Devineni Rajasekhar
-
దేవినేని, వల్లభనేని మధ్య కల్వర్టు 'చిచ్చు'
తొలి నుంచీ ఉప్పు నిప్పులా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మధ్య కల్వర్టు కూల్చివేత ఘటన మరోసారి నిప్పురాజేసింది. గన్నవరం నియోజకవర్గంలో పట్టు నిలుపుకొనేందుకు నెహ్రూ ప్రయత్నిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో ఆయన జోక్యాన్ని వంశీ సహించడంలేదు. ఇద్దరు నేతల మధ్య ఈ అంతర్యుద్ధం ఎటు దారితీస్తుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సాక్షి, విజయవాడ : అధికార టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మధ్య అంతర్యుద్ధం మొదలైంది. విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు తదితర గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాల్లో పార్టీ పరంగా ఎమ్మెల్యే వంశీకి మంచి పట్టుంది. ఈ గ్రామాల్లో నెహ్రూ అనుచరులు ఉన్నారు. నెహ్రూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎవరి కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేసేవారు. నెహ్రూ టీడీపీలో చేరిన తరువాత ఇద్దరు నేతలు, వారి అనుచరులు ఆయా గ్రామాలపై పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే కావడంతో తనమాటే చెల్లాలనే ఆలోచనలో వంశీ, నియోజకవర్గంలో తనదైన ముద్ర చాటి తద్వారా పార్టీలో పట్టు మరింత బింగించాలనే ఆలోచనలో నెహ్రూ ఉన్నారు. ఈ దిశగా ఇద్దరు నాయకులు పావులు కదుపడంతో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోతోంది. కల్వర్టు కూల్చివేతపై వంశీ ఆగ్రహం ఎనికేపాడు బీవీ రావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు కాలువ మీదుగా రాక పోకలు సాగించడానికి ఏర్పాటు చేసిన కల్వర్టుకు రెండువైపులా ఉన్న గోడలను నెహ్రూ అనుచరులు శుక్రవారం రాత్రి పొక్లెయిన్‌తో కూల్చివేశారు. ఈ చర్యను అపార్టుమెంట్‌వాసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ శనివారం అక్కడకు వచ్చి నెహ్రూపై అగ్గిమీద గుగ్గిలమై అపార్టుమెంట్‌వాసులకు అండగా నిలబడ్డారు. తన నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం చేసుకోవడాన్ని వంశీ వ్యతిరేకించారు. చంద్రబాబు, రాష్ట్ర పార్టీ దృష్టికి వివాదం గన్నవరం నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం చేసుకోవడంపై వంశీమోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేశారని తెలిసింది. తన నియోజకవర్గంలో నెహ్రూ ఆధిపత్యాన్ని సహించనని తేల్చిచెప్పినట్లు సమాచారం. నెహ్రూ పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలకు అనుగుణంగా తమకు పూర్తి న్యాయం చేయాలని వంశీ డిమాండ్చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నెహ్రూ రాకపై వంశీ అసంతృప్తి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఎమ్మెల్యే వంశీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెహ్రూ పార్టీలోకి చేరే రోజున వంశీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ ఇబ్బందులను చర్చించారు. నెహ్రూ పార్టీలో చేరే కార్యక్రమానికి వారిద్దరూ దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఇద్దరి నేతల మధ్య విభేదాలు సమసిపోలేదు. గతంలో మాటల యుద్ధం నెహ్రూ కాంగ్రెస్‌లో ఉండగా.. వంశీ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. నువ్వెం తంటే... నువ్వెంత్వంటూ ఒకరికొకరు బహిరంగంగా సవాళ్లు విసురుకున్నారు. చివరకు వంశీ గన్నవరానికి వెళ్లడంతో ఆ వివాదం అప్పట్లో సమసింది. -
రూ. 20 కోట్ల ముడుపులు అందాయి అందుకే...
విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థ నుంచి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ. 20 కోట్లు ముడుపులు అందాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆరోపించారు. అందుకే సదరు మంత్రిగారు బాధితుల తరఫున నోరు మెదపడం లేదని విమర్శించారు. మంగళవారం దేవినేని నెహ్రూ విజయవాడలో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్న బృందంలో ఆర్థిక నేరగాళ్లు ఉన్నారన్న సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేరగాళ్లు, చినబాబు అనుచరులే విదేశాలకు వెళ్తున్నారని దేవినేని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారై పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ సమావేశం అవుతున్నారు. అందుకోసం నారా లోకేశ్ ఆదివారం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా మే 7వ తేదీన దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. అదికాక అగ్రిగోల్డ్ తమను నిలువునా ముంచిందంటూ బాధితులు సోమవారం విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బాధితుల ర్యాలీని అడ్డుకుని... బాధితులను పోలీసు స్టేషన్ కు తరలించారు. మంగళవారం పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు రూ. 7 వేల కోట్లు మేర డిపాజిట్లు చేశారు. అనంతరం అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసింది. ఇంత జరిగిన ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ప్రజల తరపున నోరు మెదపకపోవడంతో దేవినేని నెహ్రూపై విధంగా స్పందించారు. -
రాజధాని చెరి సగం కావాలి
విజయవాడను విస్మరిస్తే జనం క్షమించరు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత విజయవాడను రాజధానిగా ప్రకటించి న సీఎం చంద్రబాబు ఇప్పుడు గుంటూరు పాట పాడటం వెనుక కోటరీ ప్రభావం ఉందన్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రైతాంగం సిద్ధంగా ఉందన్నారు. నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయన్నారు. తుళ్లూరు, వెంకటాయపాలెం ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదన్నారు. కృష్ణాజిల్లాను కలుపుకొని రాజధాని ఏర్పాటు చేయాలన్నదే తన డిమాండ్‌గా పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాను విస్మరిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించరన్నారు. గతంలోనే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాను కాబట్టి.. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం లేదనుకునే ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తే తెలుగుజాతి క్షమించదన్నారు. రాజధాని నిర్మాణానికి సుజనా చౌదరి, జీఎంఆర్ అల్లుడి వంటి కార్పొరేట్ శక్తులతో కాకుండా సాంకేతిక నిపుణులతో కమిటీ వేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కృష్ణాజిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని నెహ్రూ చెప్పారు. కోట్లు గుమ్మరించి గుంటూరు జిల్లాలో భూములు కొనాలనుకోవడం వెనుక బాబు కోటరీ చక్రం తిప్పుతోందన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. ఇంత జరుగుతున్నా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చెప్పే ప్రతి మాటకు తలలు ఊపడం మాని విజ్ఞతతో ఆలోచించాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు దమ్ముంటే న్యాయవిచారణ జరిపించాలన్నారు. తప్పు చేసినట్లు రుజువైతే జైలుకెళ్లడానికి తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబులా బెయిల్ తెచ్చుకోబోమని దేవినేని నెహ్రూ ఎద్దేవా చేశారు. -
వైభవంగా మంత్రి గంటా కుమార్తె వివాహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత వివాహం బుధవారం విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. సాయి పూజితకు పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకట్రామ్ ప్రశాంత్‌తో జరిగిన ఈ వివాహానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఉదయం 9.05 గంటలకు జరిగిన వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి, ఎంపీలు లగడపాటితోపాటు పలువురు రాష్ట్రమంత్రులు, సినీనటులు వివిధ శాఖల ఉన్నతాధికారులు భారీగా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి వివిధ ప్రాంతాలనుంచి రకరకాల వంట నిపుణులను తీసుకువచ్చి అతిథులకు విందు ఏర్పాటుచేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సినీ నిర్మాత రామానాయుడు, వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, దాడివీరభద్రరావు, సోమయాజులు, జ్యోతుల నెహ్రూ, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఈ వివాహానికి హాజరయ్యారు. దేవినేని రాజశేఖర్ కుమారుని నిశ్చితార్థానికి సీఎం విజయవాడ: మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ కుమారుడు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా ఎ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.