వైభవంగా మంత్రి గంటా కుమార్తె వివాహం | Ganta Srinivasa Rao Daughter Grand Wedding | Sakshi
Sakshi News home page

వైభవంగా మంత్రి గంటా కుమార్తె వివాహం

Published Thu, Dec 26 2013 2:03 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Ganta Srinivasa Rao Daughter Grand Wedding

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత వివాహం బుధవారం విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. సాయి పూజితకు పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకట్‌రామ్ ప్రశాంత్‌తో జరిగిన ఈ వివాహానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఉదయం 9.05 గంటలకు జరిగిన వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

కేంద్రమంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి, ఎంపీలు లగడపాటితోపాటు పలువురు రాష్ట్రమంత్రులు, సినీనటులు వివిధ శాఖల ఉన్నతాధికారులు భారీగా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి వివిధ ప్రాంతాలనుంచి రకరకాల వంట నిపుణులను తీసుకువచ్చి అతిథులకు విందు ఏర్పాటుచేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సినీ నిర్మాత రామానాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, దాడివీరభద్రరావు, సోమయాజులు, జ్యోతుల నెహ్రూ, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఈ వివాహానికి హాజరయ్యారు.

దేవినేని రాజశేఖర్ కుమారుని నిశ్చితార్థానికి సీఎం
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ కుమారుడు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా ఎ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement