సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్ | Revanth Reddy comments on kcr | Sakshi
Sakshi News home page

సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్

Published Wed, Aug 17 2016 3:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్

సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్

సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యమైతే, నిజంగానే రైతుల అభివృద్ధిని కోరుకుంటే ఇదివరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణలో రైతులు కోరిన పద్ధతిలో పరిహారం చెల్లించాలన్నారు. ఒక్క మల్లన్న సాగర్ వ్యవహారంలోనే కాకుండా, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరిపే ప్రతీ చోటా 2013 చట్టాన్ని అమలు చేసి నిరుపేదలకు ఆదుకోవాలని లేఖలో కోరారు. జీఓ 123 అమలు ద్వారా బడుగు, బలహీన వర్గాలను బలి ఇస్తామంటే సహకరించడానికి తాము సిద్ధంగా లేమని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement