Development of farmers
-
సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్ గాంధీ
నాసిక్: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్ వివరించారు. గురువారం మహారాష్ట్రలో చాంద్వడ్లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు. -
సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యమైతే, నిజంగానే రైతుల అభివృద్ధిని కోరుకుంటే ఇదివరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణలో రైతులు కోరిన పద్ధతిలో పరిహారం చెల్లించాలన్నారు. ఒక్క మల్లన్న సాగర్ వ్యవహారంలోనే కాకుండా, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరిపే ప్రతీ చోటా 2013 చట్టాన్ని అమలు చేసి నిరుపేదలకు ఆదుకోవాలని లేఖలో కోరారు. జీఓ 123 అమలు ద్వారా బడుగు, బలహీన వర్గాలను బలి ఇస్తామంటే సహకరించడానికి తాము సిద్ధంగా లేమని లేఖలో రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
సాగులో ‘సహకార’o
ముథోల్ : సహకార సంఘం ఆ గ్రామ రైతులను అభివృద్ధి వైపు నడిపిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే విక్రయిస్తూ మరికొందరు రైతులకు చేయూతనిస్తోంది. పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడలపై అవగాహన కల్పిస్తూ.. సూచనలు, సలహాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. మండలంలో ని ఎడ్బిడ్ గ్రామంలో 2007 జనవరి మొదటి వారంలో 36 మంది రైతులు కలిసి మల్లికార్జున పరస్పర సహకార పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున చెల్లించారు. ఈ సంఘానికి చైర్మన్తోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లను ఎన్నుకున్నారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడి నుంచి రూ.50 చొప్పున సేకరించి పొదుపు చేస్తున్నారు. ప్రతీ నెల ఐదో తేదీన సమావేశం ఏర్పాటు చేసి సంఘం కార్యకలాపాలపై సమీక్షిస్తారు. ఇలా పొదుపు చేసిన డబ్బులతో రూ.15లక్షలు వెచ్చించి సంఘ భవనాన్ని నిర్మించారు. 36మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 46 మంది సభ్యులు ఉన్నారు. నాలుగేళ్లలో సంఘానికి పొదుపు, ఇతర వనరుల ద్వారా రూ.కోటీ 50లక్షలు సమకూరిందని సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు.