.1.50 కోట్లు)తో నూరు శాతం విస్తీర్ణం (280 ఎకరాలు)లో బిందు పరికరాలను అమర్చుకున్నారు. బొప్పాయి, అరటి, జామ, సీతాఫలం.. ఇలా వివిధ రకాలను సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. సంక్షేమంతో గ్రామానికి రూ.7 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి డజనుకు పైగా సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులు రూ.7 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి పెరిగి పల్లె రూపురేఖలు మారాయి. సూక్ష్మసేద్యంతో ప్రభుత్వం తోడుగా నిలబడడంతో నాలుగేళ్లలో సుమారు రూ.1,500 కోట్లతో 6 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చుకుని 2.25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 7.33 లక్షల ఎకరాలకు విస్తరణ రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు బిందు, తుంపర సేద్యానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఐదేళ్లలో 7.33 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకొచ్చి 2.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సబ్సిడీ రూపంలో రూ.2,669.85 కోట్లు జమ చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.800.16 కోట్లూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఫార్సులున్న వారికే పరికరాలు ఇచ్చేవారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు సిఫార్సులకు తావులేకుండా, కుల, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులందరికీ పరికరాలిచ్చారు. రైతులు తమ వాటా చెల్లించిన 15 రోజుల్లోగానే నేరుగా వారి క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు చేసేందుకు తుంపర, బిందు పరికరాలపై కేంద్రం విధించే 12 శాతం జీఎస్టీలో 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా రూ.60 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది. రైతులకు రూ.1,034 కోట్ల పెట్టుబడి ఆదా సూక్ష్మసేద్యంలో గతేడాది జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి) ఏపీకి చెందినవే. బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేల ద్వారా, ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 36,650 టన్నుల ఎరువులు, 11,383 లక్షల యూనిట్ల విద్యుత్, 110 టీఎంసీల నీరు ఆదా కాగా, రైతులకు రూ.1,034 కోట్ల కూలీల ఖర్చు మిగిలిందని గుర్తించారు. కువైట్‌ను వీడి కన్నతల్లి ఒడికి.. పోళ్లోపల్లికే చెందిన సంగరాజు చంద్రశేఖర్‌రాజు సేద్యం కలిసి రాకపోవడంతో 17 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచి్చన ఆయన 90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. 2.5 ఎకరాల్లో పచ్చ అరటి సాగు చేశారు. రూ.1.50 లక్షలు వ్యయం కాగా , రూ.6 లక్షల ఆదాయం వచి్చంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి, సుగంధ అరటి, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. రైతు భరోసా సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.56 లక్షలు అందాయి. ‘ఇద్దరు పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నా. ఇక సేద్యం వదిలి పెట్టను. ఊళ్లోనే దర్జాగా జీవిస్తా’..నంటూ ధీమాగా చెబుతున్నారాయన. పిల్లలకు కార్పొరేట్ చదువులు.. వ్యవసాయం కలిసిరాక కువైట్ వెళ్లిన నా భర్త సుబ్బరాజు మూడేళ్ల కిందట సొంతూరొచ్చారు. 5 ఎకరాల్లో తైవాన్ జామ, మరో 5 ఎకరాల్లో అరటి, బొప్పాయి సాగు చేపట్టాం. ప్రభుత్వ సబ్సిడీతో ఫారం పాండ్‌తో పాటు 90 శాతం సబ్సిడీపై రూ.1.30 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు తీసుకున్నా. జామకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి జి–9 రకాన్ని వేశాం. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా రూ.1.13 లక్షల ఆరి్థక సాయం అందింది. బిందు సేద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తోడవడంతో అమ్మాయిని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోనూ, ఇద్దరు కుమారులను కార్పొరేట్ విద్యాసంస్థలో చదివిస్తున్నా. -ఉమ్మలరాజు సుజాత సమాజంలో గౌరవం పెరిగింది.. దినసరి కూలీగా పనిచేస్తూ ఐటీఐ చదువుకున్నా. ఉద్యోగం పేరిట మోసపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకున్న 4 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు సమకూర్చుకున్నా. బొప్పాయిలో మేలైన రెడ్ లేడీ రకం సాగు చేశా. ఏడాదిలో రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. రైతుభరోసా, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా రూ.65 వేల వరకు లబ్ధి పొందాం. ఆర్థిక పరిస్థితి‡ మెరుగుపడడంతో సమాజంలో గౌరవం పెరిగింది. –పందేటి కృష్ణమరాజు పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా.. 4.5 ఎకరాల్లో డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేస్తే 90 శాతం సబ్సిడీపై 2.61 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అమర్చారు. కోలియోసిస్ అనే మెడిసిన్ ప్లాంటేషన్ చేశా. ఎకరాకు సగటున రూ.15 వేలు ఖర్చు చేశా. రూ.2.80 లక్షల ఆదాయం వచి్చంది. డ్రిప్‌తో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ వేశా. రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు ఆదాయం తీశాను. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.91 లక్షల మేర లబ్ధి పొందా. ఫలితంగా పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా. బిందు సేద్యంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. సంక్షేమ ఫలాలు అందడంతో నిశి్చంతగా జీవిస్తున్నా. –మందా సుధాకర్ ఫలిస్తున్న సీఎం జగన్ కృషి ఉద్యాన హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఐదేళ్లలో రూ.2,670 కోట్ల సబ్సిడీ చెల్లించాం. 7.33 లక్షల ఎకరాలకు విస్తరించగలిగాం. –కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం..పోళ్లోపల్లికి చెందిన రైతు ఆనాల నరసింహులు 1989లో వ్యవసాయం భారమై బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ పడరాని పాట్లు పడి, సరైన సంపాదన లేక కుంగిపోయాడు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యంతో రైతులు లాభాలార్జిస్తున్నారని తెలిసి, నాలుగేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చి రెండెకరాల్లో నిమ్మ, 1.5 ఎకరాల్లో చీనీ వేశారు. నిమ్మ కాపు ప్రారంభమైన రెండేళ్లలోనే రూ.2.50 లక్షల ఆదాయం వచి్చంది.డ్రిప్ కోసం 2022లో ఆర్బీకేలో దరఖాస్తు చేసుకుంటే, సిఫార్సులతో పని లేకుండా 90 శాతం సబ్సిడీపై 3.5 ఎకరాల్లో రూ.62,934 విలువైన పరికరాలను అమర్చారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, డ్రిప్ ఇరిగేషన్‌తో సాగు సాఫీగా సాగుతోంది. కువైట్‌కు తిరిగి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేపట్టిన నరసింహులు లాభాలు గడిస్తున్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఆసరా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాల ద్వారా ఆయన కుటుంబం లబ్ధి పొందింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా, కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నట్లు ఎంతో ఆనందంగా చెప్పారాయన -
‘బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు’
భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ...తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా ఆయన బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి... ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ...సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
బస్తీమిత్రతో పెద్దమ్మగడ్డ అభివృద్ధి
మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వరంగల్ : బస్తీమిత్రతో నగరంలోని పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా కమిషనరేట్ పరిధిలో అభివృద్ధికి నోచుకోని 33 బస్తీలను గుర్తించి అక్కడ మౌలిక వసతులతో యువతకు ఉపాధి కల్పించేందుకే ‘బస్తీమిత్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పెద్దమ్మగడ్డలోని డ్రీమ్‌ల్యాండ్ గార్డెన్స్‌లో బుధవారం ‘బస్తీమిత్ర’ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చనే ఆలోచనలతో బస్తీమిత్రను రూపొందించామన్నారు. జిల్లాలోని ప్రైవేటు సంస్థల సహకారంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పా టు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసు అధికారులు బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. స్థానికులను చైతన్యవంతులుగా తీర్చిదిద్ది అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు. యువత మెళకువలు పెంపొందించుకునేందుకు బస్తీల్లో లైబ్రరీలు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బస్తీమిత్రలో భాగంగా ప్రతి బస్తీలో యువత, మహిళ, సీనియర్ సిటీజన్, ఉద్యోగుల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. నేర రహిత బస్తీగా పెద్దమ్మగడ్డను తీర్చిదిద్దేందుకు బస్తీమిత్ర కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. కాగా, జాబ్‌మేళాకు హాజరైన పెద్దమ్మగడ్డ యువకులకు క్రీడా సామగ్రితో పాటు ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం పెద్దమ్మగడ్డకు చెందిన పాస్టర్ పేర్ల చరణ్‌పాల్ తదితరులు సీపీని సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోడ డిన్నా, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, ఈశ్వర్రావు, రవీం దర్రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ముందుంటాం..
ట్రాఫిక్ నియంత్రణకు రింగ్ రోడ్డు పాలేరుకు భక్త రామదాసు నీళ్లు 2017 జూన్ నుంచి ఇంటింటికీ తాగునీరు కొత్తగా 238 కిలోమీటర్ల నేషనల్ హైవే స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి తుమ్మల సాక్షిప్రతినిధి, ఖమ్మం : బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ముందుంచుతామన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ శాఖల శకటాల ప్రగతిని వీక్షించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, లబ్ధిదారులకు పలు పథకాల యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తుమ్మల ప్రసంగించారు. రింగ్ రోడ్డుకు రూ.209 కోట్లు నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు మంజూరు చేశారు. సుమారు 41 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు నిర్మాణానికి సర్వే పనులు జరుగుతున్నాయి. అలైన్మెంట్, భూ సమీకరణ కోసం రూ.209కోట్లు మంజూరు చేశారు. హరితహారంలో జిల్లా ప్రథమం హరితహారంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 3.50 కోట్ల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేసి.. మరో 50 లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం అడవులను.. 33 శాతం వరకు పెంచేందుకు కృషి చేస్తున్నాం. దీనికోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ‘మిషన్’ పరుగులు మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 4,571 చెరువుల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాం. మొదటి దశలో రూ.244.11కోట్ల అంచనా విలువతో 833 చెరువులను అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టగా.. ఇప్పటివరకు రూ.127.56కోట్లు ఖర్చు చేసి 812 చెరువు పనులను పూర్తి చేసి.. 416.97 మి.ఘనపుటడుగుల నీటì సామర్థ్యాన్ని పునరుద్ధరించాం. రెండో దశలో రూ.319.90కోట్ల అంచనా వ్యయంతో 921 చెరువుల్లో పనులు చేపట్టగా.. ఇప్పటివరకు రూ.43.72కోట్ల వ్యయంతో 229 పనులు పూర్తి చేయగా.. దీనిద్వారా 288.42. మి.ఘనపుటడుగుల నీటి సామర్థ్యం పునరుద్ధరించాం. అక్టోబర్‌లో భక్త రామదాసు నీళ్లు జిల్లాలో మెట్ట ప్రాంతమైన తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 58,958 ఎకరాల ఆయకట్టు అభివృద్ధికి ఏర్పాటు చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–60 కాలువకు టైలెండ్ వల్ల సాగునీరందక రైతాంగం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రూ.91కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాం. ప్రాజెక్టుకు కావాల్సిన 33 కిలోమీటర్ల లైనుకు.. 17 కిలోమీటర్ల లైను పూర్తయింది. మిగిలిన పనులన్నీ అక్టోబర్ మాసాంతంలోగా పూర్తి చేసి.. ఈ ఏడాదిలోగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తాం. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 40 కిలోమీటర్ల మేర డిజైన్, అంచనాలు తయారయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2017లో ‘భగీరథ’ నీరు 2017 జూన్ నాటికి జిల్లాలో 326 ఆవాసాలకు, డిసెంబర్ వరకు 681, 2018 జూన్ వరకు 911 ఆవాసాలకు మంచినీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.572.22కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నాగార్జున సాగర్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాం. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో మరమ్మతులకు గురైన 17 ఎత్తిపోతలు, ఏజెన్సీలో 41 ఎత్తిపోతల పథకాలకు రూ.48.30కోట్లు కేటాయించాం. వాటి మరమ్మతులు పూర్తయితే ఈ ఖరీఫ్‌లోనే సాగునీరందుతుంది. అలాగే నూతనంగా ఏజెన్సీలో రూ.1149కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. రోడ్ నెట్ వర్కింగ్‌లో జిల్లా అగ్రస్థానం జిల్లాలో రూ.1440కోట్లతో 1350 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. వంతెనల నిర్మాణానికి రూ.194కోట్లు కేటాయించాం. కోదాడ, ఖమ్మం, మహబూబాబాద్ జాతీయ రహదారి పనులకు డీపీఆర్ అందజేశాం. సూర్యాపేట–ఖమ్మం, అశ్వారావుపేట–వరంగల్–ఖమ్మం, సారపాక, ఏటూరునాగారం, కౌతాల రహదారులను కేంద్రం జాతీయ రహదారులుగా ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన జాతీయ రహదారుల ప్రాజెక్టులో జిల్లాలో 238 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే జిల్లా రోడ్డు నెట్ వర్కింగ్‌లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఉపాధికి రూ.113కోట్ల ఖర్చు ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం రూ.113కోట్లు ఖర్చు చేసి.. 81 లక్షల పనిదినాలు కల్పించి.. జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రానున్న నెల రోజుల్లో 2.30లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వచ్ఛ భారత్ వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమంలో 9,700 మరుగుదొడ్లు నిర్మించాం. ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంక్షేమ రంగం కింద నిరుపేద విద్యార్థులకు రూ.74.15కోట్లు పంపిణీ చేశాం. 95 గ్రామ పంచాయతీలకు భవనాలు జిల్లాలో 95 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించనున్నాం. హరితహారం కింద 671 గ్రామ పంచాయతీల్లో 1.57 లక్షల మొక్కలు నాటాం. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, వికలాంగుల సంక్షేమ, స్వచ్ఛ భారత్ మిషన్, నెడ్‌క్యాప్, ఆరోగ్యశ్రీ, గిరిజన క్రాంతిపథకం, బ్యాంక్ లింకేజీలతో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి కల్పించాం. వేడుకల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోతు మదన్‌లాల్, మేయర్ డాక్టర్ పాపాలాల్, నేతలు పోట్ల నాగేశ్వరరావు, షేక్ బుడాన్ బేగ్, కొండబాల కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.